Motorola Razr 60 Series : ఖతర్నాక్ ఫీచర్లతో మోటోరోలా మడతబెట్టే ఫోన్లు వచ్చేస్తున్నాయి.. ధర ఎంతో తెలిసిందోచ్.. కీలక ఫీచర్లు లీక్..!

Motorola Razr 60 Series : మోటోరోలా రెజర్ 60 సిరీస్ వచ్చేస్తోంది. లాంచ్‌కు ముందే ఈ ఫోల్డబుల్ ఫోన్ల ధర, ర్యామ్, స్టోరేజీ, కలర్ ఆప్షన్లు లీక్ అయ్యాయి. పూర్తి వివరాలను ఓసారి లుక్కేయండి.

Motorola Razr 60 Series

Motorola Razr 60 Series : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రముఖ మెటోరోలా కంపెనీ నుంచి సరికొత్త ఫోల్డబుల్ ఫోన్లు రాబోతున్నాయి. మోటోరోలా నుంచి రెజర్ 60 అల్ట్రా , ఎడ్జ్ 60, ఎడ్జ్ 60 ప్రో  మడతబెట్టే స్మార్ట్‌ఫోన్‌లు త్వరలో కొనుగోలుకు అందుబాటులోకి రానున్నాయి.

Read Also : Top 5 Camera Phones : కొంటే ఇలాంటి కెమెరా ఫోన్లు కొనాలి.. టాప్ 5 కెమెరా స్మార్ట్‌ఫోన్లు ఇవే.. సినిమాటిక్ ఫీచర్లు మాత్రం కేక..!

మీడియా నివేదికల ప్రకారం.. ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లు ఇటీవల ఆన్‌లైన్ స్టోర్‌లో ధర, ర్యామ్, స్టోరేజీ ఆప్షన్లు, కలర్ ఆప్షన్లు లీక్ అయ్యాయి. ఒకవేళ ఈ లిస్టు రియల్ అయితే.. మోటోరోలా ఎడ్జ్ 60, రెజర్ 60 అల్ట్రా ఫోన్ రెండు కలర్ ఆప్షన్లలో రావచ్చు.

512GB వరకు ఇంటర్నల్ స్టోరేజీ కలిగి ఉండవచ్చు. లిస్టింగ్ ప్రకారం.. మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో 3 కలర్ ఆప్షన్లలో రావచ్చు. మోటోరోలా రెజర్ 60 అల్ట్రా ఫోన్, ఎడ్జ్ 60, మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో ధరలను మరింత వివరంగా ఇప్పుడు పరిశీలిద్దాం.

మోటోరోలా రెజర్ 60 అల్ట్రా, ఎడ్జ్ 60, ఎడ్జ్ 60 ప్రో ధర :
మోటోరోలా రెజర్ 60 అల్ట్రా, రెజర్ ఎడ్జ్ 60, రెజర్ ఎడ్జ్ 60 ప్రో ధరలను యూరోపియన్ రిటైల్ వెబ్‌సైట్ (Epto) వెల్లడించింది. షేర్డ్ లిస్టింగ్ ప్రకారం.. 12జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్‌తో మోటోరోలా రెజర్ 60 అల్ట్రా ఫోన్ EUR 1,346.90 లేదా దాదాపు ధర రూ. 1,24,000కు ఉంటుంది.

ఈ ఫోన్ స్కారాబ్ గ్రీన్, మౌంటైన్ ట్రైల్ వుడ్‌లో అందుబాటులో ఉండవచ్చు. మోటోరోలా ఎడ్జ్ 60 8జీబీ ర్యామ్/256GB స్టోరేజ్ మోడల్ ధర EUR 399.90 లేదా దాదాపు రూ. 37వేలు ఉండొచ్చు. జిబ్రాల్టర్ సీ బ్లూ, షామ్రాక్ గ్రీన్ అనే రెండు కలర్ ఆప్షన్లు కలిగి ఉంటాయి. అదేవిధంగా, మోటోరోలా ఎడ్జ్ 50 భారత మార్కెట్లో ధర రూ. 27,999కు అందుబాటులో ఉంది.

మోటోరోలా రెజర్ 60 సిరీస్ కలర్ ఆప్షన్లు :
మోటోరోలా రెజర్ ఫోన్ల ధరల ప్రకారం.. 12GB ర్యామ్, 512GB స్టోరేజ్‌తో మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో ధర EUR 649.89 లేదా దాదాపు రూ. 60వేలు ఉంటుంది. ఈ ఫోన్ మొత్తం బ్లూ, గ్రీన్, పర్పల్ అనే 3 వేర్వేరు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. గత ఏడాదిలో భారత మార్కెట్లో మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో ధర రూ. 31,999కు లాంచ్ చేసింది.

Read Also : Oppo F29 5G : కొత్త 5G ఫోన్ కావాలా? అతి తక్కువ ధరకే ఒప్పో F29 5G కొనేసుకోండి.. ఇంకా తగ్గాలంటే?

కానీ, ఇప్పుడు మోటోరోలా రెజర్ 60 అల్ట్రా, ఎడ్జ్ 60 సిరీస్ లాంచ్ తేదీని మోటోరోలా ఇంకా వెల్లడించలేదు. 6.96-అంగుళాల OLED మెయిన్ స్క్రీన్, 4-అంగుళాల కవర్ స్క్రీన్, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఇంజిన్ రెజర్ 60 అల్ట్రా ఫోన్ ఇటీవల చైనాలోని (TENAA) వెబ్‌సైట్‌లో కనిపించింది. నెక్ట్స్ ఫోల్డబుల్ ఫోన్‌లో 68W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 4,500mAh బ్యాటరీ కూడా ఉంటుంది.