LIC New Service : ఎల్ఐసీ పాలసీదారులకు గుడ్ న్యూస్.. ఇకపై వాట్సాప్ నుంచే ప్రీమియం చెల్లించవచ్చు.. ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

LIC New Service : ఎల్ఐసీ పాలసీదారులు ఇకపై తమ పాలసీ ప్రీమియం ఇంట్లో నుంచే వాట్సాప్ ద్వారా ఈజీగా చెల్లించవచ్చు.

LIC New Service : ఎల్ఐసీ పాలసీదారులకు గుడ్ న్యూస్.. ఇకపై వాట్సాప్ నుంచే ప్రీమియం చెల్లించవచ్చు.. ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

LIC New Service

Updated On : May 10, 2025 / 8:30 PM IST

LIC New Service : ఎల్ఐసీ పాలసీదారులకు శుభవార్త. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పాలసీదారుల కోసం కీలక ప్రకటన చేసింది. ఎల్ఐసీ ప్రీమియం చెల్లించడానికి మీరు ఏజెంట్ వద్దకు వెళ్లవలసిన అవసరం లేదు.

Read Also : Mother’s Day 2025 : మదర్స్ డే టెక్ గిఫ్ట్ ఐడియాస్.. రూ. 10వేల లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. శాంసంగ్, వివో, మోటోరోలా ఏదైనా గిఫ్ట్ ఇవ్వొచ్చు!

ఇప్పుడు మీరు వాట్సాప్ ద్వారా ఇంట్లో కూర్చుని ప్రీమియం చెల్లించవచ్చు. ఇందుకోసం ఎల్ఐసీ వాట్సాప్ బాట్‌ను విడుదల చేసింది. ఇంతకీ ఇంట్లో కూర్చుని ఎల్ఐసీ ప్రీమియం ఎలా చెల్లించవచ్చో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ప్రీమియం చెల్లించడానికి LIC 8976862090 నంబర్‌ను జారీ చేసింది. మీరు ఈ వాట్సాప్ నంబర్‌కు మెసేజ్ పంపి మీ పాలసీని UPI ద్వారా చెల్లించవచ్చు.

ఈ ఆప్షన్ LIC కస్టమర్లకు ఆన్‌లైన్‌లో ప్రీమియం చెల్లించే అవకాశాన్ని ఇస్తుందని బీమా కంపెనీ తెలిపింది. తద్వారా, వినియోగదారులు బాట్‌లోనే పేమెంట్ చేయగలరు.

ఈ ఫీచర్ ఇలా పనిచేస్తుందంటే? :
వాట్సాప్ ద్వారా పాలసీ కోసం చెల్లించడానికి ముందుగా మీరు 8976862090కు హాయ్ అని పంపాలి. ఆ తర్వాత బాట్ యాక్టివ్ అవుతుంది. మీ చాట్ స్క్రీన్‌లో అనేక ఆప్షన్లు కనిపిస్తాయి.

మీరు పొందాలనుకుంటున్న సర్వీసును ఎంచుకోవాలి. ఉదాహరణకు.. మీరు పాలసీ ప్రీమియం చెల్లించాల్సి వస్తే.. ఆ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీకు ఒక లింక్ వస్తుంది. దానిపై క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి.

Read Also : PM Jan Dhan Yojana : మీ అకౌంట్‌లో డబ్బులు లేకున్నా రూ. 10వేలు విత్ డ్రా చేయొచ్చు.. జస్ట్ ఈ ప్రభుత్వ స్కీమ్‌లో అప్లయ్ చేస్తే చాలు..!

  • మీరు లింక్‌పై క్లిక్ చేసి అక్కడ పాలసీ నంబర్‌ను ఎంటర్ చేయాలి.
  • అప్పుడు మీరు పన్ను లేకుండా ప్రీమియం మొత్తాన్ని చెల్లించాలి.
  • ఆ తర్వాత పాన్ కార్డ్ ఫోటోను .jpg లేదా .jpeg ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయండి.
  • (www.licindia.in)కు వెళ్లి కస్టమర్ పోర్టల్‌పై క్లిక్ చేయండి.
  • మీరు అక్కడ ఎంటర్ చేసుకోకపోతే కొత్త ఐడీ కోసం క్లిక్ చేయండి.
  • అక్కడ పాస్‌వర్డ్ ఎంటర్ చేసి Submit చేయండి.
  • ఆ తర్వాత, కొత్త ఐడీతో మళ్ళీ లాగిన్ అవ్వండి.
  • మీరు పాలసీని యాడ్ చేయాలి.
  • మీరు బేసిక్ సర్వీసులను పొందవచ్చు.