OnePlus 11 Discount : అమెజాన్‌లో వన్‌ప్లస్ 11పై అదిరే డిస్కౌంట్.. ఈ డీల్ అసలు మిస్ కావొద్దు!

OnePlus 11 Discount : కొత్త ఫోన్ కొనుగోలు చేసేవారికి అమెజాన్ అదిరే డీల్స్ అందిస్తోంది. వన్‌ప్లస్ 11 ఫోన్ కొనుగోలుపై అద్భుతమైన డిస్కౌంట్ అందుబాటులో ఉంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

OnePlus 11 Discount : అమెజాన్‌లో వన్‌ప్లస్ 11పై అదిరే డిస్కౌంట్.. ఈ డీల్ అసలు మిస్ కావొద్దు!

OnePlus 11 available discount on Amazon, here is how the deal works

OnePlus 11 Discount : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో వన్‌ప్లస్ 11పై అదిరే డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. గత ఏడాది ఫిబ్రవరిలో ఈ వన్‌ప్లస్ ఫోన్ లాంచ్ కాగా.. చౌకైన స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 2 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. వన్‌ప్లస్ 11 కొనుగోలు చేసేవారికి ఇదో బెస్ట్ ఛాన్స్ అని చెప్పవచ్చు. ఈ ఫోన్ అమెజాన్‌లో ప్రత్యేక తగ్గింపుతో అందుబాటులో ఉంది. రూ. 52వేల లోపు ధరకే ఈ వన్‌ప్లస్ 11 ఫోన్ మీ సొంతం చేసుకోవచ్చు. ఈ డీల్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Read Also : Apple iPhone 15 Pro : ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 15 ప్రోపై భారీగా తగ్గింపు.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు!

అమెజాన్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేస్తే.. నేరుగా 4 శాతం తగ్గింపును పొందవచ్చు. దాంతో ఈ వన్‌ప్లస్ 11 ధర రూ. 54,999కి తగ్గుతుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై రూ.3వేల ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందచవ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై రూ.3వేల తగ్గింపు కూడా పొందవచ్చు.

వన్‌ప్లస్ 11 స్పెషిఫికేషన్లు, ఫీచర్లు : 
మరిన్ని ఆఫర్‌ల కోసం అమెజాన్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. మీ పాత డివైజ్ ఎక్స్ఛేంజ్ కోసం రూ. 27,600 వరకు తగ్గింపు ఆఫర్ పొందవచ్చు. అయితే, ఎక్స్ఛేంజ్ వాల్యూ, పాత ఫోన్ వర్కింగ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ ఫోన్ ఎటర్నల్ గ్రీన్, టైటాన్ బ్లాక్ అనే రెండు కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. వన్‌ప్లస్ 11 ప్రత్యేకమైన ఫీచర్లలో ఒకటి.. స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 2 చిప్‌సెట్. ఈ చిప్‌సెట్ పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. సీఓడీ లేదా బీబీఎంఐ వంటి మల్టీ టాస్కింగ్, ఇతర డిమాండింగ్ టాస్క్‌లను సజావుగా నిర్వహించగలదు.

అంతేకాకుండా, వన్‌ప్లస్ డివైజ్‌ల్లో సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పీరియన్స్ రూపొందించడానికి కస్టమైజడ్ అనేక ఆప్షన్లతో పాటు సరికొత్త ఆండ్రాయిడ్ ఓఎస్‌తో క్లీన్ సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తూనే ఉన్నాయి. ఈ డివైజ్ 100డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్టుతో బలమైన 5,000ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. దాదాపు 30 నిమిషాల్లో 0 నుంచి 100 శాతం వరకు వేగవంతమైన ఛార్జింగ్‌ని అందిస్తుంది.

కెమెరా విషయానికి వస్తే.. వన్‌ప్లస్ 11 5జీ ఫోన్ 50ఎంపీ ప్రధాన సెన్సార్, 48ఎంపీ అల్ట్రా-వైడ్ సెన్సార్, 32ఎంపీ టెలిఫోటో సెన్సార్‌తో కూడిన ట్రిపుల్-లెన్స్ బ్యాక్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది. వివిధ లైటింగ్ పరిస్థితుల్లోనూ అద్భుతమైన ఫొటోలను క్యాప్చర్ చేయగలదు. 60ఎఫ్‌పీఎస్ వరకు 4కె వీడియోలను రికార్డ్ చేయగలదు. ప్రత్యేకించి ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ల ద్వారా మరిన్ని తగ్గింపులను పొందవచ్చు.

Read Also : Apple iPhone 13 : ఆపిల్ ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్.. ఇంతకీ, ఈ ఐఫోన్ కొనాలా? వద్దా? పూర్తి వివరాలివే!