Moto G37 Series : వావ్.. ఈ 2 మోటో G37 ఫోన్లు అతి చౌకైన ధరకే.. ఇలా కొంటే ఇంకా తగ్గొచ్చు..!
Moto G37 Series : మోటో G37, మోటో G37 పవర్ ఫోన్ చూసేందుకు ఒకేలా కనిపిస్తాయి. కానీ, బ్యాటరీ, ఛార్జింగ్ స్టోరేజ్పరంగా భారీ తేడాలు ఉన్నాయి. మీకు ఏ ఫోన్ బెస్ట్ అనేది ఇప్పుడు వివరంగా చూద్దాం..
Moto G37 Series
- ఈ రెండు ఫోన్లలో డైమెన్సిటీ 6400 ప్రాసెసర్ 50MP కెమెరా సెటప్
- మోటో G37 పవర్లో 7000mAh బ్యాటరీ, 30W ఛార్జింగ్‌కు సపోర్ట్
- ఆండ్రాయిడ్ 16, 120Hz డిస్ప్లే, బ్యాంకు ఆఫర్లతో స్పెషల్ డిస్కౌంట్
Moto G37 Series : మోటోరోలా లవర్స్ కు గుడ్ న్యూస్.. మోటోరోలా బడ్జెట్ 5జీ ఫోన్లు భారీగా తగ్గాయి. మోటో G37, G37 పవర్‌పై లిమిటెట్ ఆఫర్‌ను కంపెనీ ప్రవేశపెట్టింది. మోటో G37 పవర్లో 7000mAh బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్, గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
లాంగ్ బ్యాటరీ లైఫ్ 5G కనెక్టివిటీ స్మార్ట్‌ఫోన్ కొనేవారికి మోటో G37 పవర్ అద్భుతంగా ఉంటుంది. ఈ మోటో జీ37 పవర్ ఫోన్ 4GB ర్యామ్ + 128GB స్టోరేజ్ (Moto G37 Series) వేరియంట్ ధర రూ. 15,999కు కొనేసుకోవచ్చు. 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్‌పై కూడా స్పెషల్ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ఆఫర్ లిమిటెడ్ టైమ్ వరకు మాత్రమే ఉంటుంది.
బ్యాంకు ఆఫర్లతో కొనాలంటే? :
మోటో జీ 37 పవర్ ఫోన్ 8GB+128GB వేరియంట్ అసలు ధర రూ 21,999 కాగా, రూ. 2వేలు బ్యాంక్ ఆఫర్‌తో ధర రూ. 19,999కు లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ పాంటోన్ ఇంపెనెట్రబుల్, పాంటోన్ కాప్రి, పాంటోన్ నాటికల్ బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ , (Motorola.in) ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్ల ద్వారా కొనేసుకోవచ్చు.
మోటో జీ37 ధర రూ 14,999గా ఉంటే బ్యాంక్ ఆఫర్‌తో ధర రూ. 13,999కి తగ్గుతుంది. ఈ ఫోన్ పాంటోన్ కాప్రి, పాంటోన్ ఇంపెనెట్రబుల్, పాంటోన్ నాటికల్ బ్లూ వంటి బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. మోటో G37, మోటో G37 పవర్ ఫోన్లు 1604×720 పిక్సెల్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 1050 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్‌తో 6.7-అంగుళాల HD+ ఎల్సీడీ డిస్ప్లేతో వస్తుంది.
ఈ రెండు ఫోన్లు గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ అందిస్తాయి. ఏఆర్ఎమ్ మాలి-జీ57 ఎంసీ2 జీపీయూతో మీడియాటెక్ డైమన్షిటీ 6400, 6nm ప్రాసెసర్‌తో పనిచేస్తాయి. ఈ స్మార్ట్ఫోన్లు ఆండ్రాయిడ్ 16 పై రన్ అవుతాయి. కంపెనీ OS అప్డేట్, 3 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్లను అందిస్తుందని కంపెనీ చెబుతోంది. సేఫ్టీ కోసం ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఉంది.
మోటో జీ37 ఫోన్ 4GB ర్యామ్, 64GB స్టోరేజ్, మోటో G37 పవర్ ఫోన్ 4GB, 8GB ర్యామ్, 64GB,128GB స్టోరేజ్‌తో వస్తుంది. ఈ రెండు ఫోన్లలో మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను 1TB వరకు పెంచుకోవచ్చు.
ఫోటోగ్రఫీ పరంగా చూస్తే.. :
ఈ రెండు స్మార్ట్ఫోన్లలో బ్యాక్ సైడ్ ఎఫ్/1.8 అపర్చర్, 2-ఇన్-1 లైట్ సెన్సార్‌తో 50MP ప్రైమరీ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 8MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ రెండు ఫోన్లలో IP64 రేటింగ్, MIL-STD 810H సర్టిఫికేషన్‌తో వస్తాయి. బ్యాటరీలో మాత్రమే అతిపెద్ద తేడా ఉంది.
మోటో జీ37లో 20W టర్బో ఛార్జింగ్, 6W రివర్స్ ఛార్జింగ్‌తో 5,200mAh బ్యాటరీ ఉంది. మోటో జీ37 పవర్లో 30W టర్బో ఛార్జింగ్, 6W రివర్స్ ఛార్జింగ్‌తో 7,000mAh బ్యాటరీ ఉంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, డ్యూయల్ 4జీ, VoLTE, Wi-Fi5, బ్లూటూత్ 5.4, GPS, 3.5mm ఆడియో జాక్ యూఎస్బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి.
