Big Tech vs Publishers : మెటా, గూగుల్‌కు కొత్త కాపీరైట్ సెగ.. AI కోసం కంటెంట్ వాడితే పబ్లిషర్లకు డబ్బులు కట్టాల్సిందేనా?
Big Tech vs Publishers : ఏఐ మోడల్స్ ట్రైనింగ్ కోసం వార్తలు, కాపీరైట్ కంటెంట్ వాడితే పబ్లిషర్లకు డబ్బులు చెల్లించాలా? ఇండోనేషియా కొత్త కాపీరైట్ ప్రతిపాదనలపై గూగుల్, మెటా, టిక్‌టాక్ అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఈ కొత్త నిబంధనలతో ఏఐ రంగంలో ఎలాంటి మార్పులు రానున్నాయో ఇప్పుడు చూద్దాం..
- Sreehari A
- Updated on- November 12, 2026 / 03:57 PM IST
Meta, Google Don't Want To Pay Publishers
- పబ్లిషర్ల కంటెంట్ వాడుకుంటే పరిహారం ఇవ్వాల్సిందేనా?
- AI ట్రైనింగ్‌కు ఇక ఫ్రీ కంటెంట్ ఉండదా?
- కంటెంట్ క్రియేటర్ల హక్కుల కోసం ఇండోనేషియా కీలక నిర్ణయం
Big Tech vs Publishers : ఏఐ కోసం పబ్లీషర్ల కంటెంట్ వాడొచ్చా? అలా వాడితే టెక్ కంపెనీలు డబ్బులు కట్టాలా? ఇప్పుడు ఇదే ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.. ఏఐ మోడల్స్ ట్రైనింగ్ కోసం మా కంటెంట్ వాడుతారా? అంటూ బిగ్ టెక్ కంపెనీలకు ఇండోనేషియా కొత్త కాపీరైట్ చట్టాన్ని తీసుకురావాలని చూస్తోంది..
ఇప్పటివరకు ఇంటర్నెట్‌లో దొరికే సమాచారం, వార్తలు, స్టోరీలు, ఫొటోలు.. ఇలా ఎన్నో రకాల కంటెంట్‌ను ఏఐ కంపెనీలు తమ మోడల్స్‌కు ట్రైనింగ్ ఇచ్చేందుకు వాడేసుకుంటున్నాయి.. అయితే ఆ కంటెంట్‌ను క్రియేట్ చేసిన పబ్లీషర్లకు మాత్రం తగిన ఐడెంటిటీ, పరిహారం దక్కుతున్నాయా? అన్న ప్రశ్న చాలాకాలంగా వినిపిస్తోంది. ఇప్పుడు ఇదే అంశంపై ఇండోనేషియా కొత్త రూల్ తీసుకువచ్చేందుకు రెడీ అవుతోంది.. ఆ దేశం ప్రతిపాదించిన కొత్త కాపీరైట్ నిబంధనలు టెక్ దిగ్గజాలైన గూగుల్, మెటా, టిక్‌టాక్‌కు కొత్త తలనొప్పిగా మారాయి..
పబ్లిషర్లకు డబ్బులు కట్టాలా? :
ఇండోనేషియా ప్రతిపాదిస్తున్న రూల్స్ ప్రకారం.. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ తమ సైట్లలో వార్తా సంస్థల కంటెంట్‌ను ప్రదర్శిస్తే, ఆయా పబ్లిషర్లకు డబ్బులు చెల్లించాల్సి రావచ్చు. అంతేకాదు, ఏఐ మోడల్స్‌కు ట్రైనింగ్ ఇచ్చేందుకు కాపీరైట్ స్టోరీలు, ఇతర కంటెంట్ వాడేందుకు అనుమతి లేదా లైసెన్సింగ్ డీల్స్ అవసరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది..
గూగుల్, మెటా, టిక్ టాక్ ఒకేమాట.. :
అయితే, ఈ ప్రతిపాదనలను గూగుల్, మెటా, టిక్‌టాక్ వ్యతిరేకిస్తున్నాయి. వార్తల లింకులు చూపించినందుకు డబ్బులు చెల్లించాలనే నిబంధన అమల్లోకి వస్తే.. ప్రజలకు సమాచారం అందుబాటులో ఉండటం తగ్గుతుందని గూగుల్ ప్రతినిధి అభిప్రాయపడ్డారు. మరోవైపు మెటా కూడా తన అభ్యంతరాలను వ్యక్తం చేసింది.
వార్తలను ప్లాట్‌ఫామ్స్‌లో చూపించడంపై ఆంక్షలు విధిస్తే పబ్లిషర్లకు రీడర్లు తగ్గడంతో పాటు యాడ్స్ ద్వారా ఆదాయం, సబ్‌స్క్రిప్షన్లపై ప్రభావం పడుతుందని పేర్కొంది. ఏఐ ద్వారా జనరేట్ చేసిన కంటెంట్‌కు సంబంధించిన నిబంధనలపైనా టిక్‌టాక్ సందేహాలు వ్యక్తం చేసింది..
ఏఐ కంటెంట్‌పై కాపీరైట్ ఉండదా? :
ఈ ప్రతిపాదనల్లో మరో ఆసక్తికరమైన అంశం కూడా వెలుగులోకి వచ్చింది.. ఒక రైటర్ లేదా క్రియేటర్ ప్రత్యేక స్టయిల్ ఉండేలా ఏఐ కంటెంట్ క్రియేట్ చేయడంపై ఆంక్షలు విధించే ఆలోచన ఉంది. పూర్తిగా ఏఐతో క్రియేట్ చేసిన కంటెంట్‌కు కాపీరైట్ ఇవ్వకూడదనే ప్రతిపాదన కూడా చర్చలో ఉంది..
ఏఐ డెవలప్ పేరుతో క్రియేటర్ల శ్రమకు విలువ లేకుండా పోకూడదన్నదే ఈ చర్చలో ప్రధాన అంశంగా కనిపిస్తోంది.. ఇండోనేషియా ప్రతిపాదనలు చట్టరూపం దాలిస్తే.. ప్రపంచవ్యాప్తంగా ఏఐ కంపెనీలు, మీడియా సంస్థలు, కంటెంట్ క్రియేటర్ల మధ్య ఉన్న సంబంధాల్లో కీలక మార్పులు వచ్చే అవకాశం ఉంది..
