Netflix is ending support for these iPhones and iPads
Netflix Support iPhones : నెట్‌ఫిక్స్ యూజర్లకు అలర్ట్.. మీరు ఐఫోన్, ఐప్యాడ్స్ వాడుతున్నారా? అయితే, ఇది మీకోసమే.. ఐఓఎస్ 17 లేదా ఐప్యాడ్ఓఎస్ 17 రన్ అయ్యే డివైజ్‌ల కన్నా ముందు వెర్షన్ డివైజ్‌లలో ఇకపై ఓటీటీ దిగ్గజ యాప్ నెట్‌ఫ్లిక్స్ పనిచేయదు. అనేక పాత ఐఫోన్లు, ఐప్యాడ్‌లకు నెట్‌ఫిక్స్ తన సపోర్టును నిలిపివేయనుంది. దీని గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రాబోయే ఈ కొత్త మార్పు పాత ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్, ఐఫోన్ ఎక్స్, ఫస్ట్ జనరేషన్ ఐప్యాడ్ ప్రో 5వ జనరేషన్ ఐప్యాడ్ వాడే యూజర్లకు మాత్రమే ప్రభావితం చేస్తుంది. ఇవన్నీ ఐఓఎస్ 16 లేదా ఐప్యాడ్OS 16 తర్వాత అప్‌డేట్ కావని గమనించాలి. ఈ వినియోగదారులు ఇకపై కొత్త అప్‌డేట్స్ అందుకోలేరు. నెట్‌ఫ్లిక్స్ యాప్ అప్‌డేట్‌లు, కొత్త ఫీచర్‌లు లేదా బగ్ ఫిక్స్ వంటివి యాప్ ప్రస్తుత వెర్షన్ కూడా వర్తిస్తాయి.
ఇప్పటికే ఉన్న యాప్ ఫ్యూచర్ అప్‌డేట్‌లతో వచ్చే ఏవైనా అప్‌గ్రేడ్స్ లేదా బగ్ రిజల్యూషన్‌లను కోల్పోతాయి. యాప్ సపోర్టు నిలిపిన వినియోగదారులు ఇప్పటికీ వెబ్ బ్రౌజర్ ద్వారా నెట్‌ఫ్లిక్స్‌ను యాక్సెస్ చేయవచ్చు. కానీ, ఓటీటీ సర్వీసు నుంచి పూర్తిగా యూజర్లను తొలగించలేదని చెప్పవచ్చు. కొత్త సాఫ్ట్‌వేర్ వెర్షన్‌లపై మొత్తం యూజర్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరచే దిశగా నెట్‌ఫ్లిక్స్ విస్తృత ప్రయత్నాలలో భాగం. నెట్‌ఫ్లిక్స్ సపోర్ట్ ఎండ్ అయ్యే కచ్చితమైన సమయాన్ని ఇంకా నిర్ధారించనప్పటికీ, త్వరలోనే ఉంటుందని భావిస్తున్నారు.
జియో ప్లాన్లలో ఫ్రీ నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్ర్కిప్షన్ :
లేటెస్ట్ నెట్‌ఫ్లిక్స్ అప్‌డేట్‌లను పొందాలనుకునే యూజర్ల కోసం ఐఓఎస్ 17 లేదా ఐప్యాడ్ఓఎస్ 17కి సపోర్టు ఇచ్చే ఫోన్లకు అప్‌గ్రేడ్ కావాల్సి ఉంటుంది. అంతేకాకుండా, రిలయన్స్ జియో ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌ను ఫ్రీగా అందించే కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. రూ. 1299 జియో ప్రీపెయిడ్ ప్లాన్ 2జీబీ రోజువారీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ అందిస్తుంది. కొత్త రీఛార్జ్ ప్లాన్ అన్‌లిమిటెడ్ 5జీ డేటా, 2జీబీ రోజువారీ 4జీ డేటాను అందిస్తుంది. ఈ ప్యాక్ 84 రోజుల వ్యాలిడిటీ వ్యవధితో వస్తుంది.
అత్యంత ఖరీదైన ప్యాక్ రూ. 1799, మీకు రోజుకు 3జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్‌ను కూడా అందిస్తుంది. ఇందులో రోజుకు 100 ఎస్ఎంఎస్ కూడా ఉంటుంది. ఇది కూడా అన్‌లిమిటెడ్5జీ డేటా, 3జీబీ 4జీ డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ 84 రోజుల పాటు వ్యాలిడిటీ అందిస్తుంది. ఈ రెండు ప్లాన్‌లు వేర్వేరు (ఫ్రీ) నెట్‌ఫ్లిక్స్ ప్లాన్‌లను యూజర్లకు అందిస్తున్నాయని గమనించాలి. రూ. 1299 జియో ప్రీపెయిడ్ ప్లాన్ నెట్‌ఫ్లిక్స్ మొబైల్ ప్యాక్‌కి ఫ్రీ యాక్సెస్‌ను కూడా అందిస్తుంది. రూ. 1799 ప్లాన్‌లో నెట్‌ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్ కూడా ఉంటుంది.