Mobile Data Plans
Mobile Data Plans : మీరు మొబైల్ డేటా కావాలా? అయితే ఇది మీకోసమే.. ప్రస్తుతం అతి తక్కువ ధరకే ఇంటర్నెట్ డేటా ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. దేశంలోని ప్రధాన టెలికాం ప్రొవైడర్లలో రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, బీఎస్ఎన్ఎల్ అత్యంత సరసమైన ధరకే ఇంటర్నెట్ రీఛార్జ్ ప్లాన్లను అందిస్తున్నాయి.
భారత్‌లో ఇంటర్నెట్ వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో అన్ని టెలికాం ప్రొవైడర్లు తమ వినియోగదారులకు చౌకైన డేటా ప్లాన్‌లను అందించేందుకు పోటీపడుతున్నాయి. BSNL, Airtel, Jio సరసమైన ధరలో ఇంటర్నెట్ ఆఫర్లను అందిస్తున్నాయి. ఇందులో మీ నెట్‌వర్క్ ఏదైనా సరే.. చీపెస్ట్ రీఛార్జ్ ప్లాన్లను ఎంచుకోండి.. మొబైల్ డేటాతో ఎక్కువ సమయం ఎంజాయ్ చేయండి.
Read Also : POCO C71 : వావ్.. పిచ్చెక్కించే ఫీచర్లతో కొత్త పోకో ఫోన్.. ఏప్రిల్ 4నే లాంచ్.. ధర మీ బడ్జెట్‌లోనే..!
BSNL చౌకైన డేటా ప్లాన్ :
ప్రభుత్వ టెలికాం ప్రొవైడర్ BSNL సరసమైన డేటా ప్లాన్లను ఆఫర్ చేస్తోంది. ఒక రోజు వ్యాలిడిటీతో వస్తుంది. 2GB డేటాతో BSNL అత్యంత సరసమైన ఇంటర్నెట్ ప్యాకేజీ రూ. 16 నుంచి ప్రారంభమవుతుంది. అలాగే, బీఎస్ఎన్ఎల్ రూ. 98 ప్లాన్‌తో 22 రోజుల పాటు రోజుకు 2GB డేటాను అందిస్తుంది.
ఎయిర్‌టెల్ చౌకైన డేటా ప్లాన్ :
భారత మార్కెట్లో ఎయిర్‌టెల్ ప్రైమరీ ప్రైవేట్ టెలికాం సంస్థ. ఈ కంపెనీ యూజర్లకు సరసమైన ధరలకు హై-స్పీడ్ ఇంటర్నెట్ సబ్‌స్క్రిప్షన్‌లను అందిస్తుంది. ఎయిర్‌టెల్ నుంచి చౌకైన డేటా బండిల్ ధర రూ. 19కు ఆఫర్ చేస్తోంది. 1GB డేటా లిమిట్, ఒక రోజు వ్యాలిడిటీ టైమ్ ఉంది. అలాగే, రూ. 100 ప్యాకేజీతో కొంచెం ఎక్కువ కావాలంటే 5GB డేటాను అందిస్తుంది.
జియో చౌకైన డేటా ప్లాన్ :
జియో చౌకైన ప్లాన్‌లకు బెస్ట్ ఆప్షన్. జియో అందించే అత్యంత సరసమైన ఇంటర్నెట్ ప్లాన్ రూ. 15కు లభ్యమవుతుంది. ఇందులో 1GB డేటా, ఒక రోజు వ్యాలిడిటీ ఉంటుంది. అదే సమయంలో రూ. 91 ప్లాన్ 28 రోజుల పాటు 6GB డేటాను అందిస్తుంది.
తక్కువ డేటా వినియోగం ఉన్న యూజర్లకు అద్భుతమైన ఆప్షన్. అవసరాలను బట్టి, BSNL, Airtel, Jio అన్నీ కస్టమర్లకు సరసమైన ఇంటర్నెట్ ప్లాన్‌లను అందిస్తున్నాయి. మీరు డేటా స్పీడ్, కనెక్టివిటీ కోసం చూస్తుంటే.. జియో, ఎయిర్‌టెల్ రెండింటిలో ఏదైనా ఒక డేటా ప్లాన్ ఎంచుకోవచ్చు.