మీ నెంబర్ ఉందో చెక్ చేశారా?: గూగుల్ సెర్చ్‌లో లీకైన వాట్సాప్ వెబ్ మొబైల్ నెంబర్లు

WhatsApp Web Users Mobile Numbers: ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్ వివాదాస్పద ప్రైవసీ పాలసీపై విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మరో వాట్సాస్ యూజర్ డేటా ఉల్లంఘన వెలుగులోకి వచ్చింది. ఈసారి వాట్సాప్ డెస్క్ టాప్ (వెబ్) అప్లికేషన్ లోని యూజర్ల డేటా బహిర్గతమైంది. వాట్సాప్ వెబ్ యూజర్ల మొబైల్ నెంబర్లు గూగుల్ సెర్చ్‌లో కనిపిస్తున్నాయంట. వాట్సాప్ యూజర్ల మొబైల్ నెంబర్లు గూగుల్ సెర్చ్‌లో ఇండెక్స్ అవుతున్నాయింట.

ప్రస్తుతం ఇండియాలో వాట్సాప్ మొబైల్ యాప్‌ను 400 మిలియన్ల మంది యూజర్లు వినియోగిస్తున్నారు. చాలామంది ప్రొఫెషనల్స్ ఇన్‌స్టంట్ వాట్సాప్ డెస్క్ టాప్, పీసీలపై వెబ్ వెర్షన్ ద్వారా వినియోగిస్తున్నారు. యూజర్ల మొబైల్ నెంబర్ల గూగుల్ సెర్చ్ లో ఇండెక్స్ అయినట్టు ఇండిపెండెంట్ సైబర్ సెక్యూరిటీ రీసెర్చర్ రాజశేఖర్ రాజహారియా కొన్ని స్ర్కీన్ షాట్లను షేర్ చేశారు. వాట్సాప్ వెబ్ అప్లికేషన్ ద్వారానే యూజర్ల మొబైల్ నెంబర్లు లీక్ అయినట్టు గుర్తించామన్నారు.

వాట్సాప్ యూజర్ ఎవరైనా తమ వాట్సాప్ అకౌంట్‌ను ల్యాప్ టాప్ లేదా ఆఫీసు కంప్యూటర్లో లాగిన్ అయినప్పుడు వారి మొబైల్ నెంబర్లు గూగుల్ సెర్చ్ లో ఇండెక్స్ అయినట్టు గుర్తించినట్టు తెలిపారు. ఈ మొబైల్ నెంబర్లు బిజినెస్ నెంబర్లు కావని, వ్యక్తిగత యూజర్ల నెంబర్లుగా రాజశేఖర్ వెల్లడించారు.

గతవారమే వాట్సాప్ ప్రైవేటు గ్రూపు చాట్స్ గూగుల్ సెర్చ్ లో లీక్ అయినట్టు గుర్తించారు. ప్రైవేటు వాట్సాప్ గ్రూపు చాట్లలో పంపిన ఇన్వైట్ లింకులు గూగుల్ సెర్చ్ లో ఇండెక్స్ అయ్యాయి. దీనిపై స్పందించిన వాట్సాప్ గ్రూపు చాట్ లింక్స్ ను గూగుల్ సెర్చ్ నుంచి తొలగించినట్టు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది.

ట్రెండింగ్ వార్తలు