Motorola Razr 60: మోటోరోలా Razr 60 స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది.. ఫీచర్లు అదరహో..

Razr 60లో 50MP ప్రైమరీ షూటర్, 13MP అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. ఫ్రంట్‌ సైడ్‌ 32MP సెల్ఫీ కెమెరా ఉంది.

మోటోరోలా Razr 60 స్మార్ట్‌ఫోన్ ఇవాళ భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో MotoAI ఫీచర్‌లతో పాటు డ్యూయల్ కెమెరా సెటప్‌, టైటానియం హింజ్‌ ఉన్నాయి. ఈ ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ Motorola స్టోర్, Flipkartలో అందుబాటులో ఉండనుంది.

లైటెస్ట్ స్కై, స్ప్రింగ్ బడ్, జిబ్రాల్టర్ సీ కలర్లతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేశారు. మోటరోలా Razr 60 అల్ట్రాను ఇప్పటికే విడుదల చేసిన విషయం తెలిసిందే.

Motorola Razr 60 స్పెసిఫికేషన్‌లు
మోటోరోలా Razr 60 120Hz రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్‌తో 6.96-అంగుళాల pOLED ప్యానెల్‌తో లాంచ్ అయింది. ఇది గరిష్ఠంగా 3,000 నిట్‌ల పీక్ బ్రైట్‌నెస్‌ ఇస్తుంది.

Motorola Razr 60 మీడియాటెక్ Dimensity 7400X చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. 8GB వరకు LPDDR4X RAM, 25GB వరకు UFS 2.2 స్టోరేజ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 4,500mAh బ్యాటరీ సామర్థ్యంతో 30W ఛార్జింగ్‌కు సపోర్టుతో వచ్చింది. Razr 60లో 50MP ప్రైమరీ షూటర్, 13MP అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. ఫ్రంట్‌ సైడ్‌ 32MP సెల్ఫీ కెమెరా ఉంది.

Motorola Razr 60 ధర
Motorola Razr 60 సింగిల్ 8GB వేరియంట్, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 49,999గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇది జూన్ 4, మధ్యాహ్నం 12 గంటల నుంచి అమ్మకానికి అందుబాటులో ఉంటుంది.

ఫీచర్లు సంక్షిప్తంగా..
డిస్‌ప్లే: 6.9-అంగుళాల FHD+ pOLED LTPO ప్రధాన డిస్‌ప్లే (120Hz రిఫ్రెష్ రేట్), 3.6-అంగుళాల కవర్ డిస్‌ప్లే

ప్రాసెసర్: MediaTek Dimensity 7400X

రామ్, స్టోరేజ్: 8GB LPDDR4X RAM, 256GB UFS 2.2 స్టోరేజ్

కెమెరా: 50MP ప్రధాన కెమెరా (OIS), 13MP అల్ట్రావైడ్ కెమెరా, 32MP సెల్ఫీ కెమెరా

బ్యాటరీ: 4500mAh బ్యాటరీ, 30W ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్లెస్ ఛార్జింగ్

ఆపరేటింగ్ సిస్టమ్: Android 15, 3 సంవత్సరాల OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్

ఇతర ఫీచర్లు: IP48 వాటర్ రెసిస్టెన్స్, Dolby Atmos ఆడియో