Mercedes-Benz EQA SUV : కొత్త కారు కొంటున్నారా? అద్భుతమైన ఫీచర్లతో మెర్సిడెస్ బెంజ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ వచ్చేస్తోంది!

Mercedes-Benz EQA SUV Launch : అతి త్వరలో భారతీయ మార్కెట్లో లాంచ్ చేసేందుకు ఈక్యూఏ మోడల్ రెడీగా ఉంది. ఈక్యూఏ ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్ భారత మార్కెట్లో నాల్గవ ఈవీ కారు అవుతుంది. 

Mercedes-Benz EQA electric SUV ( Image Credit : Google )

Mercedes-Benz EQA Launch : కొత్త ఎలక్ట్రిక్ కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ప్రముఖ జర్మన్ ఆటోమేకర్ మెర్సిడెస్-బెంజ్ ఇండియా నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ కారు వస్తోంది. అతి త్వరలో భారతీయ మార్కెట్లో లాంచ్ చేసేందుకు ఈక్యూఏ మోడల్ రెడీగా ఉంది. ఈక్యూఏ ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్ భారత మార్కెట్లో నాల్గవ ఈవీ కారు అవుతుంది.

Read Also : 5 Most Affordable SUVs : హ్యుందాయ్ ఎక్స్‌టర్ నుంచి టాటా నెక్సాన్ వరకు.. 6 ఎయిర్‌బ్యాగ్‌లతో అత్యంత సరసమైన 5 ఎస్‌యూవీ కార్లు

మెర్సిడెస్ బెంజ్ ఇండియా దేశంలో ఈవీ మోడళ్ల లైనప్‌ను మరింత చేర్చనుంది. ఇప్పటివరకూ మొత్తం ఆరు మోడళ్లను ప్రవేశపెట్టింది. అందులో EQB SUV, EQE SUV, EQS మోడల్ ఎస్‌యూవీలు ఉండగా కొత్తగా EQA మోడల్ ఒకటి వచ్చి చేరింది. దాంతో ఈక్యూఏ ఎస్‌యూవీ మోడల్.. బీఎండబ్ల్యూ ఎక్స్1, వోల్వో ఎక్స్‌సీ40 రీఛార్జ్, కియా ఈవీ6తో పోటీపడుతుంది.

మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఏ స్పెషిఫికేషన్లు :
మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఏ ఫేస్‌లిఫ్ట్ గత ఏడాది ఆగస్టులో రివీల్ అయింది. బయటి నుంచి మెర్సిడెస్-బెంజ్ సిగ్నేచర్ స్టార్ ప్యాటర్న్, ఒక హెడ్‌ల్యాంప్ నుంచి మరో హెడ్‌ల్యాంప్ వరకు విస్తరించి ఉన్న లైట్ బార్‌తో ఫ్రంట్ గ్రిల్ అత్యంత అద్భుతమైన ఫీచర్‌లలో ఒకటిగా ఉంది.

డిజైన్ లాంగ్వేజీ పరంగా ఈక్యూఏ ఈక్యూబీతో చాలా అంశాలను షేర్ చేసింది. లోపలి భాగంలో ఈక్యూఏ మోడల్ 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఫుల్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ భారత మార్కెట్లో విక్రయించనున్న ఇతర మెర్సిడెస్ మోడళ్లలో కనిపించే మూడు-స్పోక్ స్టీరింగ్ వీల్‌తో వస్తుందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

రెండు బ్యాటరీ ఆప్షన్లు, మొత్తం 4 వేరియంట్లలో :
బ్యాటరీ ప్యాక్ ఆప్షన్ల పరంగా మెర్సిడెస్ బెంజ్ ఇంకా ఈక్యూఏ గురించి ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. అంతర్జాతీయ మార్కెట్లలో ఈక్యూఏ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ రెండు బ్యాటరీ ఆప్షన్లతో పాటు నాలుగు వేరియంట్‌లతో వస్తుంది. ఇందులో ఈక్యూఏ 250, ఈక్యూఏ 250 ప్లస్, ఈక్యూఏ 300 4మ్యాటిక్, ఈక్యూఏ 350 4మ్యాటిక్ ఉన్నాయి.

భారత మార్కెట్లో ఈక్యూబీ మోడల్66.5kWh బ్యాటరీతో విక్రయిస్తోంది. అంతేకాదు.. రెండు ఎలక్ట్రిక్ మోటార్‌లను ప్రతి యాక్సిల్‌పై కలిగి ఉంది. ఫలితంగా వరుసగా 289bhp, 520Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈక్యూబీ 350, 4 మ్యాటిక్ పరిధి (డబ్ల్యూఎల్‌టీపీ) 423కిలోమీటర్ల వరకు రేటింగ్ అందిస్తోంది.

Read Also : TVS Apache RTR 160 Series : సరికొత్త బ్లాక్ ఎడిషన్‌తో టీవీఎస్ అపాచీ RTR 160 సిరీస్ బైక్ వచ్చేసింది.. ధర ఎంతంటే?

ట్రెండింగ్ వార్తలు