POCO C71 : వావ్.. పిచ్చెక్కించే ఫీచర్లతో కొత్త పోకో ఫోన్.. ఏప్రిల్ 4నే లాంచ్.. ధర మీ బడ్జెట్‌‌లోనే..!

POCO C71 Launch : కొత్త ఫోన్ కావాలా? ఏప్రిల్ 4 వరకు ఆగండి.. అద్భుతమైన ఫీచర్లతో పోకో C71 ఫోన్ వచ్చేస్తోంది. ధర, ఫీచర్ల పూర్తి వివరాలను ఓసారి లుక్కేయండి.

POCO C71 : వావ్.. పిచ్చెక్కించే ఫీచర్లతో కొత్త పోకో ఫోన్.. ఏప్రిల్ 4నే లాంచ్.. ధర మీ బడ్జెట్‌‌లోనే..!

POCO C71

Updated On : April 1, 2025 / 12:46 PM IST

POCO C71 Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? పోకో నుంచి సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ వచ్చేస్తోంది. ఏప్రిల్ 4న గ్లోబల్ మార్కెట్లలో లాంచ్ కానుంది. ఈ పోకో ఫోన్ సరసమైన ధర వద్ద ఆకట్టుకునే ఫీచర్లతో రానుంది.

హై పర్ఫార్మెన్స్ కోరుకునే వినియోగదారులకు అద్భుతమైన ఆప్షన్ అని చెప్పవచ్చు. ఫీచర్లు మాత్రం పిచ్చెక్కించేలా ఉన్నాయి. ధర కూడా మీ బడ్జెట్‌‌లోనే ఉండొచ్చు. రాబోయే పోకో C71 ఫోన్ ఫీచర్లు, స్పెషిఫికేషన్లు, ధర వంటి పూర్తి వివరాలను ఓసారి లుక్కేయండి.

Read Also : ChatGPT Ghibli : చాట్‌జీపీటీ ‘ఘిబ్లి’తో జాగ్రత్త.. ట్రెండ్ కోసం మీ ఫొటోలు తెగ అప్‌లోడ్ చేస్తున్నారా? మీ ప్రైవసీ హ్యాకర్ల చేతుల్లోకి..!

పోకో C71 డిస్‌ప్లే :
పోకో C71 ఫోన్ 6.71-అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ద్వారా ప్రొటెక్షన్ కలిగి ఉంది. గీతలు, మరకల పడకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. హై బ్రైట్‌నెస్ ప్యానెల్ ఇంటి లోపల లేదా ఆరుబయట వ్యూ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.

పోకో C71 ప్రాసెసర్ :
హుడ్ కింద పోకో C71 మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. రోజువారీ పనులకు గేమింగ్‌కు అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ చిప్‌సెట్ మల్టీ టాస్కింగ్‌ను లాగ్-ఫ్రీ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.

పోకో C71 కెమెరా :
50MP డ్యూయల్ AI బ్యాక్ కెమెరా సెటప్‌తో అమర్చిన పోకో C71 ఫోన్ హై క్వాలిటీ ఫోటోలను క్యాప్చర్ చేయగలదు. సెల్ఫీ ప్రియుల కోసం ఈ ఫోన్ 8MP ఫ్రంట్ కెమెరాను అందిస్తుంది.

బ్యాటరీ, ఇతర స్పెసిఫికేషన్లు :
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6,000mAh బ్యాటరీ ఉంది. తరచుగా ఛార్జింగ్ అవసరం లేకుండా ఎక్కువ సమయం ఛార్జ్ అందిస్తుంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. వేగవంతమైన పవర్-అప్‌లను అనుమతిస్తుంది.

పోకో C71 ఆండ్రాయిడ్ 14లో MIUI 14తో రన్ అవుతుంది సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. అదనపు ఫీచర్లలో మైక్రో SD ద్వారా 1TB వరకు స్టోరేజీ విస్తరించుకోవచ్చు. సెక్యూరిటీ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యూయల్ సిమ్ సపోర్ట్ ఉన్నాయి.

ధర, వేరియంట్లు :
భారత మార్కెట్లో పోకో C71 ఫోన్ ధర రూ. 11,999 ఉంటుందని అంచనా. ఈ పోకో ఫోన్ బ్లాక్, బ్లూ, గ్రీన్ సహా మల్టీ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.

పోకో C71 ఫోన్‌పై ఆఫర్లు :
బ్యాంక్ ఆఫర్ : ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్ కార్డులపై కస్టమర్‌లు క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లను కూడా పొందవచ్చు .

స్పెషల్ ధర ఆఫర్ : ప్రత్యేక ప్రారంభ ధరలో భాగంగా అదనపు డిస్కౌంట్ అందుబాటులో ఉండవచ్చు .

నో-కాస్ట్ EMI : పోకో C71 ఫోన్ నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లతో కొనుగోలు చేయండి. అతి తక్కువ ధరలో పోకో ఫోన్ సొంతం చేసుకోవచ్చు.

Read Also :  Vivo T4x 5G : అబ్బా.. భలే డిస్కౌంట్.. రూ. 21వేల వివో 5G ఫోన్ కేవలం రూ. 15వేలు లోపే.. ఇలా కొన్నారంటే?

మీరు పోకో బ్రాండ్‌లోని ఇతర మోడళ్లను పరిశీలిస్తే.. పోకో M6 ప్రో 5G, పోకో X4 ధరలలో ఫీచర్లు, పర్ఫార్మెన్స్ అందిస్తాయి.

Note : కచ్చితమైన ఆఫర్లను దయచేసి అధికారిక వెబ్‌సైట్ లేదా అధీకృత రిటైలర్‌లను చెక్ చేయండి.. ఎందుకంటే ఈ మొబైల్ రేట్లు, ఆఫర్లు మారుతుంటాయి.