Realme P2 Pro 5G Launch : ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో కొత్త రియల్‌మి పీ2 ప్రో 5జీ ఫోన్.. ధర ఎంతో తెలిస్తే కొనకుండా ఉండలేరు!

Realme P2 Pro 5G Launch : భారత మార్కెట్లో రియల్‌మి పి2 ప్రో 5జీ ఫోన్ 8జీబీ+ 128జీబీ ఆప్షన్ ప్రారంభ ధర రూ. 21,999కు అందిస్తోంది. 12జీబీ + 256జీబీ, 12జీబీ + 512జీబీ వేరియంట్‌ల ధర వరుసగా రూ. 24,999, రూ. 27,999కు అందిస్తుంది.

Realme P2 Pro 5G Launch : ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో కొత్త రియల్‌మి పీ2 ప్రో 5జీ ఫోన్.. ధర ఎంతో తెలిస్తే కొనకుండా ఉండలేరు!

Realme P2 Pro 5G With Snapdragon 7s Gen 2 SoC ( Image Source : Google )

Updated On : September 13, 2024 / 6:46 PM IST

Realme P2 Pro 5G Launch : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లో కొత్త రియల్‌మి పీ2 ప్రో 5జీ ఫోన్ లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జనరేషన్ 2 ఎస్ఓసీ, 80డబ్ల్యూ వైర్డు సూపర్‌వూక్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,200mAh బ్యాటరీతో వస్తుంది.

Read Also : Honor 200 Lite Launch : హానర్ నుంచి సరికొత్త ఫోన్ వచ్చేస్తోంది.. ఈ నెల 19నే లాంచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

6.7-అంగుళాల ఫుల్-హెచ్‌డీ+ 3డీ కర్వ్డ్ అమోల్డ్ స్క్రీన్, 50ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్, 32ఎంపీ సెల్ఫీ షూటర్‌తో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ దుమ్ము, స్ప్లాష్ నిరోధకతతో పాటు షాక్-శోషక ఆర్మర్‌షెల్ ప్రొటెక్షన్ కోసం ఐపీ65 రేటింగ్‌తో వస్తుంది. ఈ ఫోన్ దేశంలో 3 ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉంటుంది.

భారత్‌లో రియల్‌మి పి2ప్రో 5జీ ధర ఎంతంటే? :
భారత మార్కెట్లో రియల్‌మి పి2 ప్రో 5జీ ఫోన్ 8జీబీ+ 128జీబీ ఆప్షన్ ప్రారంభ ధర రూ. 21,999, అయితే 12జీబీ + 256జీబీ, 12జీబీ + 512జీబీ వేరియంట్‌ల ధర వరుసగా రూ. 24,999, రూ. 27,999కు అందిస్తుంది. ఈగిల్ గ్రే, పారోట్ గ్రీన్ కలర్‌వేస్‌లో అందిస్తోంది.

ఈ హ్యాండ్‌సెట్ ప్రారంభ సేల్ సెప్టెంబర్ 17న సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్, రియల్‌మి ఇండియా వెబ్‌సైట్ ద్వారా ఈ ఫోన్ కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ప్రారంభ సేల్‌లో భాగంగా యూజర్లు రియల్‌మి పి2ప్రో 5జీపై రూ. 2వేలు కూపన్ డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఫోన్ ధరపై అదనంగా రూ. వెయ్యి తగ్గింపు పొందవచ్చు. బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్‌ ఉపయోగిస్తుంది. ఆసక్తిగల కొనుగోలుదారులు 3 నెలల నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా పొందవచ్చు.

రియల్‌మి పి2ప్రో 5జీ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
రియల్‌మి పి2ప్రో 5జీ ఫోన్ 6.7-అంగుళాల ఫుల్-హెచ్‌డీ+ (1,080 x 2,412 పిక్సెల్‌లు) 3డీ కర్వ్డ్ అమోల్డ్ స్క్రీన్‌తో గరిష్టంగా 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 240హెచ్‌జెడ్ టచ్ శాంప్లింగ్ రేట్, 2,000నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, కార్నింగ్ గ్లాస్ ప్రొటెక్షన్‌ కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 4ఎన్ఎమ్ ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జనరేషన్ 2 ఎస్ఓసీ ద్వారా అడ్రినో 710 జీపీయూతో వస్తుంది. 12జీబీ వరకు ఎల్‌పీడీడీఆర్4ఎక్స్, 512జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 ఆన్‌బోర్డ్ స్టోరేజ్ అందిస్తుంది. ఆండ్రాయిడ్ 14-ఆధారిత రియల్‌మి యూఐ 5తో ప్రొటెక్షన్ అందిస్తుంది.

ఆప్టిక్స్ విషయానికి వస్తే.. :
రియల్‌మి పి2ప్రో 5జీ ఫోన్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్)తో కూడిన 50ఎంపీ సోనీ ఎల్‌వైటీ-600 ప్రైమరీ సెన్సార్, 8ఎంపీ అల్ట్రావైడ్ షూటర్‌తో సహా డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. మరోవైపు, ఫ్రంట్ కెమెరా సెల్ఫీలు, వీడియో కాల్‌ 32ఎంపీ సెన్సార్‌ను కలిగి ఉంది.

రియల్‌మి 80డబ్ల్యూ వైర్డు సూపర్‌వూక్ ఛార్జింగ్‌కు సపోర్టుతో పీ2 ప్రోలో 5,200mAh బ్యాటరీని అందిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది. దుమ్ము, స్ప్లాష్ నిరోధకతకు ఐపీ65-రేటింగ్‌ను కలిగి ఉంది. షాక్-శోషక ఆర్మర్‌షెల్ ప్రొటెక్షన్‌తో కూడా వస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో డ్యూయల్ సిమ్ 5జీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.2, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి.

Read Also : Maruti Suzuki Swift CNG : కొత్త కారు కావాలా? మారుతి కొత్త స్విఫ్ట్ సీఎన్‌జీ వచ్చేసింది.. ఫీచర్లు, ధర వివరాలివే..!