Motorola Edge 60 Pro
Motorola Edge 60 Pro Launch : కొత్త మోటోరోలా ఫోన్ వచ్చేసింది. భారత మార్కెట్లోకి ఎట్టకేలకు మోటోరోలా రూ. 30వేల లోపు ధరలో ఎడ్జ్ 60 ప్రో లాంచ్ చేసింది. ఈ మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో గత మోడల్ ఎడ్జ్ 50 ప్రో కన్నా డిస్‌ప్లే, పర్ఫార్మెన్స్, కెమెరా, ఇతర ఫీచర్లతో ఆకర్షణీయంగా ఉంది.
ఈ 5జీ ఫోన్ మిలిటరీ-గ్రేడ్ సర్టిఫికేషన్‌తో పాటు డస్ట్, వాటర్ నిరోధతకు IP68, IP69 రేటింగ్‌లతో వస్తుంది. క్వాడ్-కర్వ్డ్ pOLED ప్యానెల్, పెద్ద 6,000mAh బ్యాటరీ, 50MP ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ధర, ఆఫర్ల గురించి పూర్తి వివరాలను ఓసారి పరిశీలిద్దాం..
మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో స్పెసిఫికేషన్లు :
మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో 6.7-అంగుళాల (2712 x 1220) క్వాడ్-కర్వ్డ్ pOLED డిస్‌ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఈ మోటోరోలా HDR+ సపోర్ట్, పాంటోన్, స్కిన్‌టోన్ వాలిడేషన్, SGS ఐ కంఫర్ట్ సర్టిఫికేషన్స్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌ను కూడా అందిస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమన్షిటీ 8350 ఎక్స్‌ట్రీమ్ చిప్‌సెట్‌తో వస్తుంది. 8GB, 12GB LPDDR5X ర్యామ్‌తో వస్తుంది.
256GB UFS 4.0 ఇంటర్నల్ స్టోరేజ్‌ను అందిస్తుంది. 6,000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 15W వైర్‌లెస్, 5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 అవుట్ ఆఫ్ ది బాక్స్‌లో రన్ అవుతుంది. 3 మెయిన్ OS అప్‌డేట్స్, 4 ఏళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లను అందిస్తుంది.
కెమెరా సెక్షన్‌లో మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో ట్రిపుల్ రియర్ సెటప్‌ను కలిగి ఉంది. OIS, ఆల్-పిక్సెల్ PDAFతో 50MP సోనీ LYTIA 700C ప్రైమరీ సెన్సార్, 50MP అల్ట్రావైడ్ + మాక్రో సెన్సార్, 3x ఆప్టికల్ జూమ్, 50x వరకు సూపర్ జూమ్‌ను అందించే 10MP టెలిఫోటో లెన్స్ కలిగి ఉన్నాయి.
వినియోగదారులు బెస్ట్ ఫేస్, అడాప్టివ్ స్టెబిలైజేషన్, నైట్ విజన్, యాక్షన్ షాట్, ఫొటో ఎన్‌హాన్స్‌మెంట్ ఇంజిన్ వంటి ఏఐ ఫీచర్‌లను యాక్సెస్ చేయవచ్చు. మోటోరోలా ఫోన్ ఫ్రంట్ సైడ్ 4K వీడియో రికార్డింగ్‌తో 50MP సెల్ఫీ షూటర్‌తో వస్తుంది. ఈ ఫోన్ డాల్బీ అట్మాస్ సపోర్టుతో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, క్లియర్ వాయిస్ పికప్ కోసం 2 మైక్‌లను కూడా అందిస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, Wi-Fi 6E, బ్లూటూత్ 5.4, NFC, డ్యూయల్ సిమ్ సపోర్ట్ ఉన్నాయి.
Read Also : Vivo X200 Pro : డిస్కౌంట్ అదరహో.. అమెజాన్‌లో వివో X200 ప్రోపై భారీ డిస్కౌంట్.. ఇంకా తక్కువ ధరకే కావాలంటే?
భారత్‌లో మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో ధర, ఆఫర్లు :
మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో (8GB + 256GB) వేరియంట్ ధర రూ.29,99 నుంచి ప్రారంభమవుతుంది. అయితే, 12GB + 256GB ధర రూ.33,999కు పొందవచ్చు. కస్టమర్లు రూ. వెయ్యి ఇన్‌స్టంట్ డిస్కౌంట్, రూ.వెయ్యి ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా పొందవచ్చు. ఈ మోటోరోలా ఫోన్ పాంటోన్ డాజ్లింగ్ బ్లూ, పాంటోన్ షాడో, పాంటోన్ స్పార్కింగ్ గ్రేప్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.