Tecno Phantom V Fold Launch : టెక్నో నుంచి మడతబెట్టే 5జీ ఫోన్లు వచ్చేశాయి.. ఫీచర్లు భలే ఉన్నాయి భయ్యా.. ధర ఎంతో తెలుసా?

Tecno Phantom V Fold Launch : టెక్నో ఫాంటమ్ వి ఫోల్డ్ 2 5జీ ఫోన్ ధర 1,099 డాలర్లు (దాదాపు రూ. 92,200)గా నిర్ణయించింది. కార్స్ట్ గ్రీన్, రిప్లింగ్ బ్లూ కలర్‌వేస్‌లో అందుబాటులో ఉంది.

Tecno Phantom V Fold Launch : టెక్నో నుంచి మడతబెట్టే 5జీ ఫోన్లు వచ్చేశాయి.. ఫీచర్లు భలే ఉన్నాయి భయ్యా.. ధర ఎంతో తెలుసా?

Tecno Phantom V Fold 2 5G, Phantom V Flip 2 5G ( Image Source : Google )

Updated On : September 13, 2024 / 7:58 PM IST

Tecno Phantom V Fold Launch : కొత్త ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. స్మార్ట్‌ఫోన్ దిగ్గజం టెక్నో నుంచి సరికొత్త ఫోల్డబుల్ ఫోన్లు వచ్చేశాయి. టెక్నో ఫాంటమ్ వి ఫోల్డ్ 2, ఫాంటమ్ వి ఫ్లిప్ 2 ఫోన్లను కంపెనీ లాంచ్ చేసింది. టెక్నో లేటెస్ట్ ఫోల్డబుల్ హ్యాండ్‌సెట్‌లు మీడియాటెక్ డైమెన్సిటీ చిప్‌సెట్‌, ఫీచర్ అమోల్డ్ డిస్‌ప్లేల ద్వారా పవర్ పొందుతాయి.

Read Also : Maruti Suzuki Swift CNG : కొత్త కారు కావాలా? మారుతి కొత్త స్విఫ్ట్ సీఎన్‌జీ వచ్చేసింది.. ఫీచర్లు, ధర వివరాలివే..!

ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు 50ఎంపీ బ్యాక్ కెమెరాలతో అమర్చి ఉంటాయి. టెక్నో ఫాంటమ్ వి ఫోల్డ్ 2, ఫాంటమ్ వి ఫ్లిప్ 2 ఆండ్రాయిడ్ 14 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌లో రన్ అవుతాయి. బుక్-స్టైల్ ఫోల్డబుల్ ఫోన్ ఫాంటమ్ వి పెన్‌కు సపోర్టుతో వస్తుంది. ఈ రెండు హ్యాండ్‌సెట్‌లు టెక్నో ఏఐ ఫీచర్లకు సపోర్టును అందిస్తాయి.

టెక్నో ఫాంటమ్ వి ఫోల్డ్ 2 5జీ, టెక్నో ఫాంటమ్ వి ఫ్లిప్ 2 5జీ ధర :
టెక్నో ఫాంటమ్ వి ఫోల్డ్ 2 5జీ ఫోన్ ధర 1,099 డాలర్లు (దాదాపు రూ. 92,200)గా నిర్ణయించింది. కార్స్ట్ గ్రీన్, రిప్లింగ్ బ్లూ కలర్‌వేస్‌లో అందుబాటులో ఉంది. ఇంతలో టెక్నో ఫాంటమ్ వి ఫ్లిప్ 2 5జీ ఫోన్ ధర 699 డాలర్లు (దాదాపు రూ. 58,600), మూన్ డెస్ట్ గ్రే, ట్రావెర్టైన్ గ్రీన్ కలర్ ఆప్షన్‌లలో వస్తుంది. సెప్టెంబరు 23న ఆఫ్రికాలో ఈ ఫోన్‌లు విక్రయానికి రానుంది. అక్టోబర్‌లో ప్రారంభమయ్యే ఆగ్నేయాసియా, మధ్యప్రాచ్యం, లాటిన్ అమెరికాలో కూడా విక్రయించనుంది.

