Top 5 Camera Phones : కొంటే ఇలాంటి కెమెరా ఫోన్లు కొనాలి.. టాప్ 5 కెమెరా స్మార్ట్‌ఫోన్లు ఇవే.. సినిమాటిక్ ఫీచర్లు మాత్రం కేక..!

Top 5 Camera Phones : కొత్త స్మార్ట్ ఫోన్ కొంటున్నారా? ప్రస్తుతం భారత మార్కెట్లో అద్భుతమైన కెమెరా ఫీచర్లతో అనేక బ్రాండ్ల స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. అందులో టాప్ 5 కెమెరా స్మార్ట్‌ఫోన్లు ఇలా ఉన్నాయి.

Top 5 Camera Phones :  కొంటే ఇలాంటి కెమెరా ఫోన్లు కొనాలి.. టాప్ 5 కెమెరా స్మార్ట్‌ఫోన్లు ఇవే.. సినిమాటిక్ ఫీచర్లు మాత్రం కేక..!

Top 5 Camera Phones

Updated On : March 27, 2025 / 5:54 PM IST

Top 5 Camera Phones : కొత్త స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా? మంచి కెమెరా క్వాలిటీ కలిగిన ఫోన్ల కోసం వెతుకుతున్నారా? ప్రస్తుతం భారత మార్కెట్లో ప్రో-లెవల్ వీడియో ఫీచర్లతో కూడిన అద్భుతమైన స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.

ఆపిల్ ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్, శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఫోన్ కంటెంట్ క్రియేటర్లకు బెస్ట్ ఫోన్లుగా చెప్పవచ్చు. AI-ఆధారిత ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. గూగుల్ పిక్సెల్ 8 ప్రో కన్నా ఏది బెటర్ కాదు. అలాగే, సినిమాటిక్ ఎఫెక్ట్‌లను కోరుకునే వారికి వివో X100 ప్రో బెస్ట్ అని చెప్పవచ్చు. బడ్జెట్ ఫోన్లు కోరుకునే కంటెంట్ క్రియేటర్లు వన్‌ప్లస్ 12 ఫోన్ ఎంచుకోవచ్చు.

Read Also : IPL Fans : జియో IPL ఆఫర్ అదుర్స్.. కేవలం రూ.100కే హైస్పీడ్ డేటా, 90 రోజులు మ్యాచ్‌‌లు ఫ్రీగా చూడొచ్చు!

ప్రస్తుత రోజుల్లో హై క్వాలిటీ కంటెంట్‌ను క్రియేట్ చేసేందుకు అద్భుతమైన కెమెరా సెటప్, అడ్వాన్స్‌డ్ వీడియో ఫీచర్లు, స్పీడ్ పర్ఫార్మెన్స్ అందించే స్మార్ట్‌ఫోన్ చాలా అవసరం. మీరు యూట్యూబర్, వ్లాగర్, ఇన్‌స్టాగ్రామ్ క్రియేటర్ లేదా మూవీ నిర్మాత అయినా, సరైన కెమెరా ఫోన్ తప్పక ఉండాలి.

అప్పుడే అద్భుతమైన ఫొటోలను తీయొచ్చు. ప్రస్తుతం భారత మార్కెట్లో కంటెంట్ క్రియేటర్లకు ఉపయోగపడే బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌ల జాబితాను మీకోసం అందిస్తున్నాం. ఇందులో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని కొనేసుకోండి.

1. ఆపిల్ ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ :
ప్రొఫెషనల్ క్రియేటర్లకు ఈ ఐఫోన్ మోడల్ బెస్ట్.
కెమెరా సెటప్ : 48MP (మెయిన్) + 12MP (అల్ట్రావైడ్) + 12MP (పెరిస్కోప్ టెలిఫోటో)
ముఖ్య ఫీచర్లు : ProRes వీడియో రికార్డింగ్, సినిమాటిక్ మోడ్, 5x ఆప్టికల్ జూమ్

ఈ ఐఫోన్ ఎందుకు ఎంచుకోవాలి? :
ఆపిల్ ఐఫోన్ 15 ప్రో మాక్స్ ఇప్పటివరకు ఆపిల్ అత్యుత్తమ కెమెరా ఫోన్. అద్భుతమైన వీడియో క్వాలిటీతో పాటు స్టేబుల్, HDR రికార్డింగ్‌ను అందిస్తోంది. Vlogs, మూవీ షూటింగ్‌‌లకు సరైనదిగా చెప్పవచ్చు.

2. శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా :
8K వీడియో, జూమ్ కెపాసిటీకి బెస్ట్ ఫోన్
కెమెరా సెటప్ : 200MP (మెయిన్) + 12MP (అల్ట్రావైడ్) + 10MP (3x టెలిఫోటో) + 50MP (5x పెరిస్కోప్ జూమ్)
ముఖ్య ఫీచర్లు : 8K వీడియో రికార్డింగ్, AI ఆధారిత ఫోటో అప్‌గ్రేడ్, సూపర్ స్టెడీ మోడ్

ఎందుకు ఎంచుకోవాలి? :
మీకు 8K రికార్డింగ్, అడ్వాన్స్‌డ్ జూమ్, ప్రో-లెవల్ ఫోటోగ్రఫీ టూల్స్ అవసరమైతే, S24 అల్ట్రా కంటెంట్ క్రియేటర్లకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

3. గూగుల్ పిక్సెల్ 8 ప్రో :
ఏఐ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీకి బెస్ట్ ఫోన్
కెమెరా సెటప్ : 50MP (మెయిన్) + 48MP (అల్ట్రావైడ్) + 48MP (టెలిఫోటో)
ముఖ్య ఫీచర్లు : మ్యాజిక్ ఎడిటర్, రియల్ టోన్, సూపర్ రిజల్యూషన్ జూమ్, బెస్ట్ టేక్

ఎందుకు ఇది బెస్ట్ అంటే? :
నేచరుల్‌గా కనిపించే ఫోటోలు, ఏఐ-ఆధారిత వీడియో ఎడిటింగ్, లో లైటింగ్‌లో కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ముఖ్యంగా కంటెంట్ క్రియేటర్లకు గూగుల్ పిక్సెల్ 8 Pro సరైనదిగా చెప్పవచ్చు.

4. వివో X100 ప్రో :
ఈ వివో X100ప్రో ఫోన్ సినిమాటిక్ కంటెంట్‌కు బెస్ట్ ఫోన్ అని చెప్పవచ్చు. ఈ ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే..
కెమెరా సెటప్ : 50MP (మెయిన్) + 50MP (అల్ట్రావైడ్) + 50MP (పెరిస్కోప్ జూమ్)
ముఖ్య ఫీచర్లు : ZEISS ఆప్టిక్స్, సినిమాటిక్ మోడ్, రియల్-టైమ్ ప్రాసెసింగ్ V1+ చిప్

ఎందుకు ఎంచుకోవాలి? :
వివో X100 Pro మొబైల్ ఫిల్మ్ మేకర్స్ కోసం రూపొందించింది. సినిమాటిక్ షాట్‌లకు ప్రో-గ్రేడ్ కలర్ ట్యూనింగ్, ఆప్టికల్ జూమ్‌ను అందిస్తుంది.

5. వన్‌ప్లస్ 12 :
కెమెరా సెటప్ : 50MP (మెయిన్) + 48MP (అల్ట్రావైడ్) + 64MP (పెరిస్కోప్ జూమ్)
ముఖ్య ఫీచర్లు : హాసెల్‌బ్లాడ్ ట్యూనింగ్, 8K రికార్డింగ్, HDR అప్‌గ్రేడ్

Read Also : Vivo V50 Discount : వావ్.. అద్భుతమైన ఆఫర్.. రూ.37వేల వివో V50 5G ఫోన్.. కేవలం రూ.19వేలకే.. ఇప్పుడే కొనేసుకోండి!

ఏది ఎంచుకోవాలి? :
వన్‌ప్లస్ 12 ఫ్లాగ్‌షిప్-లెవల్ కెమెరా ఫీచర్లను అందిస్తుంది. బడ్జెట్‌లో కంటెంట్ క్రియేటర్లకు బెస్ట్ ఆప్షన్. మీరు వ్లాగింగ్(Vlogs), ఫోటోగ్రఫీ లేదా షార్ట్-ఫారమ్ వీడియోలకు సరైన కెమెరా ఫోన్‌ను ఎంచుకోవాలి. మీ కంటెంట్ క్వాలిటీ మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.