Solar Storm Hit Earth : భూమిని ఢీకొట్టనున్న భారీ సౌర తుఫాను.. కమ్యూనికేషన్ వ్యవస్థపై తీవ్ర ప్రభావం!

సూర్యుడిలో చెలరేగిన సౌర తుఫాను భూమివైపు దూసుకొస్తోంది. ఈ తుఫాను భూమికి చేరువులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు మధ్యాహ్నం భూమి అయస్కాంత క్షేత్రాన్ని సౌర తుఫాను తీవ్రవేగంతో ఢీ కొట్టే ఛాన్స్‌ ఉంది.

Massive solar storm set to hit Earth: సూర్యుడిలో చెలరేగిన సౌర తుఫాను భూమివైపు దూసుకొస్తోంది. ఈ తుఫాను భూమికి మంగళవారం (జూలై 13) చేరువులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు మధ్యాహ్నం భూమి అయస్కాంత క్షేత్రాన్ని సౌర తుఫాను తీవ్రవేగంతో ఢీ కొట్టే ఛాన్స్‌ ఉంది. దీని కారణంగా జీపీఎస్‌, ఫోన్‌ సంకేతాలు ప్రభావితమవుతాయి. సూర్యుడి స్వీయ భ్రమణం, పాలపుంతలోని ఇతర నక్షత్రాల ప్రభావం వల్ల.. సూర్యుడి అయస్కాంత ధ్రువాలు ప్రతి 11 ఏళ్లకోసారి తారుమారు అవుతుంటాయి. అంటే ఉత్తర ధ్రువం దక్షిణంగా, దక్షిణ ధ్రువం ఉత్తరంగా మారుతుంటాయి.

ఈ క్రమంలో అయస్కాంత శక్తి చిక్కుపడి ప్లాస్మా విస్ఫోటనం చెంది సౌర తుఫానులు ఏర్పడుతాయి. ప్రతి పదకొండేళ్లకు ఇలా సౌర తుఫానులు ఏర్పడుతున్నా.. కొన్నిసార్లు మామూలుగా, మరికొన్నిసార్లు అత్యంత శక్తివంతంగా ఉంటాయి. అవన్నీ కూడా అంతరిక్షంలో వివిధ దిక్కుల్లోకి విడుదలవుతుంటాయి. కొన్నిసార్లు మాత్రమే భూమి వైపు వస్తుంటాయి. సౌర తుఫానుల కారణంగా విద్యుదయస్కాంత తరంగాలపై ఆధారపడి పనిచేసే కమ్యూనికేషన్‌ వ్యవస్థలపై ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా శాటిలైట్‌ సిగ్నళ్లు, జీపీఎస్‌ నావిగేషన్, మొబైల్‌ ఫోన్‌ సిగ్నళ్లు, డీటీహెచ్‌ ప్రసారాల్లో అంతరాయం ఏర్పడుతుంది. సౌర తుఫాను మరీ తీవ్రంగా ఉంటే పరికరాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది.

జియోమాగ్నెటిక్ తుఫాను అంటే ? :
భూ అయస్కాంత తుఫాను అనేది.. భూమి అయస్కాంతగోళానికి తీవ్ర అంతరాయం. సౌర గాలి తరంగాల నుంచి భూమికి చుట్టుపక్కల ఉన్న అంతరిక్ష వాతావరణంలోకి దూసుకొస్తుంది.

National Oceanic and Atmospheric Administration (NOAA) ప్రకారం.. తుఫాను సౌర గాలుల ద్వారా ఉత్పత్తి అవుతుంది. భూ అయస్కాంత తుఫాను ఏర్పడాలంటే సౌర గాలి ఎక్కువ కాలం అధిక వేగంతో ఉండాలి. అప్పుడే సౌర గాలి భూమి అయస్కాంత క్షేత్రంలోకి దూసుకురాగలదు.

ట్రెండింగ్ వార్తలు