Moto G Max Sale : సూపర్ ఆఫర్ మావా.. కొత్త మోటో G మ్యాక్స్ చాలా చవక.. ధర ఎంత తెలిస్తే కొనకుండా ఉండలేరు!
Moto G Max Sale : 6GB ర్యామ్, 128GB స్టోరేజ్‌తో సింగిల్ వేరియంట్ మోటో జీ మ్యాక్స్ ధర రూ. 27,999గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ కొనేందుకు రూ. 3వేలు బ్యాంక్ క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. పూర్తి వివరాలను ఓసారి లుక్కేయండి..
Moto G Max Sale
- 6.72 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఎల్సిడి స్క్రీన్
- స్నాప్‌డ్రాగన్ 6ఎస్ జెన్ 4 చిప్సెట్తో రన్ అవుతుంది
- 50MP సోనీ లైటియా 600 మెయిన్ కెమెరా సెటప్
Moto G Max Sale : మోటో అభిమానులకు గుడ్ న్యూస్.. మోటోరోలా నుంచి సరికొత్త మోటో G మ్యాక్స్ ఇటీవలే లాంచ్ అయింది. అయితే, ప్రస్తుతం ఈ ఫోన్ ఫస్ట్ సేల్ మొదలైంది. భారత మార్కెట్లో ఈ స్మార్ట్‌ఫోన్ మీ బడ్జెట్ ధరలోనే లభిస్తోంది.
దేశంలో మోటోరోలా నుంచి రెండో ‘మ్యాక్స్’ స్మార్ట్‌ఫోన్.. గత నెలలో మోటోరోలా ఎడ్జ్ 70 మ్యాక్స్ లాంచ్ అయింది. మోటో జీ మ్యాక్స్ స్నాప్‌డ్రాగన్ 6ఎస్ జెన్ 4 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఈ ఫోన్ కొనే ముందు ధర, ఫీచర్లు, స్పెషిఫికేషన్లకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ధర, ఆఫర్లు :
6GB ర్యామ్, 128GB స్టోరేజ్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ సింగిల్ వేరియంట్ ధర రూ. 27,999కు లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ కొనే యూజర్లు బ్యాంకు నుంచి రూ. 3వేలు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఎక్స్ఛేంజ్ నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది.
ఈ కంపెనీ 18 నెలల పాటు 5,000GB క్లౌడ్ స్టోరేజ్, గూగుల్ జెమిని ప్రో యాక్సెస్‌తో జియో బెనిఫిట్ అందిస్తోంది. మోటో జీ మ్యాక్స్ పాంటోన్ అలస్కాన్ బ్లూ, పాంటోన్ మలగా పాంటోన్ స్టార్‌గేజర్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయానికి అందుబాటులో ఉంటుంది.
Read Also : Apple iPhone 17 : ఆపిల్ ఫోన్ మీ డ్రీమా.. ఈ ఐఫోన్ 17 భారీగా తగ్గిందోచ్.. ఇంతకన్నా తక్కువకు మళ్లీ దొరకదు..!
స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఈ డ్యూయల్ సిమ్ ఫోన్లో 6.72-అంగుళాల 1,080 x 2,400 పిక్సెల్స్, ఫుల్ HD+ LCD స్క్రీన్ ఉంది. రిఫ్రెష్ రేట్ 120Hz, పిక్సెల్ డెన్సిటీ 391ppi టాప్ బ్రైట్నెస్ 1,050 నిట్స్ అందిస్తుంది. డిస్ప్లేకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ అందిస్తుంది.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 4 చిప్సెట్ ఉంది. మోటో G మ్యాక్స్ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్లో f/1.8 అపర్చర్‌తో 50MP సోనీ లైటియా 600 ప్రైమరీ కెమెరా 8MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ సైడ్ 32MP కెమెరా ఉంది.
కనెక్టివిటీ విషయానికి వస్తే..
4G, 5G, బ్లూటూత్, GPS, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. 7,000mAh బ్యాటరీ, 30W టర్బోపవర్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే బ్యాటరీ 63 గంటల వరకు వస్తుందని కంపెనీ పేర్కొంది. సేఫ్టీ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ కొలతలు 166.23 x 76.50 x 8.60mm, బరువు 213 గ్రాములు ఉంటుంది.
