Netflix Password Sharing : భారత్‌లో నెట్‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్ షేరింగ్‌ లేనట్టే.. ఒకే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్లతో మాత్రమే షేరింగ్ అనుమతి..!

Netflix Password Sharing : భారత్‌‌లో నెట్‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్ షేరింగ్ నిలిచిపోయింది. ఇకపై, మీ నెట్‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్‌ను మీ ఇంటి వ్యక్తులతో తప్ప ఇతరులతో షేర్ చేయలేరని గమనించాలి.

Netflix ends Password Sharing in India, tells users to only let household members use their account

Netflix Password Sharing : మీకు నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ ఉందా? భారతీయ నెట్‌ఫిక్స్ యూజర్లు (Netflix Users) ఇకపై అందరికి తమ అకౌంట్ పాస్‌వర్డ్ షేరింగ్ (Netflix Password Sharing) చేయలేరు. ఇప్పటివరకూ ఒకే అకౌంటుకు బిల్లు చెల్లిస్తూ ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు. కానీ, ఇకపై అలా కుదరదు. ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ భారతీయ యూజర్లకు పాస్‌వర్డ్ షేరింగ్ నిలిపివేస్తున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు స్ట్రీమింగ్ కంపెనీ తగిన చర్యలు తీసుకుంటోంది. నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫారమ్ తమ యూజర్లకు ఇమెయిల్‌ ద్వారా నోటిఫికేషన్ పంపుతోంది. వినియోగదారులు తమ అకౌంట్ వారికి లేదా తమ కుటుంబ సభ్యులకు మాత్రమే అని చెబుతోంది.

అంటే.. ఇంటి వెలుపల మరెవరైనా నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ ఉపయోగిస్తుంటే.. వారు తప్పనిసరిగా తమ ప్రొఫైల్‌ను కొత్త అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేయాలి (పేమెంట్ తప్పనిసరి). అంతేకాదు.. తమ పాస్‌వర్డ్‌ను మార్చుకోవాలి. నెట్‌ఫ్లిక్స్ ఈ ప్రకటనను ఆకస్మికంగా తీసుకున్నది కాదు.. చాలా కాలంగా, నెట్‌ఫ్లిక్స్ వినియోగదారుల మధ్య పాస్‌వర్డ్ షేరింగ్‌ను త్వరలో ముగించనుందని అలర్ట్ చేస్తూనే ఉంది. పలు దేశాల్లో నెట్‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్ షేరింగ్ విధానాన్ని నిలిపివేసింది. ఇప్పుడు భారత్‌లోనూ అదే దిశగా చర్యలు చేపడుతోంది.

Read Also : Netflix Profile Transfer : నెట్‌ఫ్లిక్స్‌లో కొత్త ప్రొఫైల్ ట్రాన్స్‌ఫర్ ఫీచర్.. మరో అకౌంటుకు పాస్‌వర్డ్ షేరింగ్ ఇక ఈజీ..!

నెట్‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్ షేరింగ్‌ అలా కుదరదు :
స్ట్రీమింగ్ దిగ్గజం భారత్‌లో ఇంటి వెలుపల నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ పాస్‌వర్డ్ షేర్ చేస్తున్న సభ్యులకు ఈ-ఇమెయిల్‌ను పంపుతోంది. Netflix అకౌంట్ ఒక కుటుంబం కోసం మాత్రమే వినియోగించాలి. ఆ కుటుంబంలో నివసించే ప్రతి ఒక్కరూ (Netflix)ని వినియోగించగలరు. వారు ఎక్కడ ఉన్నా ఇంట్లో ఉన్నా లేదా ప్రయాణం చేస్తున్నా? సెలవుల్లో ఉన్నా ప్రొఫైల్ యాక్సెస్ చేసుకోవచ్చు. డివైజ్ మేనేజ్ మెంట్ వంటి కొత్త ఫీచర్లను ఉపయోగించుకోవచ్చు. అనేక రకాల కొత్త మూవీలు, టీవీ కార్యక్రమాలను వీక్షించవచ్చు. మీ ఇంటివారు తప్ప ఎవరైనా నెట్‌ఫ్లిక్స్‌ని ఉపయోగిస్తుంటే.. మాత్రం వారు ప్రొఫైల్‌ను ట్రాన్స్‌ఫర్ చేయాలి. దీనికి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. తమ అకౌంట్ పాస్‌వర్డ్‌ను కూడా మార్చుకోవాల్సి ఉంటుంది.

