iPhones Hacking Threat
iPhones Hacking Threat : ఆపిల్ ఐఫోన్ వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.. భారత్‌లో మిలియన్ల ఐఫోన్లకు హ్యాకింగ్ థ్రెట్ ఉంది. ఏ క్షణమైనా హ్యాకర్లు మీ ఐఫోన్ హ్యాక్ చేసే రిస్క్ ఉంది. ఇదే విషయాన్ని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (CERT-In) ఐఫోన్ వినియోగదారులను హెచ్చరించింది.
ఈ మేరకు ఆపిల్ యూజర్లకు (iPhones Hacking Threat) హెచ్చరిక జారీ చేసింది. దీని ప్రకారం.. ఆపిల్ ప్రొడక్టుల్లో బగ్ ఇష్యూను గుర్తించారు. ఈ సెక్యూరిటీ ఇష్యూ కారణంగా హ్యాకర్లు సులభంగా హ్యాక్ చేసే ప్రమాదం పొంచి ఉంది. ఇంతకీ ఏయే ఐఫోన్ వెర్షన్ మోడళ్లకు రిస్క్ ఉంది? ఎలా ఇష్యూ ఫిక్స్ చేయాలనే పూర్తి వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం.
ఈ ఆపిల్ ఐఫోన్ వెర్షన్లలో బగ్ ఇష్యూ :
ఈ కింద పేర్కొన్న ఆపరేటింగ్ సిస్టమ్‌లలో రన్ అయ్యే అన్ని ఆపిల్ ఐఫోన్లలో కనిపించే కొత్త సెక్యూరిటీ లోపాల ద్వారా ప్రభావితమవుతాయి. ఇందులో ఆపిల్ ఐఫోన్‌లు, ఐప్యాడ్‌లు, మ్యాక్‌బుక్‌లు వంటివి మరిన్ని ఉన్నాయి.
ఆపిల్ బగ్ ఇష్యూతో తలెత్తే సమస్యలు :
పైన పేర్కొన్న ఆపరేటింగ్ సిస్టమ్‌లలో రన్ అయ్యే ఆపిల్ ఐఫోన్లలో ఏదైనా సంస్థ లేదా వ్యక్తిని లక్ష్యంగా చేసుకోవచ్చు. మిడ్ లెవల్ రిస్క్ ఉంటుంది. డేటా మానిప్యులేషన్ ఉండొచ్చు. టెక్నికల్ బగ్ వల్ల కలిగే ప్రధాన సమస్యల్లో సర్వీసు లేకపోవడం, ప్రాసెస్ నిలిచిపోవడం, యాప్ క్రాష్ కావడం వంటి సమస్యలు ఉంటాయి. బగ్ విషయానికొస్తే.. ఆపిల్ డివైజ్ ఫ్రంట్‌పార్సర్ కంపోనెంట్ ఇష్యూ కారణంగా వచ్చింది. ఈ బగ్ ఇష్యూ ద్వారా రిమోట్ సిస్టమ్ లేదా ప్రాసెస్‌ను డేంజరస్ ఫాంట్‌ను ఇంజెక్ట్ చేయడం ద్వారా సమస్య తలెత్తింది.
సేఫ్‌గా ఎలా ఉండాలి? :
పాత ఆపరేటింగ్ సిస్టమ్ వెర్షన్లలో అన్ని లోపాలు కనిపిస్తాయి. మీరు చేయాల్సింది ఒకటే.. ఐఫోన్‌లు, ఐప్యాడ్‌లు, మ్యాక్‌బుక్‌ల వంటి మీ ఫోన్లను ఎప్పటికప్పుడూ అప్‌డేట్‌గా ఉంచుకోవడమే. మీరు మాన్యువల్ ఇన్‌స్టాల్ చేయలేకపోతే డివైజ్ ఆటోమేటిక్ అప్‌డేట్ సెట్టింగ్‌ను ఆన్ చేయండి. మీ ఫోన్ లేటెస్ట్ వెర్షన్‌లో రన్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది.