NASA : మార్స్‌పై మరోసారి భూకంపం..ఈసారి తీవ్రత ఎంతంటే
ల్యాండర్ మార్స్ గ్రహంపై మరోసారి భూకంపాన్ని గుర్తించింది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా దీనిని పసిగట్టింది. మనుషులకు తెలియని అతిపెద్ద, సుదీర్ఘ భూకంపాన్ని ఇన్ సైట్ గుర్తించింది

Nasa
InSight Lander Mars : భూకంపాలు భూమి మీదనే వస్తాయా ? ఆకాశంలో ఉన్న గ్రహాలపై చోటు చేసుకుంటాయా ? అంటే…అవును అనే సమాధానం వస్తొంది. ఎందుకంటే…ఇన్ సైట్ ల్యాండర్ మార్స్ గ్రహంపై మరోసారి భూకంపాన్ని గుర్తించింది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా దీనిని పసిగట్టింది. మనుషులకు తెలియని అతిపెద్ద, సుదీర్ఘ భూకంపాన్ని ఇన్ సైట్ గుర్తించడం జరిగిందని నాసా వెల్లడించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Read More : Corona : ప్రపంచవ్యాప్తంగా కరోనా తగ్గుముఖం
కానీ..భూకంప కేంద్రం ఎక్కడుందో తెలియడం లేదు. దీనిని గుర్తించే పనిలో పడింది నాసా శాస్త్రవేత్తలు. ఈ నెల 18వ తేదీన ఇది చోటు చేసుకుంది. నెల రోజుల వ్యవధిలోనే…ప్రకంపనలు చోటు చేసుకోవడం మూడోసారి. తాజాగా చోటు చేసుకున్న భూకంప తీవ్రత 4.2గా ఉందని, ప్రకంపనాలు సుమారు గంటపాటు సాగినట్లు నాసా వెల్లడించింది. గతం నెల 25వ తేదీన భూ ప్రకంపనాలు చోటు చేసుకున్నాయి. సీస్మోమీటర్ లో 4.2, 4.1 తీవ్రతగా రెండు భూ ప్రకంపనాలు వచ్చినట్లు… నాసా గుర్తించింది. 2019లో 3.7 తీవ్రత నమోదైంది.
Read More : American Corner : ఏయూలో అమెరికన్ కార్నర్ ప్రారంభం
ఇన్ సైట్ ల్యాండర్ ఉన్న చోటు నుంచి…8500 కిలోమీరట్ల దూరంలో ఈ 4.2 ప్రకంపనాల తీవ్రత ఉన్నట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే…ఈసారి మాత్రం పగటి సమయంలో ప్రకంపనాలు రావడం శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచింది. సాధారణంగా..రాత్రి వేళ, గాలులు తక్కువగా ఉన్న సమయంలో…సీస్మోమీటర్ ఈ మార్స్ కంపనాలను గుర్తించేది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.