Netflix Password : నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు అలర్ట్.. ఇకపై పాస్‌వర్డ్ షేర్ చేస్తే చెల్లించాల్సిందే..!

Netflix Password : ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు అలర్ట్ చేస్తోంది. ఇకపై నెట్ ఫ్లిక్స్ పాస్‌వర్డ్ షేరింగ్ చేస్తే అదనంగా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.

Netflix Password : ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు అలర్ట్ చేస్తోంది. ఇకపై నెట్ ఫ్లిక్స్ పాస్‌వర్డ్ షేరింగ్ చేస్తే అదనంగా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. మీ స్నేహితులకు లేదా కుటుంబ సభ్యులకు నెట్ ఫిక్స్ యాక్సస్ చేసుకునేందుకు పాస్‌వర్డ్ షేర్ చేయాల్సి వస్తే మాత్రం తప్పనిసరిగా ఛార్జీలు చెల్లించాలని అంటోంది. త్వరలో ఈ కొత్త పాలసీని త్వరలో ప్రారంభించనున్నట్టు నెట్ ఫ్లిక్స్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ కంపెనీ మార్చిలో పాలసీలో మార్పులను ప్రకటించింది. నెట్‌ఫ్లిక్స్ ఇకపై తమ యూజర్లు అకౌంట్ పాస్‌వర్డ్‌ను ఇతరులతో షేర్ చేయొద్దని, ఒకవేళ ఎక్కువ మంది వ్యక్తులతో అకౌంట్ షేర్ చేయాల్సి వస్తే.. అదనంగా చెల్లించాల్సి వస్తుందని స్పష్టం చేసింది. ఎక్కువ మందికి పాస్‌వర్డ్ షేరింగ్‌ను కంట్రోల్ చేయడానికి పెరూ, చిలీ, కోస్టారికాలో ఒక టెస్టింగ్ నిర్వహించింది. కానీ, పాస్‌వర్డ్ షేరింగ్‌ను నిరోధించేందుకు కంపెనీ చేస్తున్న ప్రయత్నాలు ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. తమ పాలసీని ఉల్లంఘించినందుకు అదనపు ఛార్జీలను చెల్లించాల్సిందిగా నెట్‌ఫ్లిక్స్ యూజర్లను కోరుతోందని నివేదిక వెల్లడించింది. ‘మీ కుటుంబంలో పరిమితికి మించి ఇతర వ్యక్తులతో అకౌంట్ పాస్‌వర్డ్ షేర్ చేయరాదని పేర్కొంది.

ఇతర వ్యక్తులతో పాస్‌వర్డ్‌ను షేర్ చేయాలంటే.. ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ సర్వీస్ కొంతమంది కస్టమర్‌లకు ఛార్జీలను విధించనుంది. యూజర్లు సబ్‌స్క్రిప్షన్‌ను క్యాన్సిల్ చేయడానికి ఎంచుకోవచ్చు. నెట్‌ఫ్లిక్స్ అకౌంట్లో షేరింగ్ కోసం అదనపు ఛార్జీలు విధించే కొత్త విధానాన్ని ఇప్పటికే ప్రకటించింది. పెరూలో ఈ విధానం చాలా మందిని గందరగోళానికి గురిచేసింది. వేలాది మంది నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు అదనపు ఛార్జీలు లేదా కొత్త పాలసీ గురించి అధికారికంగా తెలియజేయలేదని అంటున్నారు. కొంతమంది యూజర్లు ఇప్పటికీ తమ అకౌంట్లను షేరింగ్ చేస్తున్నారు. వీరిలో ఎవరికి అదనపు ఛార్జీలకు సంబంధించి నోటిఫికేషన్‌ రాలేదు. దీనిపై Netflix ప్రతినిధి రెస్ట్ ఆఫ్ వరల్డ్‌తో మాట్లాడుతూ.. కొత్త పాలసీ రోల్ అవుట్ ప్రోగ్రెస్‌లో ఉందన్నారు. తద్వారా వివిధ నెట్ ఫ్లిక్స్ సబ్‌స్క్రైబర్‌లకు వేర్వేరుగా ఛార్జీలు విధించనున్నట్టు వెల్లడించారు.

Netflix Starts Charging Users For Password Sharing

నెట్‌ఫ్లిక్స్ కొత్త విధానం భారత్‌కు కూడా వర్తిస్తుందా?
నెట్‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్ షేరింగ్‌ను నిరోధించాలని ఓటీటీ దిగ్గజం ఎప్పటినుంచో యోచిస్తోంది. ప్రస్తుతం పెరూ, చిలీ కోస్టారికాలో మాత్రమే ఈ విధానం అందుబాటులోకి వచ్చింది. అక్కడి కస్టమర్‌లకు అదనపు ఛార్జీలు వర్తించనున్నాయి. ఈ కొత్త విధానం భారత్ సహా ఇతర దేశాలకు వర్తించదని అర్థం కాదు. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ ఎంపిక చేసిన కొన్ని దేశాల్లో మాత్రమే అమల్లోకి తీసుకొచ్చి టెస్టింగ్ చేస్తోంది. రానున్న రోజుల్లో ఈ కొత్త పాలసీని మరిన్ని దేశాలకు విస్తరించే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతానికి, ఈ కొత్త విధానం భారత్ కూడా వర్తిస్తుందనడంలో ఎలాంటి సమాచారం లేదు. సో.. భారత నెట్ ఫ్లిక్స్ యూజర్లు టెన్షన్ పడక్కర్లేదు.. ఎవరికైనా పాస్‌వర్డ్ షేర్ చేసుకోవచ్చు..ఎప్పుడు వర్తింపజేస్తారనే దానిపై ఎటువంటి సమాచారం లేదు. కాబట్టి, భారతీయ వినియోగదారులు ప్రస్తుతానికి విశ్రాంతి తీసుకోవచ్చు.

Read Also : Netflix: నెట్‌ఫ్లిక్స్ సంచలన నిర్ణయం, 150మంది ఉద్యోగులపై వేటు

ట్రెండింగ్ వార్తలు