Motorola Edge 70 Fusion : వారెవ్వా.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్.. ఈ మోటోరోలా ఫోన్ చాలా చీప్ గురూ.. ఇదే బెస్ట్ టైమ్..!

Motorola Edge 70 Fusion : ఈ మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ డిస్కౌంట్ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఇది లిమిటెడ్ టైమ్ ఆఫర్ మాత్రమే.. రూ.30,999 నుంచి ఈ మోటోరోలా కొనేసుకోవచ్చు. బ్యాంక్ క్యాష్‌బ్యాక్‌తో రూ.4,500 వరకు ఆదా చేసుకోవచ్చు.

  • Published on- September 11, 2026 / 07:44 PM IST

Motorola Edge 70 Fusion

  • మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్‌పై రూ.4,500 వరకు ఆదా
  • 7000mAh బ్యాటరీతో 144Hz క్వాడ్ కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లే
  • ఫ్లిప్‌కార్ట్‌లో ధర రూ.30,999, రూ.1,550 వరకు క్యాష్‌బ్యాక్

Motorola Edge 70 Fusion : మోటోరోలా అభిమానులకు అద్భుతమైన అవకాశం.. మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ ధర భారీగా తగ్గింది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.33,999గా ఉండగా ఇప్పుడు రూ.3వేలు తగ్గింది. ఇది లిమిటెడ్ ఆఫర్, డిస్కౌంట్ లభిస్తోంది.

అదనంగా బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. తద్వారా ధర మరింత తగ్గుతుంది. ఈ ఫోన్‌లో క్వాడ్-కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లే ఫాస్ట్ (Motorola Edge 70 Fusion) ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఎడ్జ్ 70 ఫ్యూజన్‌లో 6.7-అంగుళాల FHD+ అమోల్డ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ సిరీస్ ప్రాసెసర్, 50MP ప్రైమరీ రియర్ కెమెరా ఉన్నాయి. ఆండ్రాయిడ్ 16 ఆధారిత హలో యూఐతో వస్తుంది. పూర్తి ఫీచర్లు, ధర వివరాలివే..

మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ బేస్ 6GB + 128GB వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.30,999 ధరకు లభిస్తోంది. ఈ ఫోన్ ప్రారంభ ధర ఇటీవల రూ.33,999 ధర ఉండేది. వినియోగదారులు ఈ ఫోన్‌ను పాత ధరకే కొనేసుకోవచ్చు.

బ్యాంకు ఆఫర్లతో మరింత తగ్గింపు :

అదనంగా, ఫ్లిప్‌కార్ట్ కో-బ్రాండెడ్ యాక్సిస్ లేదా ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌లతో చేసే కొనుగోళ్లపై రూ.1,550 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. దాంతో అసలు ధర రూ.29,449కి తగ్గుతుంది. నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా ఉన్నాయి. ఈ ఆఫర్లు అన్ని ర్యామ్ స్టోరేజ్ వేరియంట్లపై లభిస్తాయి.

Read Also : e-commerce Rules : ఈ-కామర్స్‌కు కేంద్రం బిగ్ షాక్.. ఆన్‌లైన్ షాపింగ్‌లో ఇక మాయలు కుదరవు.. కొత్త రూల్స్ ఇవే!

144Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇచ్చే 6.78-అంగుళాల 1.5K క్వాడ్ కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లే ఉంది. ఈ స్క్రీన్ SGS ఐ ప్రొటెక్షన్, స్మార్ట్ వాటర్ టచ్ 3.0, HDR 10+లకు సపోర్టు ఇస్తుంది. ఈ ప్యానెల్ టాప్ బ్రైట్ నెస్ 5200 నిట్స్ వరకు చేరుకోగలదు. MIL-810H మిలిటరీ-గ్రేడ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ అందిస్తుంది.

ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. వేపర్ కూలింగ్ ఛాంబర్ కూడా ఉంది. ఈ ఫోన్ BGMIని 120fps వద్ద రన్ చేయగలదు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత హలో యూఐపై పనిచేస్తుంది. కంపెనీ 3 ఏళ్ల OS అప్‌గ్రేడ్‌లు, 5 ఏళ్ల సెక్యూరిటీ అప్‌గ్రేడ్‌లను అందించనుంది. మోటో ఏఐతో పాటు ఈ ఫోన్‌లో కోపైలట్, పెర్‌ప్లెక్సిటీ జెమిని కూడా ఇంటిగ్రేట్ అయ్యాయి.

కెమెరా విషయానికి వస్తే.. :
మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్‌లో OIS సపోర్ట్‌తో 50MP సోనీ-LYT 710 ప్రైమరీ సెన్సార్ ఉంది. 13MP అల్ట్రావైడ్-యాంగిల్ లెన్స్, మాక్రో లెన్స్, డెప్త్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీలు వీడియో కాలింగ్ కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఉంది. అన్ని సెన్సార్లు 4K రికార్డింగ్ సపోర్టు చేస్తాయి.

ఎడ్జ్ 70 ఫ్యూజన్‌లో సిలికాన్-కార్బన్ టెక్నాలజీతో 7000mAh బ్యాటరీ ఉంది. ఈ ఫోన్ 68W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. బాక్స్‌లో ఒక ఛార్జర్ కూడా ఉంటుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, Wi-Fi, బ్లూటూత్ 6.0, GPS, NFC USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, స్టీరియో స్పీకర్లు కూడా ఉన్నాయి. ఈ ఫోన్ 7.99 మిమీ మందంతో పాటు 193 గ్రాముల బరువు ఉంటుంది.