Honda Min EV Car : వావ్.. హోండా కొత్త మినీ EV భలే ఉందిగా.. స్మార్ట్ ఫీచర్లు కేక.. సింగిల్ ఛార్జ్‌తో 245కి.మీ రేంజ్.. సిటీ రైడర్లకు బెస్ట్..!

Honda Electric Car : కొత్త హోండా మినీ ఎలక్ట్రిక్ కారు.. సిటీ రైడర్ల కోసం N-One Eను ఆవిష్కరించింది. సింగిల్ ఛార్జ్‌తో 245కి.మీ దూసుకెళ్లగలదు.

Honda Min EV Car : వావ్.. హోండా కొత్త మినీ EV భలే ఉందిగా.. స్మార్ట్ ఫీచర్లు కేక.. సింగిల్ ఛార్జ్‌తో 245కి.మీ రేంజ్.. సిటీ రైడర్లకు బెస్ట్..!

Honda Electric Car

Updated On : July 30, 2025 / 1:51 PM IST

Honda Min EV Car : హోండా లవర్స్‌కు గుడ్ న్యూస్.. ప్రముఖ టూవీలర్ దిగ్గజం ఎట్టకేలకు అతి చిన్న ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది. అదే.. హోండా N-One E మినీ EV కారు.. ప్రత్యేకించి సిటీలో డ్రైవ్ చేసే వాహనదారుల కోసం (Honda Electric Car) కంపెనీ తయారు చేసింది.

ఈ కాంపాక్ట్ EV కారు ముఖ్యంగా ఇరుకైన లేన్లు, రద్దీగా ఉండే నగర రోడ్లకు సరైనది. ఎందుకంటే కారు చూసే చాలా చిన్న పరిమాణంలో ఉంటుంది. అలాగే, ఫీచర్ల పరంగా చూస్తే.. విద్యార్థులు, ఆఫీసులకు వెళ్లేవారు, చిన్న ఫ్యామిలీలకు అద్భుమైన ఆప్షన్ అని చెప్పొచ్చు.

డిజైన్, లుక్స్ :
హోండా N-One E రెట్రో-స్టైల్ డిజైన్‌తో ప్రత్యేకంగా ఉంటుంది. ఇందులో రౌండ్ హెడ్‌ల్యాంప్‌లు, బాక్సీ బాడీ, కర్వడ్ బంపర్‌లు ఉన్నాయి. క్లోజ్డ్ ఫ్రంట్ గ్రిల్ దీనికి క్లీన్ ఎలక్ట్రిక్ లుక్‌ను అందిస్తుంది. ఇంటిగ్రేటెడ్ ఛార్జింగ్ పోర్ట్‌ను కలిగి ఉంటుంది. ఈ EV కారు పొడవు 3,400mm ఉంటుందని అంచనా. జపాన్‌లోని కీ కార్ సెగ్మంట్‌లో పర్‌ఫెక్ట్ అని చెప్పొచ్చు. కాంపాక్ట్ సైజు, స్టైలిష్ బాడీ రద్దీగా ఉండే సిటీ రోడ్లకు సరైనదిగా ఉంటుంది.

Read Also : Upcoming Smartphones : కొనేందుకు రెడీగా ఉండండి.. ఆగస్టు 2025లో కొత్త స్మార్ట్‌ఫోన్లు వచ్చేస్తున్నాయ్.. పిక్సెల్ నుంచి వివో ఫోన్ల వరకు..!

క్యాబిన్, ఫీచర్లు :
ఈ మినీ కారు లోపల N-One E క్యాబిన్ క్లీన్ లేఅవుట్‌ను కలిగి ఉంటుంది. హోండా కంట్రోలింగ్ కోసం ఫిజికల్ బటన్లను వాడింది. డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే కింద చిన్న స్టోరేజీ షెల్ఫ్‌ కూడా ఉంది. ఈ కారు 50:50 స్ప్లిట్-ఫోల్డింగ్ బ్యాక్ సీట్లతో వస్తుంది. వినియోగదారులు తమకు అవసరమైతే అదనపు లగేజీ కూడా తీసుకెళ్లొచ్చు.

వెహికల్-టు-లోడ్ (V2L) టెక్నాలజీ చాలా అద్భుతంగా ఉంది. కారు బ్యాటరీతో చిన్న ఎలక్ట్రానిక్ డివైజ్‌లకు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఈ కొత్త ఫీచర్ కోసం అదనపు అడాప్టర్‌ను హోండా యాక్సెసరీ స్టోర్‌ల నుంచి కొనుగోలు చేయవచ్చు.

బ్యాటరీ, రేంజ్ :
హోండా N-Van e కారు మాదిరిగానే N-One E కొత్త మినీ EV కారు రాబోతుంది. ఇందులో కూడా అదే ఎలక్ట్రిక్ సెటప్‌ ఉండే అవకాశం ఉంది. ఈ కారు ఫుల్ ఛార్జ్‌పై 245 కిలోమీటర్ల వరకు డ్రైవింగ్ రేంజ్‌ను అందిస్తుందని అంచనా. 50kW DC ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. కేవలం 30 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. పవర్ అవుట్‌పుట్ దాదాపు 63bhp కావచ్చు. రోజువారీ నగర ప్రయాణాలకు, చిన్న ప్రయాణాలకు ఈ మినీ ఈవీ కారు అద్భుతంగా ఉంటుంది.

సిటీ లైఫ్‌కు బెస్ట్ ఈవీ కారు :
ఈ మినీ EV కారు నగర వాహనదారుల కోసం రూపొందించారు. కాంపాక్ట్, సరసమైన ధరలో స్టైలిష్ కారు కోరుకునేవారికి బెస్ట్. చాలా తేలికగా ఉంటుంది. అద్భుతమైన ఫీచర్లు కలిగి ఉంది. హోండా సెప్టెంబర్ 2025 నాటికి జపాన్‌లో N-One E మినీ కారును లాంచ్ చేయాలని యోచిస్తోంది. ఆ తర్వాత యూకేలో కూడా ఈ మినీ ఈవీ కారును లాంచ్ చేసే అవకాశం ఉంది. బడ్జెట్‌ ధరలోనే కొత్త ఎలక్ట్రిక్‌ కార్లకు మారాలనుకునే వినియోగదారులకు ఈ మినీ EV బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.