Motorola G96 5G : మతిపొగొట్టే ఫీచర్లతో మోటోరోలా 5G ఫోన్ వచ్చేస్తోందోచ్.. డ్యూయల్ కెమెరా సెటప్, ధర ఎంత ఉండొచ్చంటే?

Motorola G96 5G : కొత్త మోటోరోలా 5G ఫోన్ వచ్చేస్తోంది. ఈ నెల 9న భారత మార్కెట్లో లాంచ్ చేసేందుకు కంపెనీ రెడీ అవుతోంది..

Motorola G96 5G : మతిపొగొట్టే ఫీచర్లతో మోటోరోలా 5G ఫోన్ వచ్చేస్తోందోచ్.. డ్యూయల్ కెమెరా సెటప్, ధర ఎంత ఉండొచ్చంటే?

Motorola G96 5G

Updated On : July 1, 2025 / 6:48 PM IST

Motorola G96 5G : మోటోరోలా అభిమానులకు గుడ్ న్యూస్.. అతి త్వరలో భారత మార్కెట్లోకి మోటోరోలా నుంచి సరికొత్త మోటోరోలా G96 5G ఫోన్ రాబోతుంది. ఈ మేరకు కంపెనీ ఎక్స్ వేదికగా టీజర్‌ షేర్ చేసింది. ఈ మోటోరోలా పాంటోన్ కలర్ ఆప్షన్లు, అద్భుతమైన పర్ఫార్మెన్స్, కెమెరా సెటప్‌తో వచ్చే అవకాశం ఉంది.

ఈ ఫోన్ వాటర్ టచ్ సపోర్ట్, IP68 సర్టిఫికేషన్‌తో కర్వ్డ్ డిస్‌ప్లేతో కూడా వస్తుంది. డ్యూయల్ కెమెరా సెటప్‌ను కూడా కలిగి ఉండవచ్చు. మోటోరోలా G96 5G ధర, స్పెసిఫికేషన్లు, భారత్ లాంచ్ తేదీ, ఇతర వివరాలపై ఓసారి లుక్కేయండి..

భారత్‌లో మోటోరోలా G96 5G లాంచ్ తేదీ :
మోటోరోలా G96 5G ఫోన్ జూలై 9న మధ్యాహ్నం 12 గంటలకు భారత మార్కెట్లో లాంచ్ అవుతుందని కంపెనీ ధృవీకరించింది. ఈ మోటోరోలా ఫోన్ ఆష్లీ బ్లూ, డ్రెస్డెన్ బ్లూ, కాట్లేయా ఆర్చిడ్, గ్రీనర్ పాశ్చర్స్ కలర్ ఆప్షన్లలో లాంచ్ అవుతుందని బ్రాండ్ ధృవీకరించింది. మైక్రోపేజ్ ఫ్లిప్‌కార్ట్‌లో కూడా ఫోన్ వివరాలు లైవ్‌లో ఉన్నాయి.

Read Also : Vivo V40 Pro 5G : బంపర్ ఆఫర్ భయ్యా.. భారీగా తగ్గిన వివో 5G ఫోన్.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?

మోటోరోలా G96 5G స్పెసిఫికేషన్లు :
మోటోరోలా G96 5G ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల 10-బిట్ 3D కర్వ్డ్ pOLED ప్యానెల్‌తో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. 1,600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉండొచ్చు. వాటర్ టచ్ టెక్నాలజీ, SGS ఐ ప్రొటెక్షన్ ఫీచర్‌లను కూడా అందించవచ్చు. ఈ మోటోరోలా ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 2 SoC ద్వారా పవర్ పొందవచ్చు.

12GB ర్యామ్, 256GB స్టోరేజ్‌తో రావచ్చు. 5,500mAh బ్యాటరీని కూడా కలిగి ఉండవచ్చు. ఆండ్రాయిడ్ 15 ఆధారిత హలో యూఐపై రన్ అవుతుంది. కెమెరా విషయానికొస్తే.. ఈ మోటోరోలా ఫోన్ 50MP సోనీ లిటియా 700C OIS ప్రైమరీ సెన్సార్‌ ఉండవచ్చు. 8MP మాక్రో విజన్ కెమెరా కూడా ఉండవచ్చు. ఈ ఫోన్ 32MP సెల్ఫీ కెమెరాను కూడా కలిగి ఉండొచ్చు.

మోటోరోలా G96 5G ధర (అంచనా) :
మోటోరోలా G96 5G ఫోన్ 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ ధర దాదాపు రూ.22,990కి లాంచ్ కానుంది. కచ్చితమైన ధర ఎంత అనేది ఇంకా రివీల్ చేయలేదు.