Mother’s Day Tech Gift Ideas
Mother’s Day Tech Gift Ideas : మదర్స్ డే కోసం మీ అమ్మకు ఏదైనా మంచి గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్నారా? అయితే, ఇదే సరైన సమయం. మే 11న మదర్స్ డే సందర్భంగా మీ అమ్మకు ఏదైనా బహుమతి ఇచ్చి సర్‌ప్రైజ్ చేయొచ్చు. కొంత టెక్ గాడ్జెట్లపై అవగాహన ఉంటే.. కొన్ని ఎలక్ట్రానిక్ గిఫ్ట్స్ ఆప్షన్లు ఉన్నాయి.
ఇందుకోసం మీరు అతిగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ప్రతిరోజూ ఉపయోగించే క్వాలిటీ గాడ్జెట్‌లను తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చ. ఈ స్మార్ట్‌వాచ్‌ల నుంచి ఇయర్‌బడ్‌ల వరకు రూ. 10వేల లోపు కొన్ని బెస్ట్ టెక్ గిఫ్ట్స్ సొంతం చేసుకోవచ్చు.
స్మార్ట్‌వాచ్‌లు :
మీ మదర్ ఉదయం ఎక్కువగా వాకింగ్ ఇష్టపడేవారు అయితే, ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఎక్కువ అయితే స్మార్ట్‌వాచ్ బహుమతిగా ఇవ్వొచ్చు. ఈ గాడ్జెట్‌లు హార్ట్ రేటు ట్రాకింగ్, ఆక్సిజన్ లెవల్స్, అడుగుల సంఖ్య, నిద్ర ఒత్తిడి స్థాయిలను కూడా ట్రాక్ చేయొచ్చు.
అమెజాన్ ,ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్, నాయిస్, ఫాస్ట్రాక్, బోట్ మరిన్ని బ్రాండ్‌ల నుంచి ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. మీ అమ్మ ప్రతిరోజూ వేరబుల్ స్టైలిష్ డిజైన్‌లలో కూడా వస్తాయి.
ఇయర్‌బడ్స్ :
ఇంటి పనులు చేసుకుంటూ లేదా రెస్ట్ తీసుకుంటూ మ్యూజిక్ వినడానికి ఇష్టపడే తల్లులకు వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లు బెస్ట్ ఆప్షన్ కావచ్చు.
వాయిస్ క్యాన్సిలేషన్, లాంగ్ బ్యాటరీ లైఫ్, ఫిట్ వంటి ఫీచర్లతో ఇయర్‌బడ్‌లు కొనుగోలు చేయొచ్చు. గూగుల్, నథింగ్, బోట్ వంటి బ్రాండ్లు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో రూ. 10వేల లోపు కొన్ని ఆప్షన్లను అందిస్తున్నాయి.
హెయిర్ స్టైలింగ్ అప్లియన్సెస్ :
మీ అమ్మ తన జుట్టును స్టైలింగ్ చేసుకోవడం ఇష్టపడితే హెయిర్ స్టైలింగ్ అప్లియన్సెస్ గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు. బిజీగా ఉండే సమయాల్లో హెయిర్ అప్లయన్స్ కాంబో అద్భుతంగా ఉపయోగపడుతుంది.
హెయిర్ డ్రైయర్, స్ట్రెయిట్నర్, కర్లర్ వంటి విలువైన కాంబోలను ఒకే కిట్‌లో పొందవచ్చు. వేగా, హావెల్స్ ఈ కాంబోలను సరసమైన ధరలకు ఆన్‌లైన్‌లో టాప్ బ్రాండ్‌లలో ఉన్నాయి.
స్మార్ట్ స్పీకర్లు :
వంటగదిలో లేదా లివింగ్ రూమ్‌లో పెట్టుకునేందుకు మీ అమ్మకు స్మార్ట్ స్పీకర్ బహుమతిగా ఇవ్వొచ్చు. వాయిస్ అసిస్టెంట్‌లతో తనకు ఇష్టమైన పాటలను వినవచ్చు.
న్యూస్ అప్‌డేట్స్ తెలుసుకోవచ్చు. రిమైండర్‌లను సెట్ చేయవచ్చు. అమెజాన్ ఎకో డాట్, ఎకో పాప్ అనేవి ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లలో అందుబాటులో ఉన్న రెండు పాపులర్ ఆప్షన్లుగా చెప్పొచ్చు.
Read Also : Motorola Edge 50 Pro : ఖతర్నాక్ డిస్కౌంట్.. రూ. 42వేల మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో కేవలం రూ. 18వేలు మాత్రమే..!
ఇన్‌స్టంట్ పోలరాయిడ్ కెమెరా :
ఇన్‌స్టంట్ పోలరాయిడ్ కెమెరా మీ అమ్మకు కొన్ని సెకన్లలోనే ప్రత్యేక జ్ఞాపకాలను ప్రింట్ చేసి ఇస్తుంది. ఆమె ఫొటోలను ఇష్టపడితే లేదా పాత జ్ఞాపకాలను ఇష్టపడితే అద్భుతమైన బహుమతి. ఫుజిఫిల్మ్ ఇన్‌స్టాక్స్ మినీ సిరీస్ ఈ కేటగిరీలో అత్యంత ఇష్టపడే వాటిలో ఒకటిగా చెప్పొచ్చు.