Motorola Edge 60 Fusion 5G : వారెవ్వా.. ఖతర్నాక్ డిస్కౌంట్.. ఈ మోటోరోలా AI ఫోన్ మీ బడ్జెట్‌లోనే.. ధర ఎంతో తెలిస్తే ఎగిరిగంతేస్తారు!

Motorola Edge 60 Fusion 5G : మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ 5జీ ఫోన్ అతి చౌకైన ధరకే లభిస్తోంది. ఇలాంటి అద్భుతమైన డీల్ మళ్లీ దొరకదు. కొంటే ఇప్పుడే కొనేసుకోండి.

Motorola Edge 60 Fusion 5G

  • ఫ్లిప్‌కార్ట్‌లో మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ 5జీ డిస్కౌంట్ ధరకే
  • బ్యాంక్, కార్డు ఆఫర్లతో ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ ఆప్షన్లతో మరింత తగ్గింపు
  • 120Hz అమోల్డ్ డిస్‌ప్లే, 50MP కెమెరా, డైమెన్సిటీ చిప్‌సెట్, 5,500mAh బ్యాటరీ

Motorola Edge 60 Fusion 5G : మోటోరోలా ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. ఫ్లిప్‌కార్ట్‌లో మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ 5G భారీ తగ్గింపుతో లభిస్తోంది. బ్యాంక్, కార్డ్ ఆఫర్లతో మరింత తగ్గింపు పొందవచ్చు. పాత స్మార్ట్‌ఫోన్‌లపై ఎక్స్ఛేంజ్ బోనస్‌తో పాటు ఈఎంఐ ఆప్షన్లు కూడా పొందవచ్చు. పవర్‌ఫుల్ డ్యూయల్ కెమెరా, బిగ్ స్క్రీన్, లాంగ్ బ్యాటరీ లైఫ్‌తో వస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ 5G డీల్ :
భారతీయ మార్కెట్లలో మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ 5G ఫోన్ రూ.20,999 ధరతో వచ్చింది. రూ.1,000 ఫ్లాట్ డిస్కౌంట్‌ ద్వారా ధర రూ.19,999కు తగ్గింది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్, ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్‌తో మరో రూ.1,000 ఆదా అవుతుంది.

మొత్తంగా ఈ ఫోన్ ధర రూ.18,999కి సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ఈఎంఐ ప్లాన్‌ కూడా ఎంచుకోవచ్చు. 6 నెలల ఈఎంఐ ప్లాన్ కింద నెలకు రూ. 3,334 చొప్పున చెల్లించాలి. మీ పాత స్మార్ట్‌ఫోన్‌ ఉంటే ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 15,950 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ కూడా పొందవచ్చు.

Read Also : Apple iPhone 17 Pro : ఇది కదా ఆఫర్.. ఆపిల్ ఐఫోన్ 17 ప్రోపై కిర్రాక్ డిస్కౌంట్.. ఈ డీల్ మళ్లీ దొరకదు!

మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ 5G స్పెషిఫికేషన్లు :
మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ 5జీ ఫోన్ డ్యూయల్-కెమెరా సెటప్‌తో వస్తుంది. 50MP ప్రైమరీ సెన్సార్, 13MP అల్ట్రావైడ్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4K రికార్డింగ్‌కు సపోర్టు ఇస్తుంది.

డిస్‌ప్లే డిపార్ట్‌మెంట్ 120Hz రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i, HDR+ సపోర్ట్‌తో 6.7-అంగుళాల అమోల్డ్ ప్యానెల్‌తో వస్తుంది. హుడ్ కింద, మీడియాటెక్ డైమెన్సిటీ 7400 చిప్‌సెట్, 12GB వరకు ఎల్‌పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. కొనుగోలుదారులు మైక్రో SD కార్డ్ ద్వారా మెమరీని 1TB వరకు విస్తరించవచ్చు.

5,500mAh బ్యాటరీ, 68W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. MIL-STD-810H సర్టిఫికేషన్‌, IP69,IP68 అండర్ వాటర్ ప్రొటెక్షన్‌ కూడా ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారంగా MotoUIపై రన్ అవుతుంది. ఏఐ మ్యాజిక్ ఎరేజర్, ఎడిటర్, సర్కిల్ టు సెర్చ్ వంటి మోటోఏఐ ఫీచర్లను అందిస్తుంది.