Moto G04s Launch : మోటో G04s ఫోన్ వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. భారత్‌లో ధర ఎంతంటే?

Moto G04s Launch : మోటో జీ04ఎస్ భారత మార్కెట్లో 4జీబీ+ 64జీబీ ఆప్షన్ ధర రూ. 6,999కు పొందవచ్చు. జూన్ 5 నుంచి ఫ్లిప్‌కార్ట్, మోటరోలా ఇండియా వెబ్‌సైట్, ఎంపిక చేసిన రిటైల్ స్టోర్‌ల ద్వారా విక్రయిస్తోంది.

Moto G04s Launched ( Image Credit : Google )

Moto G04s Launch : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లో ప్రముఖ మోటోరోలా నుంచి మోటో G04s ఫోన్ వచ్చేసింది. గ్లోబల్ లాంచ్ తర్వాత మే 30న భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఈ మోటో G04s ఫోన్ ఫిబ్రవరిలో ఆవిష్కరించిన మోటో జీ04 కన్నా అప్‌గ్రేడ్ ఫీచర్లతో వచ్చింది.

Read Also : Apple iPhone 15 Discount : ఆపిల్ ఐఫోన్ 15పై భారీ తగ్గింపు.. ఏకంగా రూ.13వేలు డిస్కౌంట్.. లిమిటెడ్ ఆఫర్ మాత్రమే..!

మోటో G04s ఫోన్ ఏఆర్ఎమ్ మాలి-జీ57 ఫోన్ ఎంపీ1 జీపీయూతో ఆక్టా-కోర్ యూనిసోక్ టీ606 చిప్‌సెట్ ద్వారా పవర్ అందిస్తుంది. దీనికి 15డబ్ల్యూ వైర్డు ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000ఎంఎహెచ్ బ్యాటరీ సపోర్టు అందిస్తుంది. ఈ మోటో ఫోన్ 50ఎంపీ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. సింగిల్ ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లో అందుబాటులో ఉంటుంది.

భారత్‌‌‌లో మోటో జీ04ఎస్ ధర ఎంతంటే? :
మోటో జీ04ఎస్ భారత మార్కెట్లో 4జీబీ+ 64జీబీ ఆప్షన్ ధర రూ. 6,999కు పొందవచ్చు. జూన్ 5 నుంచి ఫ్లిప్‌కార్ట్, మోటరోలా ఇండియా వెబ్‌సైట్, ఎంపిక చేసిన రిటైల్ స్టోర్‌ల ద్వారా విక్రయిస్తోంది. ఈ ఫోన్ మొత్తం కాంకర్డ్ బ్లాక్, సీ గ్రీన్, శాటిన్ బ్లూ, సన్‌రైజ్ ఆరెంజ్ అనే 4 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

మోటో జీ04ఎస్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
మోటో జీ04ఎస్ ఫోన్ 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో 6.56-అంగుళాల హెచ్‌డీ+ (1,612 x 720 పిక్సెల్‌లు) ఐపీఎస్ ఎల్‌సీడీ స్క్రీన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ఎఆర్ఎమ్ మాలి-జీ57 ఎంపీ1 జీపీయూ, 4జీబీ ర్యామ్, 64జీబీ యూఎఫ్ఎస్ 2.2 ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో యూనిసోక్ టీ606 ఎస్ఓసీ ద్వారా అందిస్తుంది.

ర్యామ్ వర్చువల్‌గా 8జీబీ వరకు విస్తరించవచ్చు. మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా 1టీబీ వరకు స్టోరేజీ విస్తరణకు ఫోన్ సపోర్టు ఇస్తుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే.. మోటో జీ04ఎస్ ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్‌తో పాటు 50ఎంపీ ప్రైమరీ రియర్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. సెంటర్డ్ హోల్-పంచ్ స్లాట్‌లో ఉంచిన ఫ్రంట్ కెమెరా, 5ఎంపీ సెన్సార్‌ను కలిగి ఉంటుంది.

మోటో జీ04ఎస్ 15డబ్ల్యూ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000ఎంఎహెచ్ బ్యాటరీతో వస్తుంది. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో పాటు 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్‌తో వస్తుంది. ఈ మోటో ఫోన్వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్ 5.0, యూఎస్‌‌బీ టైప్-సీ కనెక్టివిటీకి సపోర్టు ఇస్తుంది. డస్ట్, స్ప్లాష్ నిరోధకతకు ఐపీ52 రేటింగ్‌తో కూడా వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ బరువు 178.8 గ్రాములు, 163.49 x 74.53 x 7.99ఎమ్ఎమ్ పరిమాణం ఉంటుంది.

Read Also : Lava Yuva 5G Launch : కొత్త ఫోన్ కొంటున్నారా? లావా యువ 5జీ ఫోన్ వచ్చేసిందోచ్.. ధర కేవలం రూ. 9499 మాత్రమే!