Mozilla Firefox Alert : మొజిల్లా ఫైర్‌ఫాక్స్ యూజర్లకు అలర్ట్.. మీ డివైజ్ డేంజర్‌లో.. ఇప్పుడే అప్‌డేట్ చేసుకోండి..!

Mozilla Firefox Alert : మీ మొబైల్, పీసీ రెండింటిలోనూ విస్తృతంగా ఉపయోగించే అనేక మొజిల్లా ప్రొడక్టులను ప్రభావితం చేస్తుంది. మీరు కింది సాఫ్ట్‌వేర్ వెర్షన్లలో దేనినైనా ఉపయోగిస్తుంటే.. మీరు ప్రమాదంలో ఉన్నట్టే భావించాలి.

Mozilla Firefox users beware, your device is at high risk

Mozilla Firefox Alert : మొజిల్లా ఫైర్‌ఫాక్స్ వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) ఇంటర్నెట్ యూజర్ల కోసం కొత్త ప్రమాద హెచ్చరికను విడుదల చేసింది. మొజిల్లా ఫైర్‌ఫాక్స్ యూజర్లు లేటెస్ట్ సెక్యూరిటీ నోట్‌లో ప్రభుత్వం ఫైర్‌ఫాక్స్ సంబంధిత ప్రొడక్టుల్లో కొన్ని తీవ్రమైన భద్రతా లోపాలను అలర్ట్ చేసింది.

Read Also : iPhone SE 4 Leaks : అత్యాధునిక ఏఐ ఫీచర్లతో ఐఫోన్ ఎస్ఈ 4 వచ్చేస్తోంది.. ఫీచర్ల వివరాలు లీక్.. ఇంకా ఏమి ఉండొచ్చుంటే?

మీ డివైజ్‌లను ప్రొటెక్ట్ చేసుకునేందుకు యూజర్లు సేఫ్‌గా ఉంచడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం వినియోగదారులను కోరుతోంది. సెక్యూరిటీ నోట్ ప్రకారం.. మొజిల్లా బ్రౌజర్‌లో హైలైట్ చేసిన భద్రతా లోపాలతో తలెత్తే ప్రమాదం ఉంది. హ్యాకర్లు లేదా సైబర్ నేరగాళ్లకు రిమోట్ అటాక్ ద్వారా యూజర్లను డేటాను తస్కరించే ప్రమాదం ఉంటుంది.

(CERT-In) అడ్వైజరీ నోట్ ప్రకారం.. CIVN-2024-0317 ఫైర్‌ఫాక్స్, ఫైర్‌ఫాక్స్ ESR, థండర్‌బర్డ్ సహా వివిధ మొజిల్లా ప్రొడక్టుల్లో కనిపించే ఈ లోపాలను హైలైట్ చేస్తుంది. ఈ భద్రతాలోపాల్లో 131కి ముందు మొజిల్లా ఫైర్‌ఫాక్స్ వెర్షన్‌లలో 128.3 మరియు 115.16కి ముందు ఉన్న ఫైర్‌ఫాక్స్ ESR (ఎక్స్‌టెండెడ్ సపోర్ట్ రిలీజ్) వెర్షన్‌లు, 128.3, 131కి ముందు ఉన్న థండర్‌బర్డ్ వెర్షన్‌లలో ఉన్నాయి.

సాఫ్ట్‌వేర్ ఎఫెక్ట్ :
భద్రతా లోపం కారణంగా మీ మొబైల్, పీసీ రెండింటిలోనూ విస్తృతంగా ఉపయోగించే అనేక మొజిల్లా ప్రొడక్టులను ప్రభావితం చేస్తుంది. మీరు కింది సాఫ్ట్‌వేర్ వెర్షన్లలో దేనినైనా ఉపయోగిస్తుంటే.. మీరు ప్రమాదంలో ఉన్నట్టే భావించాలి.

మొజిల్లా ఫైర్‌ఫాక్స్ 131కి ముందు వెర్షన్లు

  • మొజిల్లా ఫైర్‌ఫాక్స్ ఈఎస్ఆర్ 128.3, 115.16కి ముందు వెర్షన్లు
  • మొజిల్లా థండర్‌బర్డ్ : 128.3, 131కి ముందు వెర్షన్‌లు.

ఈ భద్రతా లోపాల నుంచి ప్రొటెక్ట్ చేసుకునేందుకు మొజిల్లా లేటెస్ట్ వెర్షన్‌లతో సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేసుకోవాలని ప్రభుత్వం వినియోగదారులను కోరింది. మొజిల్లా అనేక అడ్వైజరీలను కూడా జారీ చేసింది. అన్ని భద్రతా లోపాలకు పరిష్కారాలను అందిస్తుంది. ఈ కొత్త అప్‌డేట్‌లతో వినియోగదారులు తమ డివైజ్‌లను సురక్షితంగా ఉంచుకోవచ్చు.

ఫైర్‌ఫాక్స్ లేటెస్ట్ వెర్షన్‌ వాడుతున్నారా? చెక్ చేయండిలా :

  •  Mozilla Firefox లేదా (Thunderbird) మెనుని ఓపెన్ చేయండి.
  •  “Help”కి నావిగేట్ చేయండి.
  •  “About Firefox” లేదా “About Thunderbird”పై క్లిక్ చేయండి.
  •  కొత్త అప్‌డేట్స్ కోసం చెక్ చేయండి. క్లిక్ చేయగానే ఆటోమాటిక్‌గా ఇన్‌స్టాల్ అవుతుంది.
  •  అప్‌డేట్ అందుబాటులో ఉంటే.. ఇన్‌స్టాల్ చేసేందుకు ఒక బటన్‌తో పాప్-అప్ విండో కనిపిస్తుంది.
  •  అప్‌డేట్ చేసిన తర్వాత ఫైర్‌ఫాక్స్ గ్రీన్ చెక్‌మార్క్‌, లేటెస్ట్ అప్‌డేట్ అనే మెసేజ్ కనిపిస్తుంది.
  • మీ ఫైర్‌ఫాక్స్ లేటెస్ట్ వెర్షన్‌‌కు అప్‌డేట్ అయినట్టే.

Read Also : Apple iPhone SE 4 : ఆపిల్ లవర్స్‌కు అదిరే న్యూస్.. ఐఫోన్ SE 4 వచ్చేది ఎప్పుడంటే? ఏయే అప్‌గ్రేడ్స్ ఉండొచ్చుంటే?