Bitcoin : మూడు నెలల్లో తొలిసారి…దూసుకుపోతున్న బిట్ కాయిన్ ధర

బిట్ కాయిన్ ధర మళ్లీ క్రమంగా పెరుగుతోంది. కొన్ని వారాలుగా 30-40 వేల డాలర్ల మధ్యలో ఊగిసలాడుతూ వచ్చిన బిట్ కాయిన్ ధర ఇప్పుడు మళ్లీ రికవరీ బాట పట్టింది.

Bitcoin : మూడు నెలల్లో తొలిసారి…దూసుకుపోతున్న బిట్ కాయిన్ ధర

Bitcoin

Bitcoin బిట్ కాయిన్ ధర మళ్లీ క్రమంగా పెరుగుతోంది. కొన్ని వారాలుగా 30-40 వేల డాలర్ల మధ్యలో ఊగిసలాడుతూ వచ్చిన బిట్ కాయిన్ ధర ఇప్పుడు మళ్లీ రికవరీ బాట పట్టింది. మూడు నెలల్లో తొలిసారిగా ఇవాళ(ఆగస్ట23,2021) బిట్ కాయిన్ ధర 50 వేల డాలర్ల పైకి చేరింది.

మార్కెట్ క్యాపిటలైజేషన్(943.90 బిలియన్ డాలర్లు) పరంగా అతిపెద్ద క్రిప్టోకరెన్సీగా కొనసాగుతున్న బిట్ కాయిన్ ధర సోమవారం మధ్యాహ్నాం 2గంటల 45 నిమిషాల సమయానికి 2.18 శాతం పెరుగుదలతో 50,213 డాలర్లకు(భారతీయ కరెన్సీలో రూ.37 లక్షల 27వేలు)పెరిగింది. మే నెల నుంచి చూస్తే ఇదే గరిష్ట స్థాయి కావడం గమనార్హం. క్రిప్టో కరెన్సీపై ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరగడమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

కాగా, ఏప్రిల్ మధ్యలో బిట్ కాయిన్ ధర రికార్డు స్థాయిలో 65 వేల డాలర్లకు చేరిన విషయం తెలిసిందే. ఇది ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి. అక్కడి నుంచి బిట్ కాయిన్ ధర తగ్గుతూ వచ్చింది. మళ్లీ ఇప్పుడు క్రమంగా రికవరీ చెందుతూ వస్తోంది. అయితే గత ఏడాదితో పోలిస్తే బిట్ కాయిన్ ధర ఇప్పటికీ పైనే ఉంది.

మరోవైపు, బిట్ కాయిన్ తర్వాత మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా రెండవ అతిపెద్ద క్రిప్టోకరెన్సీగా ఉన్న ఈథర్ కాయిన్ 3321 డాలర్లకు పెరిగింది.