Motorola Edge 50 Pro : ఖతర్నాక్ డిస్కౌంట్.. రూ. 42వేల మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో కేవలం రూ. 18వేలు మాత్రమే..!

Motorola Edge 50 Pro : మీరు మోటోరోలా స్మార్ట్‌ఫోన్ అతి చౌకైన ధరకే కొనుగోలు చేయొచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?

Motorola Edge 50 Pro : ఖతర్నాక్ డిస్కౌంట్.. రూ. 42వేల మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో కేవలం రూ. 18వేలు మాత్రమే..!

Motorola Edge 50 Pro

Updated On : May 10, 2025 / 10:28 PM IST

Motorola Edge 50 Pro : కొత్త స్మార్ట్ ఫోన్ కొంటున్నారా? మోటోరోలా ఫోన్ అత్యంత సరసమైన ధరకే సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో SASA LELE సేల్ మే 10 చివరి రోజు.

ఈ సేల్ సమయంలో ఫ్లిప్‌కార్ట్ బడ్జెట్-ఫ్రెండ్లీ, ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపులను అందిస్తోంది. ముఖ్యంగా, మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో ధరను భారీగా తగ్గించింది.

Read Also : LIC New Service : ఎల్ఐసీ పాలసీదారులకు గుడ్ న్యూస్.. ఇకపై వాట్సాప్ నుంచే ప్రీమియం చెల్లించవచ్చు.. ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

మోటోరోలా ఫోన్ కెమెరా సెటప్, పవర్‌ఫుల్ ప్రాసెసర్, అద్భుతమైన డిస్‌ప్లేతో ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్. ఈ ఫోన్ రాబోయే నాలుగు నుంచి 5 ఏళ్ల వరకు మన్నికను అందిస్తుంది.

అల్యూమినియం ఫ్రేమ్, ఐపీ రేటింగ్‌తో వస్తుంది. ఫ్లాట్ డిస్కౌంట్‌లతో పాటు ఫ్లిప్‌కార్ట్ కస్టమర్ల కోసం అనేక అదనపు ఆఫర్‌లను కూడా అందిస్తోంది. ఈ అత్యుత్తమ ఫోన్‌పై డిస్కౌంట్‌లను ఓసారి పరిశీలిద్దాం.

మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో డిస్కౌంట్ :
ప్రస్తుతం, మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో 256GB వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.41,999కు లిస్టు అయింది. కానీ, మీరు 28 శాతం భారీ తగ్గింపును పొందవచ్చు. ధర కేవలం రూ.29,999కి తగ్గుతుంది.

అంటే నేరుగా రూ.12వేలు ఆదా చేసుకోవచ్చు. అదనంగా, మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తే.. కొనుగోలుపై 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

ఫ్లిప్‌కార్ట్ మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో కోసం ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. మీ దగ్గర పాత స్మార్ట్‌ఫోన్ ఉంటే.. రూ.27,700 వరకు ట్రేడ్ చేయవచ్చు.

అయితే, కచ్చితమైన మొత్తం మీ ఫోన్ వర్కింగ్ కండిషన్ బట్టి ఉంటుంది. మీరు రూ.10వేల ఎక్స్ఛేంజ్ వాల్యూ అర్హత సాధిస్తే.. ఈ అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.18వేల ధరకే కొనుగోలు చేయొచ్చు.

మోటరోలా ఎడ్జ్ 50 ప్రో స్పెసిఫికేషన్లు :
ఈ ఫోన్ అల్యూమినియం ఫ్రేమ్‌తో ఎకో-లెదర్ బ్యాక్ ఫినిషింగ్‌ను కలిగి ఉంది. ఆకట్టుకునే 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల P-OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14పై రన్ అవుతుంది.. అప్‌గ్రేడ్ చేయవచ్చు.

Read Also : Hero Splendor Plus : కొంటే ఇలాంటి బైక్ కొనాలి.. సరసమైన హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్ ఇదిగో.. 70కి.మీ బెస్ట్ మైలేజీ..!

అత్యుత్తమ పర్ఫార్మెన్స్ కోసం 12GB ర్యామ్, 512GB స్టోరేజీతో వస్తుంది. ట్రిపుల్ కెమెరా సెటప్‌లో అద్భుతమైన ఫోటోగ్రఫీకి 50+10+13MP ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం, 50MP ఫ్రంట్ కెమెరా ఉంది. మోటరోలా ఎడ్జ్ 50 ప్రోకి 4500mAh బ్యాటరీ పవర్ అందిస్తుంది.