Realme 15x 5G : ఖతర్నాక్ ఫీచర్లతో రియల్‌మి కొత్త 5G ఫోన్ వచ్చేసిందోచ్.. ఏ వేరియంట్ ధర ఎంతంటే? ఫుల్ డిటెయిల్స్..!
Realme 15x 5G Launch : రియల్‌మి కొత్త 5G ఫోన్ వచ్చేసింది. 7000mAh భారీ బ్యాటరీతో అత్యాధునిక ఫీచర్లను కలిగి ఉంది. ఇంకా ఏయే ఫీచర్లు ఉన్నాయో ఓసారి లుక్కేయండి.

Realme 15x 5G Launch
Realme 15x 5G Launch : రియల్‌మి లవర్స్‌కు గుడ్ న్యూస్.. రియల్‌మి ఇండియా రియల్‌మి 15x 5G అనే కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ కంపెనీ 15 సిరీస్‌కి అప్‌గ్రేడ్ వెర్షన్‌గా వచ్చింది. ఇందులో 15 ప్రో, 15, 15T వేరియంట్లు కూడా ఉన్నాయి.
ఈ స్మార్ట్‌ఫోన్ 60W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7,000mAh టైటాన్ బ్యాటరీని (Realme 15x 5G Launch) కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 SoC ద్వారా పవర్ పొందుతుంది. 8GB ర్యామ్ ఉండగా ఎక్స్‌పాండ్ ఫీచర్ ద్వారా అదనంగా 10GB వరకు డైనమిక్ RAMతో విస్తరించుకోవచ్చు.
రియల్‌మి 15x 5G భారత్ ధర, లభ్యత :
రియల్‌మి 15x 5G ఆక్వా బ్లూ, మెరైన్ బ్లూ, మెరూన్ రెడ్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ : రూ. 16,999
8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ : రూ. 17,999
8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ : రూ. 19,999
ఈ ఫోన్ అక్టోబర్ 1, 2025 నుంచి Flipkart, realme.com, మెయిన్‌లైన్ స్టోర్‌లలో అందుబాటులో ఉంటుంది.
లాంచ్ ఆఫర్లు :
ప్రత్యేక లాంచ్ ఆఫర్లు అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 5 వరకు అందుబాటులో ఉంటాయి. ఆసక్తిగల కొనుగోలుదారులు ఫ్లిప్‌కార్ట్, (realme.com) ద్వారా చేసే కొనుగోళ్లపై 6 నెలల నో-కాస్ట్ ఈఎఐంతో పాటు రూ.1,000 బ్యాంక్ ఆఫర్ లేదా రూ.3వేలు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను పొందవచ్చు.
రియల్‌మి 15x 5G స్పెసిఫికేషన్లు :
రియల్‌మి 15x భారీ 6.8-అంగుళాల HD+ (1570×720 పిక్సెల్స్) ఐపీఎస్ ఎల్‌సీడీ స్క్రీన్‌ను 144Hz రిఫ్రెష్ రేట్, 180Hz టచ్ శాంప్లింగ్ రేట్, 1200 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌తో కలిగి ఉంది.
పర్ఫార్మెన్స్ :
ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 6nm ప్రాసెసర్ (2x కార్టెక్స్-A76 at 2.4GHz + 6x కార్టెక్స్-A55, 2GHz) ద్వారా ఆర్మ్ మాలి-G57 MC2 జీపీయూతో రన్ అవుతుంది. టాప్ వేరియంట్ 8GB LPDDR4X ర్యామ్, 256GB యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్‌తో వస్తుంది. మైక్రో SD కార్డ్ ద్వారా 2TB వరకు విస్తరించవచ్చు. రియల్‌మి యూఐ 6.0తో ఆండ్రాయిడ్ 15పై రన్ అవుతుంది.
కెమెరా :
ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. ఈ రియల్‌మి ఫోన్ 50MP బ్యాక్ కెమెరా (1/1.95″ సోనీ IMX852 సెన్సార్, ఎఫ్/1.8 ఎపర్చరు), 50MP ఫ్రంట్ కెమెరా (1/2.88″ OV50D40 సెన్సార్, ఎఫ్/2.4 ఎపర్చరు) కలిగి ఉంది. రెండు కెమెరాల బ్యాక్ సైడ్ ఎల్ఈడీ ఫ్లాష్ లైట్ ఉంటుంది.
ఇతర ఫీచర్లు :
సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 400శాతం అల్ట్రా వాల్యూమ్ ఆడియోతో 1115 అల్ట్రా-లీనియర్ బాటమ్-పోర్టెడ్ స్పీకర్, దుమ్ము, నీటి నిరోధకతకు IP68, IP69 రేటింగ్‌లతో అదనపు ఫీచర్లు ఉన్నాయి. మిలిటరీ-గ్రేడ్ (MIL-STD 810H సర్టిఫికేషన్), Wi-Fi 5, బ్లూటూత్ 5.3 వంటి కనెక్టివిటీ ఆప్షన్లు కలిగి ఉంది.