టెక్నో ఫాంటమ్ వి ఫోల్డ్ 2 5జీ స్పెసిఫికేషన్‌లు :
డ్యూయల్-సిమ్ (నానో) టెక్నో ఫాంటమ్ వి ఫోల్డ్ 2 5జీ కంపెనీ హైఓఎస్ 14 స్కిన్‌తో ఆండ్రాయిడ్ 14లో రన్ అవుతుంది. ఎక్స్‌టీరియర్ స్క్రీన్ 6.42-అంగుళాల ఫుల్-హెచ్‌డీ+ (1,080×2,550 పిక్సెల్‌లు) అమోల్డ్ స్క్రీన్ పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ 7.85-అంగుళాల 2కె+ (2,000×2,296 పిక్సెల్‌లు) అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది.

12జీబీ ర్యామ్ మీడియాటెక్ డైమెన్సిటీ 9000+ చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. ఈ ఫోల్డబుల్ ఫోన్‌లో 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 50ఎంపీ పోర్ట్రెయిట్ కెమెరా, 50ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. లోపలి భాగంలో రెండు 32ఎంపీ కెమెరాలను కలిగి ఉంది. వీటిని సెల్ఫీలు, వీడియో కాల్స్ చేసేందుకు ఉపయోగించవచ్చు.

టెక్నో ఫాంటమ్ వి ఫోల్డ్ 2 5జీలో 512జీబీ ఇంటర్నల్ స్టోరేజీని అందిస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5జీ, 4జీ ఎల్‌టీఈ, వై-ఫై 6ఇ, బ్లూటూత్ 5.3 ఉన్నాయి. బోర్డ్‌లోని సెన్సార్‌లలో యాక్సిలరోమీటర్, గైరోస్కోప్, యాంబియంట్ లైట్ సెన్సార్, సెన్సార్, హాల్ సెన్సార్, ఇ-కంపాస్, ఫ్లికర్ సెన్సార్ ఉన్నాయి. టెక్నో ఫాంటమ్ వి ఫోల్డ్ 2 5జీ ఫోన్ 5,750mAh బ్యాటరీతో 70డబ్ల్యూ అల్ట్రా ఛార్జ్, 15డబ్ల్యూ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో అమర్చింది. ఈ ఫోన్ బరువు 249, 140.35x159x6.08 (ఫోల్డ్ ఓపెన్), 72.16x159x11.78, 11.98ఎమ్ఎమ్ (ఫోల్డ్) పరిమాణంలో ఉంటుంది.

టెక్నో ఫాంటమ్ వి ఫ్లిప్ 2 5జీ స్పెసిఫికేషన్‌లు :
కొత్త ఫాంటమ్ వి ఫ్లిప్ 2 5జీ మాదిరిగానే అదే సాఫ్ట్‌వేర్‌పై రన్ అవుతుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.9-అంగుళాల ఫుల్-హెచ్‌డీ+ (1,080×2,640 పిక్సెల్‌లు) ఎల్‌టీపీఓ అమోల్డ్ స్క్రీన్‌ను కలిగి ఉంది. బయట వైపు 3.64-అంగుళాల (1,066×1,056 పిక్సెల్‌లు) అమోల్డ్ స్క్రీన్‌ను కలిగి ఉంది. డైమెన్సిటీ 8200 చిప్‌సెట్‌తో ఆధారితమైనది. 8జీబీ ర్యామ్‌తో పాటు 256జీబీ ఇంటర్నల్ స్టోరేజీని కలిగి ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 50ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా ఉంది. ఫోల్డ్ ఓపెన్ చేస్తే.. ఆటో ఫోకస్‌తో కూడిన 32ఎంపీ కెమెరాను కలిగి ఉంది. మీరు 5జీ, 4జీ ఎల్‌టీఈ, వై-ఫై 6, బ్లూటూత్ 5.3 కనెక్టివిటీకి సపోర్టు అందిస్తుంది. యాక్సిలరోమీటర్, గైరోస్కోప్, అల్ట్రాసోనిక్ ప్రాక్సిమిటీ సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఇ-కంపాస్, ఫ్లికర్ సెన్సార్, హాల్ సెన్సార్‌ను కూడా కలిగి ఉంది. టెక్నో ఫాంటమ్ వి ఫ్లిప్ 2 5జీ ఫోన్ 4,720mAh బ్యాటరీని 70డబ్ల్యూ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

Read Also : Realme P2 Pro 5G Launch : ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో కొత్త రియల్‌మి పీ2 ప్రో 5జీ ఫోన్.. ధర ఎంతో తెలిస్తే కొనకుండా ఉండలేరు!