Nexzu launches E-Cycle
E-Cycles : ప్రస్తుతం మార్కెట్ లో వాహనాల విషయంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతుండడంతో ఎలక్ట్రిక్ వాహనాల వైపు వినియోగదారులు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికు బైక్స్, కార్లు రోడ్లపై రయ్యి రయ్యి మంటూ దూసుకెళుతున్నాయి. ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలతో.. ఎలక్ట్రానిక్ వాహనాల వాడకం పెరుగుతోంది. తాజాగా..ఓ కంపెనీ ఈ సైకిల్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది. ఇంట్లో పనులు, కొద్ది దూరంలో వెళ్లాలని అనుకొనే వారికి ఈ సైకిల్ బాగా ఉపయోగపడుతుందని నెక్స్ జు మొబిలిటీ కంపెనీ వెల్లడించింది.
దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 100 కిలోమీటర్లు వెళ్లనుందని వెల్లడించింది. అసలు తొక్కాల్సిన అవసరం కూడా లేదంటోంది. నెక్స్‌జు మొబిలిటీ రోంపస్, రోంపస్ +, రోడ్‌లార్క్, రోడ్‌లార్క్ కార్గో వంటి ఎలక్ట్రిక్ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి.
ఇక సైకిల్ విషయానికి వస్తే…డిస్క్ బ్రేకలున్నాయి. సరుకులు, సామాన్లు తీసుకెళ్లవచ్చు. గంటకు 25 కిలోమీటర్ల వేగంతో వెళుతాయి. ఛార్జింగ్ అయిపోతే..పెడల్స్ తొక్కుతూ..వెళ్లవచ్చని కంపెనీ వెల్లడించింది. వీటిని నడపడానికి డ్రైవింగ్ లెసెన్స్ అవసరం లేదని, రిజిస్ట్రేషన్ కూడా అక్కర్లేదని తెలిపింది. మార్కెట్ ధర రూ. 42 వేలుగా ఉంది. కంపెనీ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు.
Read More : Serum Institute : జూన్ లో 10కోట్ల వ్యాక్సిన్ డోసులు ఇస్తాం..సీరం