Windows 10 మొబైల్.. నో సపోర్ట్ : మైక్రోసాఫ్ట్ 

  • Published By: sreehari ,Published On : December 12, 2019 / 07:36 AM IST
Windows 10 మొబైల్.. నో సపోర్ట్ : మైక్రోసాఫ్ట్ 

Updated On : December 12, 2019 / 7:36 AM IST

విండోస్ 10 మొబైల్ యూజర్లకు షాకింగ్ న్యూస్. స్మార్ట్ ఫోన్ల మార్కెట్లలో పోటీతత్వం నెలకొన్న తరుణంలో మైక్రోసాఫ్ట్ కొన్ని విండోస్ ఫోన్లకు అధికారికంగా సపోర్ట్ నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. 2010లో విండోస్ ఫోన్ 7 బ్యాక్ మార్కెట్లలో రిలీజ్ చేసింది.

ఆ తర్వాత మైక్రోసాఫ్ట్ రిలీజ్ చేసిన లేటెస్ట్ వెర్షన్ విండోస్ 10 మొబైల్‌కు డెవలపర్స్ లేదా వినియోగదారుల నుంచి పెద్దగా ఆదరణ లేదు. ఇప్పటికే విండోస్ 10 మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా పనిచేయకపోవడంతో కంపెనీ అధికారికంగా సపోర్ట్ నిలిపివేస్తున్నట్టు తెలిపింది. 

విండోస్ మొబైల్ తో ఎక్కువ మంది యూజర్లు ఎందుకు స్టిక్ అవుతున్నారంటే అందుకు పెద్ద కారణం మైక్రోసాఫ్ట్ ఆఫీసు ష్యూట్. ఇతర ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ లతో పోలిస్తే ఇందులో మైక్రోసాఫ్ట్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, వన్ నోట్ వర్క్ వంటి యాప్స్ విండోస్ ఫోన్లో ఉన్నాయి.

ఆఫీస్ యాప్స్ సంబంధించి అప్ డేట్స్, సెక్యూరిటీ పాచెస్ జనవరి 12, 2021 వరకు వస్తాయని కంపెనీ వెల్లడించింది. ఇదివరకే ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్ కూడా విండోస్ మొబైల్ కు సపోర్ట్ నిలిపివేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 31, 2019 నుంచి విండోస్ మొబైల్స్ లో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి. 

ఒకవేళ మీరు విండోస్ ఫోన్ వాడుతున్నారా? ఇదే సరైన అవకాశం.. వెంటనే ఏదైనా ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫోన్లకు మారిపోవడం మంచిది. ఈ రెండు OSలకు టన్నుల కొద్ది అప్లికేషన్లకు సంబంధించి తమ యాప్ స్టోర్లలో నుంచి అప్ డేట్స్, సెక్యూరిటీ పాచెస్ రిలీజ్ అవుతునే ఉంటాయి.