Netflix : దిగొచ్చిన నెట్‌ఫ్లిక్స్.. కొత్త కస్టమర్ల కోసం చౌకైన ప్లాన్లతో వస్తోంది..!

ఓటీటీ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ దిగొచ్చింది. ఇప్పటివరకూ భారీ స్ట్రీమింగ్ ప్లాన్లతో వినియోగదారులకు చుక్కలు చూపించినా నెట్ ఫ్లక్స్ ఎట్టకేలకు ప్లాన్లపై వెనక్కి తగ్గింది.

Netflix Cheaper Plan : ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ దిగొచ్చింది. ఇప్పటివరకూ భారీ స్ట్రీమింగ్ ప్లాన్లతో వినియోగదారులకు చుక్కలు చూపించినా నెట్ ఫ్లక్స్ ఎట్టకేలకు ప్లాన్లపై వెనక్కి తగ్గింది. రోజురోజుకీ సబ్ స్ర్కైబర్లు తగ్గిపోవడంతో పాటు అదనపు భారం పెరిగిపోయింది. దాంతో చేసేది ఏమిలేక తమ ఉద్యోగుల్లో 300 మందికిపైగా నెట్ ఫ్లిక్స్ తొలగించింది. ఇప్పుడు కొత్త సబ్ స్ర్కైబర్లను ఆకర్షించేందుకు Netflix త్వరలో చౌకైన ప్లాన్‌లను ప్రవేశపెట్టనుంది.

నెట్‌ఫ్లిక్స్ గత ఏడాదిలో దాదాపు 2 లక్షల మంది ఫాలోవర్లను కోల్పోయిందని ఓ నివేదిక వెల్లడించింది. ఆదాయ వృద్ధి కూడా నెమ్మదించడం కారణంగా స్ట్రీమింగ్ దిగ్గజం 300 మందికి పైగా ఉద్యోగులను వదులుకుంది. చాలా మంది పెయిడ్ సబ్‌స్క్రైబర్‌లు యాప్‌ను అన్‌సబ్‌స్క్రయిబ్ చేసుకోవడం నిర్వాహణ ఖర్చు భారీగా పెరిగిపోయింది. నెట్ ప్లిక్స్ యూజర్లు యాడ్ ప్రీ ప్లాన్లను భరించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ, సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లు తక్కువగా ఉండాలని భావిస్తున్నారు.

Netflix To Bring A Cheaper Plan Soon, Here’s Everything We Know About It Right Now

పాస్‌వర్డ్-షేరింగ్ వంటి ఇతర అంశాలు కంపెనీ కష్టాల్లో నెట్టేశాయి. అయినప్పటికీ, నెట్ ఫ్లిక్స్ ఇప్పుడు యాడ్-సపోర్టెడ్ చౌకైన ప్లాన్‌లను తీసుకోచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. Netflix సీఈఓ టెడ్ సరండోస్ Netflix ఊహించిన దాని కంటే త్వరగా యాడ్-సపోర్టెడ్ ప్లాన్‌లను రిలీజ్ చేయనున్నట్టు ఈవెంట్‌లో ధృవీకరించారు. కేన్స్ లయన్స్ అడ్వర్టైజింగ్ ఫెస్టివల్‌లో జరిగిన ఇంటర్వ్యూలో యాడ్-సపోర్టెడ్ టైర్‌ను ఆవిష్కరించనున్నట్టు నివేదిక ధృవీకరించింది. ఈ ఏడాది చివరి నాటికి కంపెనీ ప్లాన్‌లను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు ది న్యూయార్క్ టైమ్స్ నివేదిక ధృవీకరించింది.

నెట్‌ఫ్లిక్స్ పోటీదారులైన HULU, Disney, HBO సహా ఇతర ఓటీటీ సంస్థలు సాధించిన విజయాలతో యాడ్-సపోర్టెడ్ చౌకౌన ప్లాన్‌లను ప్రవేశపెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్టు ఆయన వెల్లడించారు. ఆసక్తికరంగా.. భారత్‌లో ఇతర నెట్‌ఫ్లిక్స్ పోటీదారులు చౌకైన యాడ్-సపోర్టెడ్ ప్లాన్‌లను అందిస్తున్నారు. Disney+ Hotstar, Zee5, Voot, MX Player వంటి స్ట్రీమింగ్ కంపెనీలు తమ యూజర్లకు యాడ్-సపోర్ట్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను అందిస్తున్నాయి.

Read Also : Netflix Employees : నెట్‌ఫ్లిక్స్‌కు ఏమైంది.. మరో 300 మంది ఉద్యోగుల తొలగింపు.. అసలు కారణాలివే..!

ట్రెండింగ్ వార్తలు