×
Ad

Motorola G67 Power : మతిపొగొట్టే ఫీచర్లతో మోటోరోలా G67 పవర్ వచ్చేస్తోందోచ్.. ఏఐ కెమెరా ఫీచర్లు హైలెట్.. ధర ఎంత ఉండొచ్చంటే?

Motorola G67 Power : మోటోరోలా నుంచి సరికొత్త మోటోరోలా జీ67 పవర్ ఫోన్ రాబోతుంది. ఏఐ కెమెరా ఫీచర్లతో మరింత ఆకట్టుకునేలా ఉంది. ధరపై భారీ అంచనాలివే..

Motorola G67 Power

Motorola G67 Power : కొత్త మోటోరోలా ఫోన్ వచ్చేస్తోంది. మోటోరోలా కంపెనీ భారత మార్కెట్లో మోటో G-సిరీస్ లైనప్‌ను విస్తరించనుంది. నవంబర్ 6న మోటో G67 పవర్ 5G లాంచ్‌ చేయనుంది. ఫ్లిప్‌కార్ట్ మైక్రోసైట్, కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ మోటో పవర్ ఫోన్ వివరాలు రివీల్ అయ్యాయి. మోటోరోలా జీ67 ఫోన్ డిజైన్, హార్డ్‌వేర్ కలర్ వేరియంట్‌లతో సహా డివైజ్ కీలక వివరాలు వెల్లడయ్యాయి.

మోటో G67 పవర్ 5G భారీ 7,000mAh బ్యాటరీ, ఆండ్రాయిడ్ 15, ఏఐ (Motorola G67 Power) అసిస్టెంట్ కెమెరా ఫీచర్లు, పాంటోన్-క్యూరేటెడ్ ఫినిషింగ్‌లతో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 2 చిప్‌సెట్‌ కలిగి ఉంది. రాబోయే ఈ మోటోరోలా ఫోన్ ధరను కూడా కంపెనీ ప్రకటించింది. ఇంతకీ ఏయే ఫీచర్లు, ధర వివరాలు ఎలా ఉన్నాయో ఓసారి లుక్కేయండి..

మోటో G67 పవర్ 5G కలర్ ఆప్షన్లు :
మోటో G67 పవర్ 5G ఫోన్ మొత్తం పారాచూట్ పర్పుల్, బ్లూ కురాకో, సిలియెంటిరో అనే 3 ప్యాంటోన్-సర్టిఫైడ్ షేడ్స్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ ఫ్లిప్‌కార్ట్, మోటోరోలా అధికారిక ఆన్‌లైన్ స్టోర్‌లో అందుబాటులో ఉంటుంది. డిజిటల్ ఛానెల్‌లలో కూడా అందుబాటులో ఉండొచ్చు.

Read Also : Oppo Reno 15 Series : ఒప్పో రెనో 15 సిరీస్ వచ్చేస్తోంది.. లాంచ్ ఎప్పుడో తెలిసిందోచ్.. కీలక ఫీచర్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చంటే?

మోటో G67 పవర్ 5G ధర ఎంతంటే? :
మోటో G67 పవర్ 5G ఫోన్ రెండు కాన్ఫిగరేషన్లలో వస్తుంది. అందులో 128GB స్టోరేజ్‌తో 8GB ర్యామ్, 256GB స్టోరేజ్‌తో 8GB ర్యామ్ ఉంటుంది. ఈ మోటో జీ67 ప్రారంభ ధర రూ. 14,999 నుంచి అందుబాటులో ఉంటుంది.

మోటో G67 పవర్ 5G స్పెసిఫికేషన్లు :

ఈ మోటో ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సర్టిఫికేషన్‌తో 6.7-అంగుళాల ఫుల్-HD+ ఎల్‌సీడీ ప్యానెల్‌ కలిగి ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్, డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ కోసం IP64 రేటింగ్‌తో మోటో G67 పవర్ 5G ఆప్షన్లు కలిగి ఉంది.

మోటోరోలా 85.97శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో అందిస్తుంది. అద్భుతమైన వ్యూ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. డాల్బీ అట్మోస్ సపోర్టుతో డ్యూయల్ స్టీరియో స్పీకర్ల ద్వారా అప్‌గ్రేడ్ అవుతుంది. హుడ్ కింద, ఈ మోటో ఫోన్ 4nm ప్రాసెస్‌పై స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 2 SoC ద్వారా పవర్ పొందుతుంది.

అడ్రినో జీపీయూ, 24GB ర్యామ్ వరకు ఎక్స్‌టెండ్ చేసుకోవచ్చు. దీనికి సపోర్టుగా 30W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. అలాగే భారీ 7,000mAh బ్యాటరీ కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 15తో వస్తుంది. ఒక మెయిన్ OS అప్‌డేట్, 3 ఏళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లను అందిస్తుంది.

ఆప్టిక్స్ విషయానికొస్తే.. మోటో G67 పవర్ 5Gలో 50MP సోనీ LYT-600 ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రావైడ్ లెన్స్, టూ-ఇన్-వన్ ఫ్లికర్ సెన్సార్ ఉన్నాయి. 32MP ఫ్రంట్ కెమెరా హోల్-పంచ్ కటౌట్‌ కలిగి ఉంది.