Vivo X200 Pro : డిస్కౌంట్ అదరహో.. అమెజాన్‌లో వివో X200 ప్రోపై భారీ డిస్కౌంట్.. ఇంకా తక్కువ ధరకే కావాలంటే?
Vivo X200 Pro : అమెజాన్‌లో వివో X200 ప్రోపై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఏకంగా రూ. 14వేలు తగ్గింపు అందిస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?

Vivo X200 Pro
Vivo X200 Pro : వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. అమెజాన్ వివో X200 ప్రోపై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. మీరు వివో X200 ప్రో 5G కోసం చూస్తుంటే ఇదే బెస్ట్ టైమ్. అమెజాన్ ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఏకంగా రూ. 14వేలు డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ రూ. 90వేల లోపు అందుబాటులో ఉంటుంది. అదనపు బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి.
ఈ వివో ఫోన్ 200MP టెలిఫోటో (OIS) కెమెరాను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15-ఆధారిత ఫన్‌టచ్ OS 15 అవుట్ ఆఫ్ ది బాక్స్‌లో రన్ అవుతుంది. వివో X200 ప్రో డిసెంబర్ 2024లో వివో X200తో పాటు లాంచ్ అయింది. ఈ హ్యాండ్‌సెట్ వివో X100 సిరీస్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్. వివో X200 ప్రో వెర్షన్ ధర, ఫీచర్ల వివరాల గురించి ఓసారి లుక్కేయండి.
అమెజాన్‌లో వివో X200 ప్రో 5G ధర :
వివో X200 ప్రో 5G ఫోన్ 16GB ర్యామ్, 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,01,999కు ప్రారంభమైంది. అయితే, అమెజాన్ స్మార్ట్‌ఫోన్‌పై రూ.7వేలు ఫ్లాట్ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఈ వివో ఫోన్ ధర రూ.94,999కు తగ్గింది.
అదనంగా, ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులపై రూ.7వేలు ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు. తద్వారా ఈ వివో ఫోన్ ధరను రూ.87,999కు తగ్గించింది. కొనుగోలుదారులు పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసుకుంటే.. రూ.68,850 వరకు ఎక్స్ఛేంజ్, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా పొందవచ్చు.
వివో X200 ప్రో 5G స్పెసిఫికేషన్లు :
6.78-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను కలిగిన ఈ ఫోన్ 120Hz వరకు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. పర్ఫార్మెన్స్ కోసం వివో X200 ప్రో 5Gలో మీడియాటెక్ డైమన్షిటీ 9400 చిప్‌సెట్, 16GB ర్యామ్, 512GB స్టోరేజ్ ఉన్నాయి.
ఈ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 3.7x ఆప్టికల్ జూమ్ HP9 సెన్సార్‌తో 200mp టెలిఫోటో (OIS) కెమెరా, 50mp (OIS) సోనీ LYT-818 సెన్సార్, 50mp వైడ్-యాంగిల్ సెన్సార్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ 32MP కెమెరాను కలిగి ఉంది. ఇంకా, ఈ వివో ఫోన్ 6000mAh బ్యాటరీని అందిస్తుంది. 90W వైర్డ్ ఫ్లాష్ ఛార్జ్, 30W వైర్‌లెస్ ఫ్లాష్ ఛార్జ్‌కు సపోర్టు ఇస్తుంది.