Moto G86 Power 5G : కొత్త ఫోన్ కొంటున్నారా? మతిపొగొట్టే ఫీచర్లతో మోటో G86 5G ఫోన్ వచ్చేసింది.. ధర జస్ట్ ఎంతంటే?

Moto G86 Power 5G : మోటోరోలా సరికొత్త ఫోన్ ఇదిగో.. మోటో G86 పవర్ 5G ఫోన్ లాంచ్ అయింది. ధర, స్పెషిఫికేషన్లు ఇతర వివరాలు ఇలా ఉన్నాయి.

Moto G86 Power 5G

Moto G86 Power 5G : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. మోటోరోలా నుంచి సరికొత్త మొబైల్ ఫోన్ వచ్చేసింది. మోటోరోలా ఇండియా మోటో G86 పవర్ 5G అధికారికంగా (Moto G86 Power 5G)  లాంచ్ చేసింది. ఈ ఫోన్ రూ. 20వేల ధరలో లభ్యం కానుంది.

120Hz pOLED డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 7400 చిప్‌సెట్, OISతో 50MP మెయిన్ కెమెరాతో వస్తుంది. ఈ మోటో ఫోన్ వీగన్ లెదర్ డిజైన్‌తో వస్తుంది. ఆగస్టు 6 నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులో ఉంటుంది. భారత మార్కెట్లో ధర, కలర్ ఆప్షన్లు, కెమెరా, డిస్‌ప్లే సహా మోటో G86 పవర్ 5G ఫోన్ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

మోటో G86 పవర్ 5G స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
మోటో G86 పవర్ 5G స్మార్ట్‌ఫోన్ 6.67-అంగుళాల 1.5K సూపర్ HD pOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో కలిగి ఉంది. అలాగే, డిస్‌ప్లే గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌తో వస్తుంది. ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. మోటో G86 పవర్‌లో OISతో కూడిన 50MP సోనీ LYTIA 600 మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫోన్‌లో 4K వీడియో రికార్డింగ్‌కు సపోర్టు ఇచ్చే 32MP కెమెరా కూడా ఉంది.

Read Also : Banks AMB Rule : కస్టమర్లకు బిగ్ రిలీఫ్.. ఈ ప్రభుత్వ బ్యాంకుల్లో సేవింగ్స్ అకౌంట్లకు మినిమం బ్యాలెన్స్ అక్కర్లేదు.. మీ బ్యాంకు ఉందేమో చెక్ చేసుకోండి..!

ఈ మోటోరోలా ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 చిప్‌తో వస్తుంది. 8GB ర్యామ్, 128GB స్టోరేజ్‌తో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 6720mAh బ్యాటరీతో 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఇంకా, IP68, IP69 సర్టిఫికేషన్లతో వస్తుంది. మోటో G86 పవర్ 5G ఆండ్రాయిడ్ 15పై రన్ అవుతుంది. 3 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ పొందుతుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, డాల్బీ అట్మోస్, హై-రెస్ ఆడియో, స్మార్ట్ కనెక్ట్ 2.0 ఇతర ముఖ్యమైన ఫీచర్లు ఉన్నాయి.

మోటో G86 పవర్ 5G ధర, కలర్ ఆప్షన్లు :
మోటో G86 పవర్ ఫోన్ మొత్తం పాంటోన్ కాస్మిక్ స్కై, పాంటోన్ గోల్డెన్ సైప్రస్, పాంటోన్ స్పెల్‌బౌండ్ అనే 3 కలర్ ఆప్షన్లలో పొందవచ్చు.