Apple Foldable iPhone : ఆపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఫస్ట్ ఫోల్డబుల్ ఐఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే భారీ అంచనాలు..!
Apple Foldable iPhone : ఆపిల్ నుంచి సరికొత్త ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ కానుంది. 2027లో ఐఫోన్ యూజర్ల కోసం అందుబాటులోకి రానుంది. ఐఫోన్ మడతబెట్టే ఫోన్ లాంచ్ కాకముందే భారీ అంచనాలు నెలకొన్నాయి.

Apple Foldable iPhone
Apple Foldable iPhone : ఆపిల్ 2027లో ఐఫోన్ 20వ వార్షికోత్సవం జరుగనుంది. ఈ నేపథ్యంలో ఆపిల్ దిగ్గజం భారీ ప్లాన్ చేస్తోంది. బ్లూమ్‌బెర్గ్ మార్క్ గుర్మాన్ ప్రకారం.. ఆపిల్ మొట్టమొదటి ఫోల్డబుల్ ఐఫోన్ ఫ్యూచరిస్టిక్ గ్లాస్-హెవీ డిజైన్‌ను కలిగి ఉండనుంది. రాబోయే ఫోల్డబుల్ ఐఫోన్ గురించి అనేక ఊహానాలు వినిపిస్తున్నాయి.
ఈ స్పెషల్ ఎడిషన్ లైనప్ కూడా చాలా ఏళ్లుగా చూసిన మెయిన్ ఐఫోన్ రీడిజైన్ మాదిరిగా ఉండే అవకాశం ఉంది. కానీ, ఈ ఫోల్డబుల్ ఐఫోన్ భారత మార్కెట్లో తయారయ్యే అవకాశం లేదు. ఆపిల్ తయారీ స్థావరాన్ని చైనా వెలుపల విస్తరించే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నప్పటికీ, 2027 ఐఫోన్ మోడల్స్ చైనా తప్ప మరెక్కడా తయారు చేయలేనంతగా ఉంటాయని భావిస్తున్నారు.
Read Also : AC Tips : మీ ఇంట్లో AC నుంచి వాటర్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ 3 టిప్స్‌తో మీరే ఫిక్స్ చేయొచ్చు..!
భారత్‌లో తయారీ ఎందుకు లేదంటే? :
ఆపిల్ వార్షికోత్సవ మోడళ్లకు పూర్తిగా కొత్త పార్ట్స్, ప్రొడక్టు మెథడ్స్ అవసరం. ప్రస్తుత ఐఫోన్ మోడల్‌లను ఇప్పటికే భారత మార్కెట్లో అసెంబుల్ చేస్తున్నప్పుడు, చైనా యూనిట్ల క్వాలిటీతో సరిపోయే క్వాలిటీతో ఉన్నాయి. రాబోయే ఫోల్డబుల్, గ్లాస్-ఫోకస్డ్ ఫోన్లు అసాధారణంగా ఉన్నాయి. ప్రారంభ తయారీకి చైనాను మాత్రమే అసలైన ఎంపికగా నివేదిక సూచిస్తోంది.
Apple won’t be able to make every US iPhone in India by 2027. I don’t see a scenario where 20 year anniversary iPhones – foldable & glass centric model – are made in India. Apple has never produced a major new design outside China for the first go-around. https://t.co/M40D8OtmAF
— Mark Gurman (@markgurman) April 27, 2025
ఫోల్డబుల్ ఐఫోన్ ధర (అంచనా) :
ఫోల్డబుల్ ఐఫోన్ ధర కూడా ఎక్కువగానే ఉంటుందని భావిస్తున్నారు. డిజిటల్ రిపోర్టు ప్రకారం.. ఆపిల్ మొట్టమొదటి ఫోల్డబుల్ ఐఫోన్ ధర 2,100 డాలర్ల నుంచి 2,300 డాలర్ల మధ్య ఉండవచ్చు. శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 కన్నా కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ ఫోల్డబుల్ ఐఫోన్, గ్లాస్-సెంట్రిక్ ప్రో మోడల్, ప్రత్యేకమైన డిజైన్‌తో వస్తుంది. ఆపిల్ 2027 లైనప్ ఐఫోన్‌కు కొత్త మోడల్ సూచిస్తుంది.