Motorola Edge 40 Neo price drops, now available at Rs 22,999
Motorola Edge 40 Neo Price : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం మోటోరోలా కొత్త మోడల్ మోటోరోలా ఎడ్జ్ 40 నియో ధర భారీగా తగ్గింది. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఆకర్షణీయమైన తగ్గింపును పొందింది. ఆసక్తిగల కొనుగోలుదారులు ఈ ఫోన్ తక్కువ ధరకు పొందవచ్చు. మోటోరోలా ఫోన్ 8జీబీ + 128జీబీ వేరియంట్ రూ. 23,999 ధరతో అందుబాటులో ఉంది.
మోటో ఫోన్ ప్రస్తుతం రూ. 22,999 వద్ద అమ్మకానికి ఉంది. వినియోగదారులు ఈ డివైజ్‌పై ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు. 12జీబీ ర్యామ్ మోడల్ కూడా ఉంది. దీనిని రూ. 24,999కి కొనుగోలు చేయవచ్చు. ఈ డీల్ ఎప్పుడు ముగుస్తుందో ప్రస్తుతానికి తెలియదు. కానీ, ఈ డీల్ కనీసం కొన్ని రోజులు ఉండవచ్చు. గత ఏడాది లాంచ్ అయిన మోటోరోలా ఎడ్జ్ 40 నియో స్పెషిఫికేషన్లు, ఫీచర్లను ఓసారి పరిశీలిద్దాం.
మోటోరోలా ఎడ్జ్ 40 నియో స్పెక్స్, ఫీచర్లు :
మోటోరోలా ఎడ్జ్ 40 నియో 144హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.55-అంగుళాల పీఓఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. కర్వ్డ్ డిస్‌ప్లే ఒక బిలియన్ రంగులకు సపోర్టు ఇస్తుంది. 10-బిట్ కలర్ ప్యానెల్‌తో వస్తుంది. డిస్‌ప్లే 1300 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ని కలిగి ఉంది. ఐపీ68 రేటింగ్‌ను కలిగి ఉంది. దుమ్ము, నీటి-నిరోధకతను కలిగి ఉందని పేర్కొంది.
ఐపీ68 ప్రొటెక్షన్ రేటింగ్‌తో ప్రపంచంలోనే అత్యంత తేలికైన 5జీ ఫోన్ అని మోటోరోలా తెలిపింది. ఈ ఫోన్ బరువు 172 గ్రాములు, మందం 7.79 మిమీ ఉంటుంది. బ్లాక్ బ్యూటీ కలర్ వేరియంట్ గ్లాస్ ఫినిషింగ్‌ను కలిగి ఉండగా వెనుక వైపున, వేగన్ లెదర్ ఎండ్ రెండు కలర్ ఆప్షన్ ఉంది. హుడ్ కింద, మీడియాటెక్ డైమన్షిటీ 7030 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్ వై-ఫై6ఈకి సపోర్టు ఇస్తుంది.
గేమింగ్‌లో బెస్ట్ స్పీడ్ అందిస్తుంది. ఈ ఫోన్ క్లౌడ్ గేమింగ్‌ను కూడా కలిగి ఉంది. తద్వారా వినియోగదారులు తమ ఫోన్‌ను హ్యాండ్‌హెల్డ్ కన్సోల్‌గా ఉపయోగించుకోవచ్చు. క్లౌడ్ నుంచి గేమ్‌లను ఆడవచ్చు. ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. మోటోరోలా ఎడ్జ్ 40 నియో ఓఐఎస్‌తో కూడిన 50ఎంపీ అల్ట్రా-పిక్సెల్ నైట్ విజన్ ప్రైమరీ కెమెరాతో వస్తుంది.
సెకండరీ కెమెరా 13ఎంపీ, అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌ను కలిగి ఉంది. ఫ్రంట్ సైడ్ క్వాడ్-పిక్సెల్ టెక్నాలజీతో 32ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఫోన్ బాక్స్‌లో 5,000ఎంఎహెచ్ బ్యాటరీ, 68డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ ఛార్జర్‌ను కూడా అందిస్తుంది. మోటోరోలా 2 ఓఎస్ అప్‌గ్రేడ్‌లు, 3 ఏళ్ల సెక్యూరిటీ అప్‌గ్రేడ్‌లను అందిస్తుంది.
Read Also : OnePlus 11 Discount : అమెజాన్‌లో వన్‌ప్లస్ 11పై అదిరే డిస్కౌంట్.. ఈ డీల్ అసలు మిస్ కావొద్దు!