Asteroids Pass Earth : భూమికి అతిదగ్గరగా ఐదు అతిపెద్ద గ్రహశకలాలు.. ముప్పు లేనట్టే అంటున్న ఖగోళ శాస్త్రవేత్తలు..!
Asteroids Pass Earth : మన భూమికి దగ్గరగా ఐదు గ్రహశకలాలు దూసుకొచ్చాయి. గ్రహశకలాలలో 2024 SY5, 2024 RJ32, 2024 SL3, 2024 SZ1, 2023 GM1 ఉన్నాయి.

Five Asteroids Safely Pass Earth Today
Asteroids Pass Earth : ఖగోళంలో అద్భుతం చోటుచేసుకుంది. మన భూమికి దగ్గరగా ఐదు గ్రహశకలాలు దూసుకొచ్చాయి. ప్రస్తుతానికి ఈ గ్రహశకలాలతో ఎలాంటి ముప్పులేదని ఖగోళ సైంటిస్టులు స్పష్టం చేశారు. నాసా జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ నివేదించిన ప్రకారం.. ఆ ఐదు గ్రహశకలాలు భూమిని సురక్షితంగా దాటేశాయి. వీటిలో ఎలాంటి ముప్పు లేనప్పటికీ, వాటి సామీప్యం శాస్త్రీయ అధ్యయనానికి, ప్రత్యేకించి గ్రహ రక్షణ వ్యవస్థలను మెరుగుపరచడంలో అవకాశాన్ని అందిస్తుంది. గ్రహశకలాలలో 2024 SY5, 2024 RJ32, 2024 SL3, 2024 SZ1, 2023 GM1 ఉన్నాయి. ఏయే గ్రహశకలం ఎంతటి పరిమాణంలో ఉంది. వాటి విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Read Also : 2024 BMW M4 CS : కొత్త కారు భలే ఉందిగా.. బీఎండబ్ల్యూ M4 CS మోడల్ అదిరింది.. 302కి.మీ టాప్ స్పీడ్..!
2024 SY5 గ్రహశకలం.. బస్సు (9 మీటర్లు) పరిమాణంలో భూమికి 1,640,000 కిలోమీటర్ల సురక్షిత దూరంలో దూసుకుపోతుంది. భూమి, చంద్రుని మధ్య సగటు దూరం కన్నా దాదాపు 4.3 రెట్ల దూరంలో ఉంది. ఈ గ్రహశకలం చిన్న పరిమాణంలో ఉండటంతో ఖగోళ శాస్త్రవేత్తలకు దాని లక్షణాలను నిశితంగా పరిశీలించేందుకు వీలుగా ఉంటుంది. భూమికి సమీపంలో ఉన్న వస్తువుల కోసం రక్షణ వ్యూహాలను మెరుగుపరిచేందుకు అవకాశాన్ని అందిస్తుంది.
2024 RJ32 గ్రహశకలం అనేది ఐదు గ్రహశకలాల్లో అతిపెద్దది. 40 మీటర్లు లేదా విమానం పరిమాణంలో ఉంటుంది. 2,930,000 కిలోమీటర్ల దూరంలో లేదా భూమి-చంద్రుని సగటు దూరానికి 7.6 రెట్లు దూరంలో వెళుతుంది. ఈ గ్రహశకలం పరిమాణం ప్రవర్తన, కక్ష్య గురించి మరింత తెలుసుకోవడం భవిష్యత్తులో పెద్ద గ్రహశకలాల ట్రాకింగ్‌కు దోహదపడుతుందని, అధ్యయనంలో కూడా సాయపడుతుందని సైంటిస్టులు భావిస్తున్నారు.
2024 SL3 గ్రహశకలం.. 19 మీటర్లు (ఇంటికి సమానమైన పరిమాణంలో ఉంటుంది). భూమిని 3,130,000 కిలోమీటర్ల దూరం నుంచి లేదా భూమి-చంద్రుని దూరం కన్నా 8.1 రెట్లు దూరంలో పయనిస్తోంది. ఇతర గ్రహశకలాల మాదిరిగానే ఈ గ్రహశకలంతో ఎలాంటి ముప్పు లేదు. కానీ, విలువైన శాస్త్రీయపరమైన అంశాలను అందిస్తుంది. 2024 SZ1 గ్రహశకలం 34 మీటర్ల వ్యాసంతో విమానమంతా పెద్ద పరిమాణంలో ఉంటుంది. భూమి నుంచి 4,210,000 కిలోమీటర్ల దూరంలో సురక్షితంగా వెళ్తోంది. సగటు చంద్రుడు-భూమి దూరం కన్నా 11 రెట్లు ఎక్కువ అంటున్నారు సైంటిస్టులు.
చివరగా, 2023 జీఎమ్1 గ్రహశకలం 12 మీటర్ల పరిమాణంలో అతి చిన్నది. 5,900,000 కిలోమీటర్ల దూరంలో భూమిని దాటుతుంది. సాపేక్షంగా చిన్న పరిమాణంలో ఉండటమే కాకుండా ఎక్కువ దూరం కారణంగా పెద్దగా ప్రమాదం లేదని అంటున్నారు. అయితే, ఈ భూమికి సమీపంలో ఉన్న వస్తువులు శాస్త్రవేత్తలకు గ్రహశకలం ప్రవర్తనను గమనించి బాగా అర్థం చేసుకోవడానికి ఒక ప్రత్యేక అవకాశాన్ని అందిస్తాయి. గ్రహ రక్షణ, సౌర వ్యవస్థ నిర్మాణంపై అధ్యయనానికి దోహదపడతాయి.