Matter: ఎలక్ట్రిక్ మోటార్‌బైక్ AERA కోసం ప్రత్యేక ప్రీ-బుక్ ఆఫర్‌ను ప్రకటించిన Matter

సాంకేతికత, ఆవిష్కరణల ద్వారా, MATTER AERA మొబిలిటీ మార్చడానికి, కొత్త అనుభవాలను అందించడానికి, రైడింగ్ యొక్క భవిష్యత్తును పునర్నిర్వచించటానికి సెట్ చేయబడింది. ఎలక్ట్రిక్ మొబిలిటీని ముందుగా స్వీకరించేవారు, ఆవిష్కర్తలు AERAని ముందస్తుగా బుక్ చేసుకోగలరని కంపెనీ తెలిపింది

Matter has announced a special pre-book offer for the electric motorbike AERA

AERA: సాంకేతిక ఆవిష్కరణల ఆధారిత స్టార్టప్ అయిన MATTER, దాని ఫ్లాగ్‌షిప్ మోటార్‌బైక్ MATTER AERA ప్రీ-బుకింగ్‌ ప్రారంభించింది. ఈరోజు (మే 17) నుంచి matter.in, flipkart.com లేదా otocapital.in ద్వారా దేశంలోని 25 జిల్లాల్లో ఆన్‌లైన్ ప్రీ-బుకింగ్ తెరిచింది. ప్రీ బుక్ సిటీలు/జిల్లాలు: హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, కృష్ణా, బెంగళూరు, మైసూర్, చెన్నై, కోయంబత్తూర్, మధురై, ముంబై, నవీ-ముంబై, థానే, రాయగఢ్, పూణే, నాగ్‌పూర్, నాసిక్, అహ్మదాబాద్, గాంధీనగర్, సూరత్, వడోదర, జైపూర్, ఇండోర్, ఢిల్లీ, పాట్నా, లక్నో, కాన్పూర్, గౌహతి, కమ్రూప్, కోల్‌కతా, భువనేశ్వర్, కటక్, కోర్ధా.

Toyota Kirloskar Motor: మొదటి ‘గ్రేట్ 4×4 X-పెడిషన్’ ప్రకటించిన టయోటా కిర్లోస్కర్ మోటర్

సాంకేతికత, ఆవిష్కరణల ద్వారా, MATTER AERA మొబిలిటీ మార్చడానికి, కొత్త అనుభవాలను అందించడానికి, రైడింగ్ యొక్క భవిష్యత్తును పునర్నిర్వచించటానికి సెట్ చేయబడింది. ఎలక్ట్రిక్ మొబిలిటీని ముందుగా స్వీకరించేవారు, ఆవిష్కర్తలు AERAని ముందస్తుగా బుక్ చేసుకోగలరని కంపెనీ తెలిపింది. దాని ద్వారా ప్రత్యేక పరిచయ ధరలు, ఎర్లీ బర్డ్ ఆఫర్‌లు, ఎర్లీ బర్డ్ ప్రీ-బుకింగ్ మొత్తం వంటి ప్రయోజనాలను పొందగలుగుతారని పేర్కొంది.

Matter has announced a special pre-book offer for the electric motorbike AERA

MATTER AERA మొదటి 9,999 ప్రీ-బుకింగ్‌లకు రూ. 5,000/- ప్రత్యేక ధర ప్రయోజనం అందిస్తారు; వినియోగదారులు RS 1999/- తో ప్రీబుక్ చేయవచ్చు.
* 10,000 నుంచి 29,999 ప్రీ-బుకింగ్‌ల వరకు, MATTER AERA రూ. 2,500/- ప్రత్యేక ప్రయోజనంతో అందించబడుతుంది; వినియోగదారులు రూ. 2999/- తో ప్రీ-బుక్ చేయవచ్చు.
* ఆపై, కస్టమర్‌లు RS 3999/- తో ప్రీబుక్ చేసుకోవాలి.
* ఒక ప్రీ-బుకింగ్ చేసి రద్దు చేసుకుంటే బుకింగ్ సొమ్ము తిరిగి చెల్లించబడుతుంది.