Motorola Edge 50 Fusion
Motorola Edge 50 Fusion : మోటోరోలా అభిమానులకు అద్భుతమైన ఆఫర్.. అమెజాన్‌లో మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ భారీగా తగ్గింది. ఈ మోటోరోలా ఫోన్ ధర రూ. 16వేలకు పైగా తగ్గింపుతో కొనేసుకోవచ్చు. ఈ మోటోరోలా ఎడ్జ్ 50 ఫోన్ అసలు ధర రూ. 22,999 ఉండగా ఇప్పుడు డిస్కౌంట్ ధరకే లభిస్తోంది.
అంతేకాదు.. అదనపు బ్యాంక్ (Motorola Edge 50 Fusion) సేవింగ్స్ కూడా పొందవచ్చు. కర్వడ్ స్క్రీన్, క్లీన్ డిజైన్, బ్యాటరీతో ఎడ్జ్ 50 ఫ్యూజన్ అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. మోటోరోలా మిడ్ రేంజ్ ఫోన్లలో ఈ లేటెస్ట్ డిస్కౌంట్ అసలు వదులుకోవద్దు. ఆసక్తిగల కొనుగోలుదారులు తగ్గింపు ధరకే కొనుగోలు చేయొచ్చు.
అమెజాన్‌లో మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ధర :
అమెజాన్ మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ధరను రూ.18,681కి తగ్గించింది. లాంచ్ ధర కన్నా రూ.4,318 తగ్గింపు అందిస్తుంది. ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేసే యూజర్లకు రూ.3వేలు అదనపు తగ్గింపు లభిస్తుంది. దాంతో ధర రూ.15,681కి తగ్గుతుంది.
Read Also : Vivo X300 Series : వివో క్రేజే వేరబ్బా.. DSLR రేంజ్‌లో 200MP కెమెరా ఫోన్ వస్తోంది.. ధర ఎంతో తెలిసిందోచ్..!
అమెజాన్ ఎంపిక చేసిన బ్యాంకులకు నెలకు రూ. 906 నుంచి నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను కూడా అందిస్తోంది. ధర ఇంకా తగ్గాలంటే.. మీ పాత ఫోన్‌ను అమెజాన్‌లో ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. డివైజ్ మోడల్ కండిషన్ బట్టి ఎక్స్ఛేంజ్ బోనస్ రూ. 17,450 వరకు ఉండవచ్చు.
మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ స్పెసిఫికేషన్లు :
మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ 6.7-అంగుళాల FHD+ pOLED డిస్‌ప్లే కలిగి ఉంది. HDR10+, 144Hz వరకు రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ కలిగి ఉంది. హుడ్ కింద, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 2 చిప్‌సెట్‌ను అందిస్తుంది. అడ్రినో 710 జీపీయూతో వస్తుంది. 12GB వరకు LPDDR4X ర్యామ్, 512GB వరకు UFS 2.2 స్టోరేజీని కలిగి ఉంది.
ఈ మోటోరోలా ఆండ్రాయిడ్ 14-ఆధారిత కస్టమ్ స్కిన్‌పై రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. OISతో 50MP సోనీ IMX700 సెన్సార్, 13MP అల్ట్రా-వైడ్ కెమెరాతో వస్తుంది. ఫ్రంట్ సైడ్ 32MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 68W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,000mAh బ్యాటరీని అందిస్తుంది.