Chrome Slow Down : క్రోమ్‌లో మల్టీ ట్యాబ్‌లు ఓపెన్ చేస్తే.. మీ కంప్యూటర్ స్లో అవుతుందా? గూగుల్ పరిష్కారం ఇదిగో..!

Chrome Slow Down : గూగుల్ క్రోమ్ యూజర్లకు అలర్ట్.. క్రోమ్ ట్యాబ్‌లను ఒకేసారి ఓపెన్ చేసినప్పుడు మీ కంప్యూటర్ స్లో అవుతుందా? అయితే ఇకపై ఈ సమస్య రాకుండా ఉండేందుకు కొత్త టూల్‌ను టెస్టింగ్ చేస్తోంది.

Chrome Slow Down : గూగుల్ క్రోమ్ యూజర్లకు అలర్ట్.. క్రోమ్ ట్యాబ్‌లను ఒకేసారి ఓపెన్ చేసినప్పుడు మీ కంప్యూటర్ స్లో అవుతుందా? అయితే ఇకపై ఈ సమస్య రాకుండా ఉండేందుకు కొత్త టూల్‌ను టెస్టింగ్ చేస్తోంది. ఇతర అప్లికేషన్ల కోసం మీ కంప్యూటర్‌లో మెమరీని క్లీన్ చేయడంలో సాయపడుతుంది. Reddit యూజర్ ద్వారా Chrome లేటెస్ట్ కానరీ బిల్డ్‌లోని సెట్టింగ్‌ల మెనులో న్యూ పర్ఫార్మెన్స్ పేజీ ఉందని ఆండ్రాయిడ్ పోలీస్ నివేదించింది.

ఈ బిల్డ్ రెండు కొత్త ఫీచర్లను కలిగి ఉంది. మెమరీ సేవర్, ఎనర్జీ సేవర్ మోడ్ కూడా అందిస్తోంది. మెమరీ సేవర్ మోడ్ కొంతకాలంగా వినియోగదారు ట్యాబ్‌లను హైబర్నేట్ చేస్తుంది. క్రోమ్‌లో మల్టిపుల్ ట్యాబ్‌లను ఓపెన్ చేయడం వల్ల చాలా మెమరీ అయిపోతుంది. దాంతో కంప్యూటర్ స్లో అవుతుంది. కొత్త Google Chrome ఫీచర్‌తో యూజర్లు ఉపయోగంలో లేని ట్యాబ్‌లను స్నూజ్ చేసుకునే వీలుంటుంది.

యూజర్ తాత్కాలికంగా నిలిపివేసిన ట్యాబ్‌ను మళ్లీ ఓపెన్ చేసినప్పుడు.. ఇతర పనుల కోసం ఎంత ర్యామ్ రిలీజ్ అవుతుందో పాప్-అప్‌ కనిపిస్తుంది. మెమరీ సేవర్ మోడ్ కోసం స్క్రీన్‌షాట్‌ను షేర్ చేసింది. ఇన్‌యాక్టివ్ ట్యాబ్‌లను యూజర్ మళ్లీ విజిట్ చేసినప్పుడు మళ్లీ యాక్టివేట్ అవుతాయని నివేదిక వివరిస్తుంది. మీరు మెమరీ సేవర్‌ను ఆన్ లేదా ఆఫ్‌లో టోగుల్ చేయవచ్చు. మీరు యాంబియంట్ మ్యూజిక్ లేదా లైవ్ గేమ్ స్కోర్ ట్రాకర్ కోసం ఉపయోగిస్తే.. YouTube వంటి వెబ్‌సైట్‌లను స్నూజ్ చేయని వెబ్‌సైట్‌ల కోసం మినహాయింపులను అని నివేదిక పేర్కొంది.

Multiple tabs on Chrome slow down your computer Google may soon have a solution

మరోవైపు, బ్యాటరీ సేవర్ మోడ్ అధిక రిఫ్రెష్ రేట్ ఫీచర్‌లు, విజువల్ ఎఫెక్ట్‌లను ఆఫ్ చేసేందుకు యూజర్లను అనుమతిస్తుంది. తద్వారా వారి డివైజ్ బ్యాటరీ లైఫ్ పొడిగించవచ్చు. ఈ ఫీచర్‌తో, యూజర్లు బ్యాక్‌గ్రౌండ్ యాక్టివిటీలను లిమిట్ చేయవచ్చు. ప్రస్తుతం Chrome Canaryలో అందుబాటులో ఉన్నాయి. ఈ ఫీచర్‌లు త్వరలో స్థిరమైన ఛానెల్‌కు చేరుకుంటాయని భావిస్తున్నారు. భవిష్యత్తులో ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులోకి రావచ్చు.

ఇంతలో, 2023 ప్రారంభంలో Windows 7, Windows 8.1 కోసం Chrome సపోర్టు నిలిపివేస్తామని Google ప్రకటించింది. Google సపోర్టు పేజీ ప్రకారం.. Chrome 110 ఈ రెండు పాత Microsoft Windows వెర్షన్లకు సపోర్టు ఇచ్చే లాస్ట్ వెర్షన్. Google Chrome వెర్షన్ 110 ఫిబ్రవరి 7, 2023న రిలీజ్ చేస్తుందని భావిస్తున్నారు. Windows 7 ESU, Windows 8.1కి సపోర్టును నిలిపివేయాలనే Microsoft నిర్ణయంతో జనవరి 10, 2023 తేదీకి పొడిగించింది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Xiaomi Book Air 13 : షావోమీ బుక్ ఎయిర్ 13 ల్యాప్‌టాప్ వస్తోంది.. రెడ్‌మి నోట్ 12 సిరీస్ ఫోన్ కూడా.. ధర ఎంత ఉండొచ్చుంటే?

ట్రెండింగ్ వార్తలు