Netflix Employees : నెట్‌ఫ్లిక్స్‌కు ఏమైంది.. మరో 300 మంది ఉద్యోగుల తొలగింపు.. అసలు కారణాలివే..!

Netflix 300 Employees : ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. నెట్ ఫ్లిక్స్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో కోతలు విధిస్తోంది.

Netflix 300 Employees : ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. నెట్ ఫ్లిక్స్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో కోతలు విధిస్తోంది. ఇప్పటికే 150 మంది ఉద్యోగులను తొలగించిన నెట్ ఫ్లిక్స్ మరో 300 మంది ఉద్యోగులను తొలగించింది. ఈ మేరకు నెట్ ఫ్లిక్స్ కంపెనీ ధ్రువీకరించింది. నెట్ ఫ్లిక్స్ ఉద్యోగులను తొలగించడానికి ప్రధాన కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి పేమెంట్ సబ్‌స్క్రైబర్‌లను వేగంగా కోల్పోతోంది. దాంతో కంపెనీ ఆదాయ వృద్ధి సంవత్సరాలుగా తగ్గిపోతూ వస్తోంది. దశలవారీగా ఉద్యోగులను తొలగింపు చర్యలు చేపట్టింది.

నెట్‌ఫ్లిక్స్ ఆదాయ వృద్ధి నెమ్మదించడం కారణంగా తొలుత 150 మంది ఉద్యోగులను తొలగించింది. నెట్ ప్లిక్స్ పతనానికి స్టాక్ ధర తగ్గడం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. నెట్‌ఫ్లిక్స్ వృద్ధి మందగించిన నేపథ్యంలో కంపెనీ తమ ఖర్చులను తగ్గించే ప్రణాళికలను చేపట్టింది. అందులో భాగంగానే మరో 300 మంది ఉద్యోగులను తొలగించాల్సి వచ్చిందని కంపెనీ ధృవీకరించింది.

Netflix Fires 300 More Employees, Blames Slump In Paid Subscribers For Slow Revenue Growth

నెట్‌ఫ్లిక్స్‌లో మొత్తం 11,000 మంది ఉద్యోగులు ఉన్నారని నివేదికలు చెబుతున్నాయి. 300 మంది ఉద్యోగుల తొలగింపుతో దాదాపు 2 శాతం మంది ఉద్యోగులపై ప్రభావితం చేశాయని నివేదిక తెలిపింది. నెట్‌ఫ్లిక్స్ కంపెనీలో సేవలు అందించిన ప్రతి ఉద్యోగికి కృతజ్ఞులను తెలియజేస్తున్నామని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. తొలి రౌండ్ తొలగింపులో నెట్‌ఫ్లిక్స్ 150 మంది ఉద్యోగులను తొలగించింది. నెట్‌ఫ్లిక్స్ Q1లో $7.87 బిలియన్లను నివేదించింది.

వాల్ స్ట్రీట్ అంచనాల ప్రకారం.. నెట్‌ఫ్లిక్స్ ఆదాయం $7.93 బిలియన్ల కంటే తక్కువగా ఉంది. నెట్‌ఫ్లిక్స్ ఇప్పటివరకూ 2 లక్షల మంది సబ్‌స్క్రైబర్‌లను కోల్పోయినట్లు ప్రకటించింది. నెట్ ఫ్లిక్స్ కంపెనీలో ఇంతకు ముందెన్నడూ జరగలేదు. రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా తదుపరి త్రైమాసికంలో కంపెనీ అదనంగా 2 మిలియన్లను కోల్పోయింది.

యుక్రెయిన్‌పై దేశం దాడి చేసిన తర్వాత నెట్‌ఫ్లిక్స్ రష్యాలో మూతపడింది. అయితే, కంపెనీ తన నష్టాన్ని అధిగమించేందుకు ప్రయత్నిస్తోంది. నెట్‌ఫ్లిక్స్ ఇప్పుడు చౌకైన యాడ్-ఆధారిత సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌పై పని చేస్తోంది. ఇది చాలా మంది యూజర్లను ఆకర్షించే అవకాశం ఉంది. నెట్‌ఫ్లిక్స్ ఎదుర్కొంటున్న మరో ప్రధాన సమస్య పాస్‌వర్డ్-షేరింగ్. సబ్‌స్క్రైబర్ వృద్ధిని పెంచడానికి పాస్‌వర్డ్ షేరింగ్‌ను అరికట్టడానికి కంపెనీ కృషి చేస్తోంది.

Read Also : Netflix Ban : నెట్ ఫ్లిక్స్‌లో ఈ మూడు పనులు చేస్తే.. మీ అకౌంట్ బ్యాన్ అయినట్టే..!

ట్రెండింగ్ వార్తలు