Banks AMB Rule : కస్టమర్లకు బిగ్ రిలీఫ్.. ఈ ప్రభుత్వ బ్యాంకుల్లో సేవింగ్స్ అకౌంట్లకు మినిమం బ్యాలెన్స్ అక్కర్లేదు.. మీ బ్యాంకు ఉందేమో చెక్ చేసుకోండి..!
Banks AMB Rule : ప్రభుత్వ బ్యాంకులు తమ కస్టమర్లకు బిగ్ రిలీఫ్ అందించాయి. మినిమం బ్యాలెన్స్ రూల్స్ ఎత్తేశాయి. మీ బ్యాంకు అకౌంట్ ఉందో లేదో చెక్ చేసుకోండి..

Banks AMB Rule
Banks AMB Rule : బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఇకపై మీ అకౌంటులో మినీమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. బ్యాంకింగ్ (Banks AMB Rule) రూల్స్ మారాయి. మీరు ప్రతి నెలా మీ బ్యాంకు ఖాతాలో కనీస బ్యాలెన్స్‌ను మెయింటైన్ చేయలేకపోతున్నారా? ప్రతిసారీ పెనాల్టీ పడుతుందని ఆందోళన అవసరం లేదు.
దేశంలోని అనేక పెద్ద ప్రభుత్వ బ్యాంకులు సేవింగ్స్ అకౌంట్లలో కనీస బ్యాలెన్స్‌ను ఉంచనందుకు ఛార్జీలను విధించాయి. ఇకపై అలాంటి ఇబ్బంది ఉండదు. కొన్ని ప్రభుత్వ బ్యాంకులు ఇప్పుడు కనీస బ్యాలెన్స్ విషయంలో రూల్స్ ఎత్తేశాయి. ఇంతకీ ఏయే బ్యాంకులు సేవింగ్స్ అకౌంట్లలో మినీమం బ్యాలెన్స్ నిబంధనలు తొలగించాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా :
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెప్టెంబర్ 2025 త్రైమాసికం నుంచి సాధారణ సేవింగ్స్ అకౌంట్లలో కనీస బ్యాలెన్స్ ఉంచనందుకు ఎలాంటి ఛార్జీ విధించదని ప్రకటించింది. బ్యాంక్ ఈ సమాచారాన్ని పత్రికా ప్రకటనలో తెలిపింది. మీ బ్యాలెన్స్ నిర్దేశించిన పరిమితి కన్నా తక్కువగా ఉన్నప్పటికీ పెనాల్టీ పడదు.
బ్యాంక్ ఆఫ్ బరోడా :
బ్యాంక్ ఆఫ్ బరోడా జూలై 1, 2025 నుంచి అన్ని స్టాండర్డ్ సేవింగ్స్ అకౌంట్లలో కనీస బ్యాలెన్స్ మెయింటైన్ చేయినందుకు ఛార్జీని కూడా మాఫీ చేసింది. అయితే, ఈ మినహాయింపు ప్రీమియం సేవింగ్స్ అకౌంట్ల పథకాలకు వర్తించదు.
ఇండియన్ బ్యాంక్ :
ఇండియన్ బ్యాంక్ అన్ని సేవింగ్స్ అకౌంట్లపై కనీస బ్యాలెన్స్ ఛార్జీని పూర్తిగా రద్దు చేసింది. ఈ సౌకర్యం జూలై 7, 2025 నుంచి అమల్లోకి వచ్చింది.
కెనరా బ్యాంకు :
కెనరా బ్యాంక్ ఈ సౌకర్యాన్ని మే 2025లోనే అందించింది. ఇప్పుడు సాధారణ సేవింగ్స్ అకౌంట్, శాలరీ అకౌంట్, NRI అకౌంటులో కనీస బ్యాలెన్స్ ఉంచనందుకు ఎలాంటి జరిమానా ఉండదు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) :
ఎస్బీఐ ఇప్పటికే ముందంజలో ఉంది. 2020 నుంచే ఎస్బీఐ అన్ని సేవింగ్స్ అకౌంట్లపై మినిమం బ్యాలెన్స్ రూల్ రద్దు చేసింది. ఎస్బీఐ ఖాతాదారులకు గత కొన్ని ఏళ్లుగా ఈ సమస్య నుంచి ఉపశమనం కలిగించింది.
బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) :
బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల సేవింగ్ అకౌంట్లలో కనీస బ్యాలెన్స్ ఉంచనందుకు విధించే జరిమానాను పూర్తిగా తొలగించింది. కస్టమర్లకు మరింత సౌలభ్యాన్ని అందిస్తుంది. ఆర్థిక సౌలభ్యాన్ని పెంచుతుందని బ్యాంక్ చెబుతోంది.
యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ (AMB) ఏంటి? :
సగటు నెలవారీ బ్యాలెన్స్ (AMB) అంటే.. యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్.. మీరు ప్రతి నెలా మీ బ్యాంక్ ఖాతాలో ఉంచాల్సిన కనీస సగటు బ్యాలెన్స్. ఈ బ్యాలెన్స్ కన్నా తక్కువగా ఉంటే ఇప్పటివరకు బ్యాంకులు పెనాల్టీలు వసూలు చేసేవి. కానీ, ఇప్పుడు చాలా బ్యాంకులు ఈ షరతును ఎత్తేశాయి.
దాంతో కస్టమర్లకు భారీ ఉపశమనంగా చెప్పొచ్చు. ఈ బ్యాంకుల్లో మీకు సేవింగ్స్ అకౌంట్ ఉంటే ఇప్పుడు మీరు ప్రతి నెలా బ్యాలెన్స్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా చిన్న పట్టణాలు లేదా గ్రామాల్లో నివసించే వారికి లేదా ఆదాయం పరిమితంగా ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటుంది.