Toyota Kirloskar Motor: మొదటి ‘గ్రేట్ 4×4 X-పెడిషన్’ ప్రకటించిన టయోటా కిర్లోస్కర్ మోటర్

పంచవ్యాప్తంగా టయోటా SUVల శక్తివంతమైన శ్రేణికి ప్రసిద్ధి చెందింది. భారతదేశంలో కూడా శక్తివంతమైన, బహుముఖ 4x4 ఆఫర్‌ను కలిగి ఉంది. Hilux, Fortuner 4X4, LC 300, అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌లు తమ ఉనికిని కలిగి ఉండటంతో భారీ సంఖ్య లో అభిమానులను సంపాదించుకున్నాయి

Toyota Kirloskar Motor: మొదటి ‘గ్రేట్ 4×4 X-పెడిషన్’ ప్రకటించిన టయోటా కిర్లోస్కర్ మోటర్

Updated On : May 17, 2023 / 7:31 PM IST

4X4 X pedition: టయోటా కిర్లోస్కర్ మోటర్ (TKM) దేశవ్యాప్తంగా ఉన్న మోటరు ప్రేమికుల కోసం 4×4 అనుభవపూర్వక డ్రైవ్స్ మొట్టమొదటి కార్యక్రమాన్ని బుధవారం ప్రకటించింది. ‘గ్రాండ్ నేషనల్ 4×4 ఎక్స్-పెడిషన్’ నాలుగు జోన్లలో (ప్రాంతీయ స్థాయి- నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్) నిర్వహించేందుకు టయోటా ఈ సంవత్సరం ప్రణాళిక చేసింది. ఈ డ్రైవ్‌లు దేశవ్యాప్తంగా 4×4 SUV కమ్యూనిటీని చేరుకునేలా రూపొందించబడ్డాయి. ఇవి థ్రిల్లింగ్ ఆఫ్-రోడింగ్ అనుభవాలను అందిస్తాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారిని వారిలో దాగిన సాహసోపేత భావనలతో అనుసంధానించడానికి, హద్దులను అధిగమించడానికి, కొత్త ప్రాంతాలను అన్వేషించడానికి తద్వారా ‘మాస్ హ్యాపీనెస్’ని అందించడానికి వారిని ప్రేరేపించాలని TKM కోరుకుంటుంది.

Gmail Account : మీ జీమెయిల్ అకౌంట్ ఇలా ఉంటే.. గూగుల్ డిలీట్ చేస్తుంది జాగ్రత్త.. ఎందుకో తెలిస్తే షాకవుతారు..!

ప్రతి జోనల్ ఈవెంట్‌లో SUVల కాన్వాయ్‌ పాల్గొంటుంది. వీటిలో ప్రముఖ మోడల్స్ అయిన లెజెండరి Hilux, Fortuner 4X4, LC 300 సహా హై రైడర్‌ AWD (ఆల్ వీల్ డ్రైవ్) ఉంటాయి. ఇంకా, ఈ వినూత్న మైన డ్రైవ్ ప్రత్యేకత ఏమిటంటే, భారతదేశంలో టయోటా నిర్వహించే మొట్టమొదటి గ్రేట్ 4×4 X-పెడిషన్‌లో ఇతర SUV బ్రాండ్ యజమానులు కూడా పాల్గొననున్నారు. మహోన్నత మైన ఆఫ్-రోడింగ్‌ను అందించాలనే ఉద్దేశ్యంతో, TKM అనేక సవాళ్లతో కూడిన అడ్డంకులతో అదనపు 4WD ట్రాక్‌లను రూపొందించింది. వీటిలో ఆర్టిక్యూలేషన్, సైడ్ ఇంక్లైన్‌లు, రాంబ్లర్, స్లష్, రాకీ బెడ్ మొదలైనవి ఉంటాయి.

Hero Motocorp: హై-టెక్ ఫీచర్‌లతో వస్తున్న అడ్వెంచర్ మోటార్‌సైకిల్ XPULSE 200 4V

ప్రపంచవ్యాప్తంగా టయోటా SUVల శక్తివంతమైన శ్రేణికి ప్రసిద్ధి చెందింది. భారతదేశంలో కూడా శక్తివంతమైన, బహుముఖ 4×4 ఆఫర్‌ను కలిగి ఉంది. Hilux, Fortuner 4X4, LC 300, అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌లు తమ ఉనికిని కలిగి ఉండటంతో భారీ సంఖ్య లో అభిమానులను సంపాదించుకున్నాయి. ప్రతి ప్రయాణాన్ని విశేషమైనదిగా మార్చడానికి సంపూర్ణంగా సరిపోయే అధునాతన శైలి, సాటిలేని దృఢత్వం, శక్తివంతమైన పనితీరు వీటిలో ఉంది. టయోటా యొక్క ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం ఈ అనుబంధాన్ని మరింత బలోపేతం చేయడానికి పుష్కలమైన అవకాశాలను సృష్టిస్తుంది. ఆన్-రోడ్, ఆఫ్-రోడ్ రెండింటిలోనూ క్యూరేటెడ్ డ్రైవ్‌ల ద్వారా కొత్త అనుభవాలను అందిస్తుంది.