AC Tips : మీ ఇంట్లో AC నుంచి వాటర్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ 3 టిప్స్‌తో మీరే ఫిక్స్ చేయొచ్చు..!
AC Tips : స్ప్లిట్ ఎయిర్ కండిషనర్ల నుండి వాటర్ లీకేజ్ కావడం సాధారణ సమస్యే. ఈ వాటర్ లీకేజీ సమస్యను చాలా ఈజీగా ఫిక్స్ చేయొచ్చు. ఏసీ టెక్నీషియన్ పిలవాల్సిన అవసరం ఉండదు.

split air conditioners
AC Tips : మీ ఇంట్లో స్ప్లిట్ ఎయిర్ కండిషనర్ వాటర్ లీక్ అవుతుందా? చాలా ఈజీగా ఫిక్స్ చేయొచ్చు. ఎయిర్ కండిషనర్ నుంచి నీరు లీక్ కావడం సర్వసాధారణం, ముఖ్యంగా వాతావరణం తేమగా ఉన్నప్పుడు ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. కానీ, తేమతో కూడిన వాతావరణం వల్ల మాత్రమే కాదు.
ఇన్‌స్టాలేషన్ లోపాల వల్ల కూడా స్ప్లిట్ ఎయిర్ కండిషనర్ నుంచి వాటర్ కొన్నిసార్లు లీక్ అవుతుంది. స్ప్లిట్ ఎయిర్ కండిషనర్ వాటర్ ఎందుకు లీక్ అవుతుంది? టెక్నీషియన్ లేకుండా ఇంట్లోనే మనం ఎలా ఫిక్స్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Read Also : Whatsapp iPhones : బిగ్ అలర్ట్.. ఈ ఆపిల్ ఐఫోన్లలో ఇకపై వాట్సాప్ పనిచేయదు.. మీ ఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి..!
ఏసీలో సమస్యకు ఇదే కారణం :
ఏసీని సమయానికి సర్వీస్ చేయకపోవడమే ప్రధాన కారణం. సర్వీస్ సమయానికి పూర్తయితే.. ఎయిర్ కండిషనర్‌లో ఇన్‌స్టాల్ చేసిన ఫిల్టర్, డ్రైనేజ్ లైన్ క్లీన్ అవుతాయి. డ్రైనేజ్ పైపు ద్వారా వాటర్ ఎయిర్ కండిషనర్ నుంచి బయటకు వెళ్తుంది.
కానీ, ఏసీ ఫిల్టర్‌ను క్లీన్ చేయకపోతే, మురికి స్ప్లిట్ ఎయిర్ కండిషనర్ ఇండోర్ యూనిట్‌లోకి వెళ్లి డ్రైనేజ్ పైపు మూసుకుపోతుంది. ఫలితంగా, ఎయిర్ కండిషనర్ నుంచి ఇంట్లోకి వాటర్ లీక్ అవుతుంటుంది.
ఎయిర్ కండిషనర్ అమర్చినప్పుడు ఇంటీరియర్ యూనిట్ లెవెల్ తప్పుగా ఉంటే.. బయటకు వచ్చే నీరు డ్రైనేజీ పైపులోకి చేరదు. ఇంట్లో లీక్ అవుతుంటుంది. వేసవిలో బయట తేమ లేనప్పుడు ఈ సమస్య తక్కువగా ఉంటుంది. కానీ, వర్షాకాలంలో వాటర్ లీకేజ్ ఎక్కువ అవుతుంది. డ్రైనేజీ పైపు వంగడం వల్ల కొన్నిసార్లు ఈ సమస్య రావచ్చు. తగినంత రిఫ్రిజెరాంట్ లేకపోయినా, ఏసీ నుంచి నీరు భారీ మొత్తంలో లీక్ అవుతుంది.
ఏసీ క్లీనింగ్ కోసం ఈ 3 టిప్స్ ట్రై చేయండి :
ప్రతి 90 రోజులకు లేదా ప్రతి 3 నెలలకు ఒకసారి స్ప్లిట్ ఎయిర్ కండిషనర్ ఫిల్టర్‌ను క్లీన్ చేయాలి. మీ అవుట్‌డోర్ యూనిట్ దుమ్ము ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఉంటే నెలకు ఒకసారి ఫిల్టర్‌ను క్లీన్ చేయాలి. క్లీన్ చేయడం వల్ల దుమ్ము, ధూళి ఫిల్టర్‌లో ఉండవు.
డ్రైనేజీ పైప్‌లైన్‌లో ధూళి పేరుకుపోవడం సమస్య ఉండదు. ఏసీ ఫిల్టర్ దెబ్బతిన్నట్లయితే వెంటనే మార్చండి. ఎందుకంటే.. మిషన్‌తో అనేక ఇతర సమస్యలకు దారితీయవచ్చు. ఏసీ డ్రెయిన్ లైన్‌లోకి నీటిని పంపి క్లీన్ చేయండి. లోపల ఉన్న ఏదైనా డస్ట్ బయటకు పంపుతుంది.
అలాగే, నీరు బయటకు వెళ్లేందుకు మార్గం ఉండేలా చూడండి. ఇంటీరియర్ యూనిట్ సరైన లెవల్ లేకపోతే ఎయిర్ కండిషనర్‌ను నిపుణుడిని పిలవండి. ప్రతి 2 నుంచి 3 నెలలకు ఒకసారి ఏసీ డ్రెయిన్ లైన్‌ను క్లీన్ ఉంచుకోవాలి. చెత్త పేరుకుపోకుండా ఉండేందుకు యాసిడ్ వేయండి.