iPhone SE 4 Leaks : అత్యాధునిక ఏఐ ఫీచర్లతో ఐఫోన్ ఎస్ఈ 4 వచ్చేస్తోంది.. ఫీచర్ల వివరాలు లీక్.. ఇంకా ఏమి ఉండొచ్చుంటే?

iPhone SE 4 Leaks : ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లు, యాక్షన్ బటన్, యూఎస్‌బీ-సి పోర్ట్, ఫేస్ ఐడీ సపోర్ట్ మరిన్ని ఫీచర్లు ఉంటాయి. ఆపిల్ రాబోయే బడ్జెట్-ఫ్రెండ్లీ ఐఫోన్ ఎస్ఈ 4 అన్ని లేటెస్ట్ లీక్‌లను ఓసారి పరిశీలిద్దాం.

iPhone SE 4 Leaks : అత్యాధునిక ఏఐ ఫీచర్లతో ఐఫోన్ ఎస్ఈ 4 వచ్చేస్తోంది.. ఫీచర్ల వివరాలు లీక్.. ఇంకా ఏమి ఉండొచ్చుంటే?

iPhone SE 4 Leaks_ Big OLED Display, New Design, Action Button, AI Features

Updated On : October 5, 2024 / 10:10 PM IST

iPhone SE 4 Leaks : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ నాల్గో జనరేషన్ ఐఫోన్ ఎస్ఈ 2025లో భారీ మార్పులతో లాంచ్ చేయాలని యోచిస్తున్నట్లు నివేదిక వెల్లడించింది. లీక్‌ల ప్రకారం.. వచ్చే ఏడాది మార్చిలో ఈ ఐఫోన్ ఎస్ఈ 4 లాంచ్ కానుంది. రాబోయే ఐఫోన్ ఎస్ఈ 4, ఐఫోన్ 14-వంటి డిజైన్, భారీ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని అంచనా. ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లు, యాక్షన్ బటన్, యూఎస్‌బీ-సి పోర్ట్, ఫేస్ ఐడీ సపోర్ట్ మరిన్ని ఫీచర్లు ఉంటాయి. ఆపిల్ రాబోయే బడ్జెట్-ఫ్రెండ్లీ ఐఫోన్ ఎస్ఈ 4 అన్ని లేటెస్ట్ లీక్‌లను ఓసారి పరిశీలిద్దాం.

Read Also : Google Verified Check : గూగుల్ సెర్చ్‌లో కొత్త వెరిఫైడ్ బ్లూ బ్యాడ్జ్ ఫీచర్ వస్తోంది.. ఇక ఫేక్ వెబ్‌‌సైట్లకు చెక్ పడినట్టే..!

ఐఫోన్ ఎస్ఈ 4 లీక్‌లు :
తైవానీస్ సప్లై చైన్ పబ్లికేషన్ డిజిటైమ్స్ ప్రకారం.. కుపెర్టినో-ఆధారిత టెక్ దిగ్గజం నెక్స్ట్ జనరేషన్ ఐఫోన్ ఎస్ఈ కోసం బీఓఈ, ఇతర చైనీస్ తయారీదారుల నుంచి ఓఎల్ఈడీ డిస్‌ప్లేలను సోర్స్ చేస్తోంది. ఈ డేటాలో బీఓఈ తదుపరి ఐఫోన్ ఎస్ఈ కోసం ఓఎల్ఈడీ డిస్‌ప్లేలను సరఫరా చేయనుందని పలు నివేదికలు పేర్కొన్నాయి.

ఇటీవల, బ్లూమ్‌బెర్గ్ మార్క్ గుర్మాన్ ఐఫోన్ ఎస్ఈ 4 ఐఫోన్ 14 మాదిరిగానే అదే డిజైన్‌తో లాంచ్ అవుతుందని వెల్లడించారు. ఇందులో నాచ్‌తో ఎడ్జ్-టు-ఎడ్జ్ స్క్రీన్ కూడా ఉంది. రాబోయే ఎస్ఈ మోడల్ ఫేస్ ఐడీకి సపోర్టు ఇస్తుందని చెప్పవచ్చు. కొత్త ఐఫోన్ ఎస్ఈ ఐఫోన్ 14పై ఆధారపడి ఉంటే.. 6.1-అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. అయితే, ప్రస్తుత మోడల్ 4.7-అంగుళాల ఎల్‌సీడీ కలిగి ఉంటుంది.

కొత్త ఐఫోన్ ఎస్ఈ ఆపిల్ ఇంటెలిజెన్స్‌కు సపోర్టు ఇస్తుందని గుర్మాన్ చెప్పారు. ఆపిల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం ఐఫోన్ 15ప్రో, ఐఫోన్ 15ప్రో మ్యాక్స్ అన్ని ఐఫోన్ 16 మోడల్‌లకు పరిమితమైంది. అదనంగా, ఐఫోన్ 8జీబీ ర్యామ్ పెంచే అవకాశం ఉంది. రాబోయే ఐఫోన్ ఎస్ఈ 4 ఇతర ఫీచర్లలో యూఎస్‌బీ-సి పోర్ట్, యాక్షన్ బటన్ ఉన్నాయి. ఆప్టిక్స్ విషయానికి వస్తే.. ఐఫోన్ 48ఎంపీ బ్యాక్ కెమెరాను కలిగి ఉంటుంది. ఐఫోన్ 15, ఐఫోన్ 16 కెమెరా సిస్టమ్‌తో వస్తుంది. నిజమైతే, మిడ్-రేంజ్ మార్కెట్లో ఎస్ఈ 4ని పోటీదారుగా నిలిచే అవకాశం ఉంది.

భారత్‌లో ఐఫోన్ ఎస్ఈ 4 ధర (అంచనా) :
ఐఫోన్ ఎస్ఈ మోడల్‌లు సాధారణంగా ఆపిల్ అందించే బడ్జెట్-ఫ్రెండ్లీ ఐఫోన్‌లు. అయితే, ఐఫోన్ ఎస్ఈ 4లో భారీ అంచనాల అప్‌గ్రేడ్‌ల కారణంగా ధర పెరిగే అవకాశం ఉంది. ఇటీవలి లీక్‌లలో ఐఫోన్ ఎస్ఈ 3కి రూ. 43,900తో పోలిస్తే.. ఐఫోన్ ఎస్ఈ 4 ప్రారంభ ధరను రూ. 49,900గా సూచిస్తున్నాయి. అయితే, డిస్కౌంట్‌లు, ట్రేడ్-ఇన్ ఆఫర్‌లు ఐఫోన్ ధరను మరింత తగ్గించవచ్చు.

Read Also : Asteroids Pass Earth : భూమికి అతిదగ్గరగా ఐదు అతిపెద్ద గ్రహశకలాలు.. ముప్పు లేనట్టే అంటున్న ఖగోళ శాస్త్రవేత్తలు..!