నెట్‌ఫ్లిక్స్ యూజర్లు ఏం చేయాలి? :
వినియోగదారులు ముందుగా తమ అకౌంట్ సెక్యూరిటీ, ప్రైవసీ సెట్టింగ్‌లకు వెళ్లాలి. ‘Manage access and devices’ ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా తమ అకౌంట్లో ఎవరు లాగిన్ అయ్యారో చెక్ చేయాలి.అప్పుడు, వినియోగదారులు తప్పనిసరిగా ‘యాక్సెస్ లేని’ డివైజ్‌ల నుంచి సైన్ అవుట్ చేసి.. వారి పాస్‌వర్డ్‌లను మార్చుకోవాలి. ఒకవేళ వారి ఇంటి వెలుపల ఉన్న ఎవరైనా నెట్‌ఫ్లిక్స్‌ని ఉపయోగిస్తుంటే.. తమ ప్రొఫైల్‌ను ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు.

Netflix ends Password Sharing in India, tells users to only let household members use their account

నెట్‌ఫ్లిక్స్ హోమ్ ఎలా సెటప్ చేయాలంటే? :
వినియోగదారులు తప్పనిసరిగా నెట్‌ఫ్లిక్స్ హోమ్ సెటప్ చేయాలి. ప్రాథమికంగా మీరు నెట్‌ఫ్లిక్స్ చూసేందుకు ఎక్కువగా ఉపయోగించే టీవీకి కనెక్ట్ అయి ఉండాలి. ఈ టీవీ మాదిరిగా అదే ఇంటర్నెట్ కనెక్షన్‌ను ఉపయోగించే డివైజ్‌లు ఆటోమేటిక్‌గా యూజర్ల నెట్‌ఫ్లిక్స్ హౌస్‌హోల్డ్‌లో భాగమవుతాయని కంపెనీ తెలిపింది. Netflix హోమ్ సెటప్ చేసేందుకు వినియోగదారులు ఈ కిందివిధంగా ప్రయత్నించండి.

1. మీ హోమ్ ఇంటర్నెట్‌కి కనెక్ట్ చేసిన టీవీని ఉపయోగించి Netflixకి సైన్ ఇన్ చేయండి.
2. మీ టీవీలోని నెట్‌ఫ్లిక్స్ హోమ్‌స్క్రీన్ నుంచి మెనుని ఓపెన్ చేసి Get Help ఎంచుకోండి. ఆపై నెట్‌ఫ్లిక్స్ హౌస్‌హోల్డ్‌ని మేనేజ్ చేయండి.
3. నెట్‌ఫ్లిక్స్ హౌస్‌హోల్డ్‌ని Confirm చేయండి లేదా My Netflix Household అప్‌డేట్ చేయండి అని చెప్పే ట్యాబ్‌పై Click చేయండి.
4. ఇప్పుడు, సెండ్ ఇమెయిల్ లేదా సెండ్ టెక్స్ట్ ఆప్షన్ ఎంచుకోండి. అలా చేసిన వెంటనే, మీరు నెట్‌ఫ్లిక్స్‌లో ఎంటర్ చేసుకున్న అకౌంట్, ఇమెయిల్ అడ్రస్ లేదా ఫోన్ నంబర్‌కు వెరిఫికేషన్ లింక్ పంపుతుంది. ఆ లింక్ గడువు 15 నిమిషాలు మాత్రమే వ్యాలీడ్ ఉంటుంది. ఆలోగా వెంటనే వెరిఫై చేసుకోవాలి. మీరు ఇమెయిల్ అడ్రస్, ఫోన్ నంబర్ రెండింటినీ యాడ్ చేయకపోతే.. వెరిఫికేషన్‌లో ఒక ఆప్షన్ మాత్రమే కనిపిస్తుంది.
5. మీరు వెరిఫికేషన్ లింక్‌పై క్లిక్ చేసిన తర్వాత.. Yes.. (This Was Me) ఆప్షన్ ఎంచుకోండి. ఆపై కొనసాగించడానికి నెట్‌ఫ్లిక్స్ హౌస్‌హోల్డ్‌ను నిర్ధారించండి లేదా (Update Netflix Household) నెట్‌ఫ్లిక్స్ హౌస్‌హోల్డ్‌ని ఎంచుకోండి. మీ టీవీ స్క్రీన్‌పై confirmation మెసేజ్ కనిపిస్తుంది. అలాగే, మీకు రిజిస్టర్ ఇమెయిల్‌ కూడా మెసేజ్ అందుకుంటారు. అంతే, నెట్‌ఫ్లిక్స్ హోమ్ ప్రాసెస్ పూర్తి అయినట్టే..

Read Also : Netflix Profile Transfer : నెట్‌ఫ్లిక్స్‌లో కొత్త ప్రొఫైల్ ట్రాన్స్‌ఫర్ ఫీచర్.. మరో అకౌంటుకు పాస్‌వర్డ్ షేరింగ్ ఇక ఈజీ..!