బాబోయ్.. బిల్లు కట్టేదెట్టా : కేబుల్, డీటీహెచ్ ఛానళ్లు వెరీ కాస్ట్‌లీ 

కేబుల్, డీటీహెచ్ వినియోగదారులకు నెల వచ్చేసరికి బిల్లు తడిసి మోపడు అవుతోంది.

  • Published By: sreehari ,Published On : March 30, 2019 / 07:52 AM IST
బాబోయ్.. బిల్లు కట్టేదెట్టా : కేబుల్, డీటీహెచ్ ఛానళ్లు వెరీ కాస్ట్‌లీ 

Updated On : March 30, 2019 / 7:52 AM IST

కేబుల్, డీటీహెచ్ వినియోగదారులకు నెల వచ్చేసరికి బిల్లు తడిసి మోపడు అవుతోంది.

కేబుల్, డీటీహెచ్ వినియోగదారులకు నెల వచ్చేసరికి బిల్లు తడిసి మోపడు అవుతోంది. నచ్చిన టీవీ ఛానళ్లను మాత్రమే ఎంచుకోండి అంటూ టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) తీసుకొచ్చిన కొత్త టారిఫ్ విధానం టీవీ వీక్షకులకు భారంగా మారుతోంది. ట్రాయ్ టారిఫ్ విధానం అమల్లోకి రాకముందు చెల్లించే టీవీ బిల్లు కంటే కొత్త టారిఫ్ విధానం వచ్చాక చెల్లించే టీవీ బిల్లు భారీగా పెరిగిపోయింది.
Read Also : మీరు SBI కస్టమరా..? మీకు బ్యాంకు విధించే 5 ఛార్జీలు ఏంటో తెలుసా?

ప్రస్తుతం చెల్లించే బిల్లుపై వందల ఛానళ్లు వచ్చేవి. అందులో అవసరం లేని ఛానళ్లే ఎక్కువగా ఉండేవి. రోజూ చూసే పాపులర్ ఛానళ్లు అన్ని రావడంతో ప్రేక్షకులకు దిగులు ఉండేది కాదు. ఇప్పుడు అలా లేదు. నచ్చిన ఛానళ్లు ఒకటి ఎక్కువగా సెలెక్ట్ చేసుకున్నా దానికి అదనంగా చెల్లించాల్సి వస్తోంది.

ఛానళ్ల ఎంపిక.. మార్చి 31 డెడ్ లైన్.. 
పాపులర్ ఛానళ్లు పూర్తిగా సెలెక్ట్ చేసుకుంటే.. నెలసరి బిల్లు భారీగా పెరిగిపోతోంది. ప్యాకేజీల రూపంలో ఛానళ్లను ఎంచుకున్నప్పటికీ బిల్లు మాత్రం తగ్గే పరిస్థితి లేదు. నచ్చిన ఛానళ్లను వదులుకోలేక.. భారీ మొత్తంలో బిల్లులు చెల్లించలేక కస్టమర్లు బావురుమంటున్నారు. నెలవచ్చేసరికి బిల్లు కట్టేదెట్టరా బాబోయ్ అంటున్నారు. కేబుల్ వినియోగదారుల నుంచి డీటీహెచ్ వినియోగదారులు అందరికి ఇదే పరిస్థితి ఎదురువుతోంది. ఇప్పటికి ట్రాయ్ కొత్త టారిఫ్ విధానాన్ని ఎంచుకొని వినియోగదారులు ఉన్నారు. వీరికోసం ట్రాయ్ మార్చి 31 వరకు డెడ్ లైన్ విధించింది. ఇప్పటికే కొత్త టారిఫ్ విధానం ఎంపిక విషయంలో రెండుసార్లు ట్రాయ్ గడువు పొడిగించింది. 

కస్టమర్ల జేబుకు చిల్లే : 
డిసెంబర్ 28, 2018లో ఒకసారి, 2019 ఫిబ్రవరి 8న రెండోసారి పొడిగించింది. ట్రాయ్ కొత్త టారిఫ్ ఆర్డర్ పై ఎన్నో ఏజెన్సీలు నివేదికలు వెల్లడించాయి. ఈ కొత్త విధానంతో వినియోగదారుల జేబులు చిల్లులు పడటం ఖాయమని చెబుతూనే ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో క్రిసిల్ అనే ఏజెన్సీ ట్రాయ్ టారిఫ్ విధానంపై నివేదికను వెల్లడించింది. కేబుల్, డీటీహెచ్ వినియోగదారుల్లో మెజార్టీ కస్టమర్లు 25శాతం టీవీ బిల్లులు పెరుగుతాయని అంచనా వేసింది. బ్రాడ్ క్యాస్టర్లు అందించే ఛానళ్ల ధరలు కూడా పెరిగినట్టు ఐసీఆర్ఐఈఆర్, ఐసీఆర్ఏ రిపోర్ట్ తెలిపాయి. ‘డీటీహెచ్ వినియోగదారులకు అందించే SD ఛానళ్లు.. ట్రాయ్ కొత్త టారిఫ్ కు ముందు నెలకు రూ.5.56 మాత్రమే ఉండేవి. ఇప్పుడు SD ఛానళ్లు ధర నెలకు రూ.6.05 వరకు పెరిగింది.

