Motorola Days Sale (Image Credit To Original Source)
Motorola Days Sale : మోటోరోలా అభిమానులకు పండగే.. మీరు మోటోరోలా అభిమాని అయితే ఈ బ్రాండ్ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో మోటోరోలా డేస్ సేల్ నడుస్తోంది. ఆసక్తిగల కస్టమర్ల కోసం అనేక డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం బెస్ట్ సెల్లింగ్ మోటోరోలా స్మార్ట్‌ఫోన్‌లపై అదిరిపోయే ఆఫర్లు పొందవచ్చు.
ఈ సేల్ సమయంలో మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ 5జీ ఫోన్ భారీ డిస్కౌంట్‌తో లభ్యమవుతోంది. అందులోనూ ప్రీమియం ఫీచర్లు ఉన్న ఈ మోటోరోలా ఫోన్ బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, ఈఎంఐ ఆప్షన్లతో లభిస్తోంది. ఈ మోటోరోలా ఫోన్ తక్కువ ధరకే ఎలా కొనుగోలు చేయాలో ఇప్పుడు చూద్దాం..
మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్ సేల్ ఆఫర్ :
మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్ మోడల్ 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ రూ. 25,999 తగ్గింపుతో లభిస్తోంది. అంటే.. 12శాతం తగ్గింపు తర్వాత ధర రూ. 22999 అవుతుంది. దీనిపై మొత్తంగా రూ. 3వేలు సేవ్ చేసుకోవచ్చు.
Motorola Days Sale (Image Credit To Original Source)
బ్యాంక్ ఆఫర్లు, ఈఎంఐ ఆప్షన్ :
యాక్సిస్, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్బీఐ బ్యాంక్ కార్డులపై రూ. 2వేలు తగ్గింపు పొందవచ్చు. అదనంగా, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్, ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ కార్డులపై రూ. 3050 తగ్గింపు పొందవచ్చు. అంతేకాదు.. రూ. 21950 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా పొందవచ్చు. రూ. 1004 నుంచి ఈఎంఐ ఆప్షన్ కూడా కొనుగోలు చేయవచ్చు.
Read Also : iPhone 15 Sale : ఐఫోన్ కొనేవారికి అద్భుతమైన ఆఫర్.. అమెజాన్‌లో ఐఫోన్ 15పై రూ.29,651 తగ్గింపు.. ఎలాగంటే?
భారీ డిస్‌ప్లే, పవర్‌ఫుల్ ప్రాసెసర్ :
ఈ మోటోరోలా హ్యాండ్‌సెట్ 120Hz రిఫ్రెష్ రేట్ 2712×1220 పిక్సెల్ రిజల్యూషన్‌తో భారీ 6.7-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. మల్టీ టాస్కింగ్ కోసం ఈ మోటో ఆండ్రాయిడ్ 15పై రన్ అవుతుంది. మీడియాటెక్ డైమన్షిటీ 7400 ప్రాసెసర్‌తో వస్తుంది.
బెస్ట్ కెమెరా ఫీచర్లు :
కెమెరా, వీడియో ఫీచర్ల కోసం 50MP మెయిన్ కెమెరాతో వస్తుంది. ఫ్రంట్ సైడ్ సెల్ఫీల కోసం పవర్‌ఫుల్ 32MP కెమెరా ఉంది. అద్భుతమైన క్లియర్ ఫొటోలను క్యాప్చర్ చేయొచ్చు.
లాంగ్ బ్యాటరీ లైఫ్ :
పవర్ విషయానికొస్తే.. ఈ మోటోరోలా ఫోన్ 5,500mAh బ్యాటరీతో వస్తుంది. 68W టర్బోపవర్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. IP69 రేటింగ్‌తో వస్తుంది. బ్లూటూత్, GPS, Wi-Fi వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్‌తో ఇతర బ్రాండ్‌ల ఫోన్‌లను కూడా కొనేసుకోవచ్చు. రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా ఈ అద్భుతమైన డీల్స్ మిస్ చేసుకోవద్దు.