ఇక ఎంటర్ టైన్ మెంట్ ఛానళ్లకు డిమాండ్ పెరగడంతో.. మూవీస్, స్పోర్ట్స్ ఛానళ్ల ధరలు కూడా 100 శాతం మేర పెరిగిపోయాయి. ప్రీమియం కంటెంట్, HD ఛానళ్ల సగటు ధర కాస్త తగ్గింది. ట్రాయ్ ఆర్డర్ కు ముందు HD ఛానళ్ల ధర రూ. 48.2 ఉంటే.. ఇప్పుడు రూ.30.60 కు తగ్గిపోయింది. మొత్తం పే ఛానళ్లు 332 ఉంటే.. SD ఛానళ్లు 232.. HD ఛానళ్లు 100 వరకు ఉన్నాయి. మరోవైపు ట్రాయ్ నిబంధనలను అమలు చేయడంలో బ్రాడ్ క్యాస్టర్లు ధరలను నిర్ణయించడం కష్టంగా మారింది. ట్రాయ్ ఆర్డర్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి బ్రాడ్ క్యాస్టర్లు 83 వేర్వేరు ఛానళ్లు, 33 ప్యాకేజీ (బాంక్వెట్) ప్యాక్ లను సవరించారు. కొత్తగా 132 కొత్త ప్యాకేజీలను వినియోగదారుల కోసం క్రియేట్ చేసినట్టు icra నివేదిక తెలిపింది. 

పే ఛానళ్లు పెరిగితే.. నెలసరి బిల్లు భారం :
పాపులర్ ఛానళ్ల విషయానికి వస్తే మాత్రం.. ఒక్కొక్క ఛానల్ ధర ఎక్కువగా ఉండటంతో వినియోగదారులపై మరింత భారం పడుతోంది. పాపులర్ ఛానళ్లలో ఒక్కో ఛానల్ ధర నెలకు రూ.19 వరకు చెల్లించాల్సి వస్తోంది. ఒకవేళ.. పాపులర్ ఛానళ్లను రెండుకు మించి సెలెక్ట్ చేసుకుంటే (ఎంటర్ టైన్ మెంట్, స్పోర్ట్స్) నెలసరి బిల్లు 13శాతం నుంచి 23 శాతం వరకు భారీగా పెరిగిపోతుంది. దీంతో పే ఛానళ్లను వీక్షించే వారిసంఖ్య తగ్గడానికి కారణమవుతోందని ఐసీఆర్ఏ వైస్ ప్రెసిడెంట్ సాక్షి సునేజా చెప్పారు. కేబుల్, డీటీహెచ్ వినియోగదారుల నెలసారి బడ్జెట్ సాధారణంగా రూ.230 నుంచి రూ. 240 వరకు ఉంటే.. 250 నుంచి 300 ఛానళ్లు వీక్షించే అవకాశం ఉంది.

ఇదే బడ్జెట్ పై ఇప్పుడు కేవలం మూడు పాపులర్ ఛానళ్లు, ఒక స్పోర్ట్ ఛానల్ మాత్రమే వీక్షించవచ్చు. ఒకవేళ స్పోర్ట్స్, న్యూస్, మూవీ ఛానళ్లు మాత్రమే ఎంచుకుంటే.. నెలసారి బిల్లు 15శాతం వరకు పెరుగుతుంది. ఎ-ఎల్ఎ-కార్టే కేటగిరీ కింద వినియోగదారులకు డిస్కౌంట్ (40శాతం నుంచి 50 శాతం) వరకు ప్యాకేజీ ఛానళ్లు అందిస్తే అది సబ్ స్ర్కిప్షన్ ప్యాటరన్ పై ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో నెలసరి బిల్లులు పెరిగే కొద్ది మల్టీ టీవీ కనెక్షన్లు తగ్గిపోయే అవకాశం ఉంది. 
Read Also : లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై జగన్ కామెంట్లు